Home> వినోదం
Advertisement

Shraddha Srinath: బాయ్ ఫ్రెండ్ కోసం టాటు…తన లవ్ స్టోరీ బయటపెట్టిన శ్రద్ధ శ్రీనాథ్

Saindhav: జెర్సీ సినిమాతో మనందరినీ ఎంతగానో ఆకట్టుకున్న హీరోయిన్ శ్రద్ధ శ్రీనాథ్. ఇక ప్రస్తుతం ఈ నటి వెంకటేష్ సైంధవ్ సినిమా ద్వారా మన ముందుకి రానుంది. ఈ చిత్రం ప్రమోషన్స్ లో భాగంగా తన గుండెల పై ఉన్న టాటు గురించి ఇంట్రెస్టింగ్ విషయం బయట పెట్టింది శ్రీనాథ్.

Shraddha Srinath: బాయ్ ఫ్రెండ్ కోసం టాటు…తన లవ్ స్టోరీ బయటపెట్టిన శ్రద్ధ శ్రీనాథ్

Shraddha Srinath Tattoo: బ్యూటిఫుల్ లుక్స్ తో అందానికి నిర్వచనంలా ఉండే కన్నడ బ్యూటీ శ్రద్దా శ్రీనాథ్‌ తెలుగులో బాగా క్రేజ్ తెచ్చుకుంది. మంచి హిట్ సాధించిన జెర్సీ మూవీతో ఈ బ్యూటీ కి తెలుగు ఇండస్ట్రీలో నటిగా సూపర్ క్రేజ్ వచ్చింది. అయితే వచ్చిన ప్రతి సినిమాకి ఒకే చెప్పకుండా మనసుకు నచ్చిన స్క్రిప్ట్లు మాత్రమే చూస్ చేసుకుంటూ చాలా సెలెక్టివ్ గా సినిమాలు చేస్తూ వస్తోంది. కాగా చాలా గ్యాప్ తర్వాత ఈ సంక్రాంతి బరిలో దిగనున్న వెంకీ మామ సైంధవ్‌ చిత్రంలో ప్రేక్షకులను పలకరించడానికి సిద్ధంగా ఉంది ఈ బ్యూటీ.

వెంకటేష్, శైలేష్ కొలను కాంబోలో వస్తున్న ఈ చిత్రం జనవరి 13న విడుదలకు సిద్ధంగా ఉంది. తండ్రి కూతుర్ల ఎమోషనల్ ట్రాక్ తో సాగే ఈ చిత్రంలో వెంకీ మామ మరొక్కసారి ఫ్యామిలీ ఆడియన్స్ను ఎంటర్టైన్ చేయబోతున్నాడు. మరోపక్క చాలా రోజుల గ్యాప్ తర్వాత శ్రద్దా శ్రీనాథ్ హీరోయిన్ గా ఈ మూవీలో కనిపిస్తోంది. 

ఇక ఈ చిత్రం ప్రమోషన్స్ లో పాల్గొన్న శ్రద్ధ శ్రీనాథ్.. తాను చేసే సెలెక్టివ్ మూవీస్ గురించి.. అలానే తన చేతి పై ఉన్న టాటూ గురించి ఇంట్రెస్టింగ్ వ్యాఖ్యలు చేసింది. శ్రద్దా శ్రీనాథ్ రీసెంట్ గా మాట్లాడింది. ఏదో ఒక సినిమా చేయాలి.. డబ్బులు బాగా సంపాదించాలి అన్న ఉద్దేశంతో తాను ఇండస్ట్రీలోకి రాలేదు అంటుంది ఈ ముద్దుగుమ్మ. మనసుకు నచ్చిన పాత్రలు.. నటిగా తనను తాను నిరూపించుకునే స్కోప్ ఉన్న క్యారెక్టర్స్.. ఉన్న సినిమాలు మాత్రమే చేస్తుందట. ఏదో ఒక సినిమా చేసేయాలి అన్న ఉద్దేశం అయితే తనకు లేదు అని స్పష్టంగా చెప్పింది.

అంతేకాదు లవ్ ట్రాక్ తో పాటు బ్రేకప్ లాంటి కాన్సెప్ట్స్ తో ఉండే మూవీస్ అంటే తనకు చాలా ఇష్టం అని చెప్పి అందరిని ఆశ్చర్యపరిచింది. కృష్ణ అండ్ హిజ్ లీలా, జెర్సీ వంటి ఎమోషనల్ డ్రామా ఉన్న డిఫరెంట్ జానర్లు  ఎంచుకోవడానికి కారణం అదే అని కూడా అసలు విషయం బయట పెట్టింది. 

ఇక ఆమె గుండెల పైన ఉన్న టాటూ గురించి అడిగినప్పుడు.. అది కూడా గమనిస్తారా అని శ్రద్దా శ్రీనాథ్  షాక్ అయ్యింది. దాని వెనకున్న అసలు విషయం చెబుతూ 18 ఏళ్ల వయస్సులోనే తాను ప్రేమలో పడ్డానని, దానికి గుర్తుగానే ఆ టాటూను వేయించుకున్నట్లు ఆమె తెలిపింది. ‘బీటిల్స్ అనే బ్రాండ్ ఒకటి ఉంది. నా టాటూపై ఉన్నది ఆ బ్యాండ్ ఆల్బమ్ కవరే. లవ్ అని దీనికి అర్థం. నాకు 18 ఏళ్ల వయస్సులో ఓ అబ్బాయి అంటే చాలా క్రష్ ఉండేది. అతడే నాకు బీటిల్స్ బ్యాండ్ ను పరిచయం చేశాడు. అలా ఆ రెండు ఇష్టాలు కలిసి ఈ టాటూ వేయించుకున్నాను అని చెప్పుకొచ్చింది. ప్రస్తుతం ఈ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో తెగ వైరల్ గా మారాయి.

Also Read: Ys Sharmila: వైఎస్ షర్మిల కుమారుడి పెళ్లి ఫిబ్రవరి 17న, ప్రకటించిన వైఎస్ షర్మిల

Also read: Japan Earthquake Updates: జపాన్ భూకంపంలో 57కు చేరిన మరణాలు, ఒళ్లు గగుర్పొడిచే వీడియోలు వైరల్

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Read More