Home> వినోదం
Advertisement

Jathiratnalu movie: నవీన్ పోలిశెట్టి, ప్రియదర్శిలకు రాహుల్ వార్నింగ్ ఇచ్చాడా

Jathiratnalu movie: జాతిరత్నాలు సినిమా. తెలుగు సినీ పరిశ్రమలో టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీగా మారిపోయారు ఆ మగ్గురు నటులు. సినిమాలో ఈ ముగ్గురు చేసిన రచ్చకు రికార్డు బద్దలవుతున్నాయి. ఇప్పుడీ ముగ్గురిలో ఇద్దరి మధ్య జరిగిన గొడవకు సంబంధించి వీడియో వైరల్ అవుతోంది. అదేంటో చూద్దాం.

Jathiratnalu movie: నవీన్ పోలిశెట్టి, ప్రియదర్శిలకు రాహుల్ వార్నింగ్ ఇచ్చాడా

Jathiratnalu movie: జాతిరత్నాలు సినిమా. తెలుగు సినీ పరిశ్రమలో టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీగా మారిపోయారు ఆ మగ్గురు నటులు. సినిమాలో ఈ ముగ్గురు చేసిన రచ్చకు రికార్డు బద్దలవుతున్నాయి. ఇప్పుడీ ముగ్గురిలో ఇద్దరి మధ్య జరిగిన గొడవకు సంబంధించి వీడియో వైరల్ అవుతోంది. అదేంటో చూద్దాం.

టాలీవుడ్(Tollywood)‌లో ఇప్పుడు ఏ నోట విన్నా జాతిరత్నాలు సినిమా(Jathiratnalu movie) గురించే. నవీన్ పోలిశెట్టి, రాహుల్ రామకృష్ణ, ప్రియదర్శి చేసిన రచ్చకు సినిమా రికార్డులు బ్రేక్ చేస్తోంది. నిజంగానే జాతిరత్నాల్లా మెరిసిపోతున్నారు. అప్పుడే 20 కోట్లకు పైగా లాభాలు వచ్చాయని టాక్. సినిమా ప్రమోషన్ కూడా విభిన్నంగా ప్లాన్ చేశారు. సినిమా విడుదలైన 9 రోజుల్లో 35 కోట్లు వసూలు చేసింది. ఓ వైపు నవీన్ పోలిశెట్టి, ప్రియదర్శిలు అమెరికాలో ఎంజాయ్ చేస్తుంటే దర్శక నిర్మాతలిద్దరూ సక్సెస్ టూర్ చేపడుతున్నారు. అమెరికాలో ఉన్న ఈ ఇద్దరూ అక్కడ్నించే రకరకాల వీడియోలు పోస్ట్ చేస్తూ రచ్చ చేస్తున్నారు. ఆ వీడియోలన్నీ వైరల్ అవుతున్నాయి. దాంతో మూడోవాడైన రాహుల్ రామకృష్ణ ఆ ఇద్దరికీ వార్నింగ్ ఇస్తూ ఓ వీడియో విడుదల చేశాడు. ఇప్పుడీ వీడియోనే సంచలనంగా మారింది. నవీన్ పోలిశెట్టి (Navin polishetty), ప్రియదర్శి(Priyadarshi)లకు వార్నింగ్ ఇస్తూ విడుదల చేసిన వీడియో అది. 

అరేయ్ దర్శి..నవీన్..పీపుల్స్ ప్లాజాలో సక్సెస్ మీట్ తరువాత మిమ్మల్ని కలిసేలోపే పాస్‌పోర్ట్‌తో ఎయిర్‌పోర్ట్‌కు వెళ్లి, విమానమెక్కి యూఎస్ వెళ్లిపోతారా..నేను చెప్పా కదరా..నా దక్కర కూడా పాన్‌కార్డు ఉందని..పాన్‌కార్డు చూపిస్తే అక్కడ ఎంట్రీ ఇచ్చేస్తార్రా..నేను జోగిపేట రవిరా..నా వల్ల ప్రాబ్లమ్ అవుతుందని నన్ను వదిలేసి వెళ్లిపోయారా..మీరు రండ్రా...మీ సంగతి చూస్తా..అంటూ వార్నింగ్ ఇచ్చారు రాహుల్ రామకృష్ణ( Rahul Ramakrishna). ఈ వీడియో చూసి నిజంగా వార్నింగ్ అనుకోకండి..కేవలం సరదా కోసం..సినిమా ప్రమోషన్ కోసం విడుదల చేసిన వీడియోనే ఇది. నిజంగా ముగ్గురి మధ్య గొడవ జరిగింది కాదు. 

Also read: Shweta tiwari: నాలుగు పదులు దాటినా చెక్కు చెదరని అందం శ్వేతా తివారీ సొంతం

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Read More