Home> వినోదం
Advertisement

బికినీ ధరించే పాత్ర చేయనని సినిమా తిరస్కరించిన నటుడు

బికినీ వేసుకుని క్లీన్‌గా కనిపించమని అడిగారు.. అయితే, ఆ సీన్ నా వల్ల కాదని ఏకంగా ఆ సినిమాకే నో చెప్పానంటున్న నటుడు

బికినీ ధరించే పాత్ర చేయనని సినిమా తిరస్కరించిన నటుడు

బాలీవుడ్‌లో పేరున్న నటుల్లో జాకీష్రాఫ్ కూడా ఒకరని ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు. హీరోగానే కాకుండా క్యారెక్టర్ ఆర్టిస్టుగా, విలన్‌గా భిన్నరకాల పాత్రలు చేసిన జాకీష్రాఫ్ ఇటీవల ఓ టీవీ చాట్ షోకు హాజరై తన గత అనుభవాలను అభిమానులతో పంచుకున్నారు. బాలీవుడ్ నటి నేహా దూపియా హోస్ట్ చేస్తోన్న బీఎఫ్ఎఫ్ విత్ వోగ్ షోకు ప్రముఖ బాలీవుడ్ నటి జూహీ చావ్లాతో కలిసి పాల్గొన్న జాకీష్రాఫ్ అనేక ఆసక్తికరమైన అంశాలు వెల్లడించారు. తనతో కలిసి పనిచేసిన ప్రముఖ సినిమా తారలు అందరిపై మనసు పారేసుకున్నానని చెప్పిన జాకీష్రాఫ్.. తనతో సినిమాలు చేసిన జూహీచావ్లా, మాధురి దీక్షిత్, డింపుల్ కపాడియా లాంటి వాళ్లపై ఇప్పటికీ సాఫ్ట్ కార్నర్ వుందని అన్నాడు. అది కేవలం సాఫ్ట్ కార్నర్ మాత్రమేనని, అంతకు మించి ఇంకేం కాదని చెప్పుకొచ్చాడు.

fallbacks

అయితే, కెరీర్‌లో ఎవరైనా తనతో సినిమా వద్దనుకున్న సందర్భాలు ఏమైనా వున్నాయా అనే ప్రశ్నకు స్పందించిన జగ్గూ దాదా ( బాలీవుడ్ సినీ ప్రముఖులు జాకీష్రాఫ్‌ని పిలుచుకునే ముద్దు పేరు).. అటువంటిదేం లేదు కానీ.. తానే ఓ సినిమా చేయనని తిరస్కరించాను అని అన్నాడు. తనని ఓ సినిమాలో బికిని ధరించాల్సిందిగా అడిగారని, అందుకు ససేమిరా ఇష్టం లేని తాను ఆ ప్రాజెక్టుకి నో చెప్పానని తెలిపాడు. 

ప్రస్తుతం అమీర్ ఖాన్ హీరోగా సెట్స్‌పై వున్న థగ్స్ ఆఫ్ హిందుస్థాన్ సినిమాలోనూ జాకీష్రాఫ్‌కి నటించే అవకాశం వచ్చింది. అయితే, అప్పటికే జేపీ దత్తా తెరకెక్కిస్తున్న పల్టాన్ సినిమాకు సైన్ చేసి వుండటంతో జగ్గూ దాదాకు డేట్స్ కుదరలేదు. అందువల్లే అమీర్ ఖాన్‌తో ఆ సినిమా చేయలేకపోయానని, అందుకు తానేమీ ఫీల్ అవడం లేదని వివరించాడు.

Read More