Home> వినోదం
Advertisement

Jailer Success: జైలర్ సక్సెస్ కంటిన్యూ.. అనిరుధ్‌కు అదిరిపోయే గిఫ్ట్ ఇచ్చిన కళానిధి మారన్..

Jailer Movie: 'జైలర్' సక్సెస్ లో తేలిపోతున్నారు ప్రముఖ నిర్మాత కళానిధి మారన్‌. ఈ జోష్‌లోనే వరుసగా మ మూవీ యూనిట్ కు వరుసగా అదిరిపోయే గిప్ట్స్  ఇస్తున్నారు. తాజాగా సంగీత దర్శకుడు అనిరుధ్‌ ఊహించని సర్ ప్రైజ్ ను ఇచ్చారు నిర్మాత. 
 

Jailer Success: జైలర్ సక్సెస్ కంటిన్యూ.. అనిరుధ్‌కు అదిరిపోయే గిఫ్ట్ ఇచ్చిన కళానిధి మారన్..

Jailer Success Celebrations:  సూపర్ స్టార్ రజినీకాంత్ నయా మూవీ 'జైలర్'(Jailer Movie) . నెల్సన్ దిలీప్ దర్శకత్వం వహించిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద కాసుల వర్షం కురిపించింది. సుమారు రూ.650 కోట్లకుపైగా వసూలు చేసింది. ఆగస్టు 10న రిలీజైన ఈ సినిమా ఇప్పటికీ థియేటర్లలో హౌస్ ఫుల్ కలెక్షన్స్ తో విజయవంతంగా రన్ అవుతుంది. ఈ సినిమా తెలుగు, తమిళ్ భాషల్లో విడుదలై ఘన విజయం సాధించింది. 

జైలర్ సినిమా సక్సెస్ కావడంతో మూవీ ప్రొడ్యూసర్ కళానిధి మారన్(Kalanithi Maran) చిత్రయూనిట్ కు వరుసగా గిఫ్ట్స్ ఇస్తూ అదరగొడుతున్నారు. ఇప్పటికే సూపర్ స్టార్ రజినీకాంత్ కు 100 కోట్ల రూపాయల చెక్ తోపాటు ఓ కాస్ట్ లీ కారును బహుమతిగా ఇచ్చారు. అలాగే దర్శకుడు నెల్సన్ దిలీప్ కు కూడా కళానిధి మారన్ ఖరీదైన కారును గిఫ్ట్ గా ఇచ్చారు. తాజాగా మ్యూజిక్ సెన్సేషన్ అనిరుధ్ రవిచందన్ కు కూడా ఓ సర్ ప్రైజ్ ఇచ్చారు నిర్మాత. మూడు కాస్ట్ లీ కార్లను చూపించి.. అందులో నచ్చిన కారును సెలక్ట్ చేసుకోమన్నారు. దాంతో అనిరుధ్ ఓ కారును ఎంపిక చేసుకున్నాడు. తాజాగా దీనికి సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అవుతుంది. 

Also Read: Kushi Movie: 'ఖుషి' సూపర్ సక్సెస్.. ఫ్యాన్స్‌కు కోటి రూపాయలు ప్రకటించిన విజయ్..

ఇదిలా ఉంటే త్వరలో ఈ మూవీ ఓటీటీ స్ట్రీమింగ్ (Jailer ott streaming) రానుంది. ఈ సినిమా డిజిటల్ రైట్స్ ను ప్రముఖ ఓటీటీ సంస్థ అమెజాన్ ప్రైమ్ దక్కించుకుంది. సెప్టెంబర్ 7 నుంచి ఈ మూవీ అమెజాన్ ప్రైమ్ లో అందుబాటులోకి రానుంది. జైలర్ మూవీలో రజనీకి జోడిగా తమన్నా నటించింది. ఇందులో రమ్యకృష్ణ, శివరాజ్ కుమార్, మోహన్ లాల్, జాకీ ష్రాఫ్ తదితరుల కీ రోల్స్ చేశారు.

Also Read: Shahrukh Khan: తిరుమల శ్రీవారి సన్నిదిలో బాలీవుడ్ నటుడు షారుఖ్ ఖాన్ 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Read More