Home> వినోదం
Advertisement

Anchor Sowmya Dance: బాలయ్య పాటకు యాంకర్ సౌమ్య అదిరిపోయే స్టెప్పులు.. ఆ గ్రేస్ చూడు!

Jabardasth Anchor Sowmya Dance: సౌమ్య శారద రావు అనే కన్నడ నటీమణిని మల్లెమాల సంస్థ జబర్దస్త్ యాంకర్ గా రంగంలోకి దింపగా ఆమె సోషల్ మీడియాలో రచ్చ చేస్తోంది. తాజాగా ఆమె షేర్ చేసిన వీడియో వైరల్ అవుతోంది. 

Anchor Sowmya Dance: బాలయ్య పాటకు యాంకర్ సౌమ్య అదిరిపోయే స్టెప్పులు.. ఆ గ్రేస్ చూడు!

Jabardasth Anchor Sowmya Dance to Balakrishna Song: సౌమ్య శారద రావు అనే కన్నడ నటీమణిని మల్లెమాల సంస్థ జబర్దస్త్ యాంకర్ గా రంగంలోకి దింపిన సంగతి తెలిసిందే. కన్నడ నాట సీరియల్ నటీమణిగా కొనసాగుతున్న ఆమెను జబర్దస్త్ యాంకర్ గా రంగంలోకి దింపినప్పటి నుంచి షో మీ ద కన్నడ అభిమానులు సైతం ప్రేమ కురిపిస్తున్న దాఖలాలు ఎక్కువయ్యాయి. ఇక ఈ షోలో భాగమైన తరువాత సౌమ్య కూడా సోషల్ మీడియాలో చాలా యాక్టివ్గా మారింది.

గతంలో నటీమణిగా ఉన్నప్పుడు పెద్దగా సోషల్ మీడియాలో యాక్టివ్గా లేని ఈ భామ ఇప్పుడు యాంకర్ గా మారిన తర్వాత తన వీడియోలను సోషల్ మీడియాలో షేర్ చేస్తూ వస్తోంది. తాజాగా సౌమ్య అమిగోస్ మూవీ నుంచి ఒక సాంగ్ కి రీల్ చేసి దాన్ని సోషల్ మీడియాలో షేర్ చేసింది. నందమూరి బాలకృష్ణ హీరోగా నటించిన ఒక సినిమా నుంచి ఎన్నో రాత్రులు వస్తాయి గాని అనే సాంగ్ ని కళ్యాణ్ రామ్ హీరోగా నటించిన అమిగోస్ సినిమా కోసం రీమిక్స్ చేసిన సంగతి తెలిసిందే.

ఆ పాట సూపర్ హిట్ అయింది గానీ అమిగోస్  సినిమా మాత్రం ప్రేక్షకుల ఆదరణ పొందలేకపోయింది. అయితేనేమి ఆ పాటతో ఇప్పుడు సౌమ్య శారద రావు చేస్తున్న డాన్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఆమె అభిమానులు ఆమె చేస్తున్న డాన్స్ కి ఫిదా అవుతూ వరుస కామెంట్లు పెడుతున్నారు.

 
 
 
 

 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Sowmya Rao (@sowmya.sharada)

మీరు సూపర్ మేడం మీ డాన్స్ కూడా సూపర్ మేడం అంటూ అభిమానులు కామెంట్లు పెడుతున్న పరిస్థితి కనిపిస్తోంది. ఇక కొంతమంది నటీనటులు కూడా ఆమె డాన్స్ కు ఫిదా ఈ కామెంట్లు చేస్తున్నారు. మీ మూమెంట్స్ కేక అంటూ కూడా కొందరు నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు. ఆమె ఫోటోలకు కూడా మంచి ఆదరణ లభిస్తోంది. కన్నడ అభిమానులు కూడా ఉండడంతో ఆమెకు మరింత ప్లస్ అయింది. ఇంకెందుకు ఆలస్యం మీరు కూడా ఆ డాన్స్ చూసేయండి.

Also Read: Ram Charan Plastic Surgery: అప్పుడు చరణ్ ను విమర్శించిన నోళ్లే ఇప్పుడు పొగుడుతున్నాయ్.. సర్జరీ ముందు తరువాత ఎలా ఉన్నాడో తెలుసా?

Also Read: Jr NTR Lipo Surgery: బాడీ షేమింగ్ తో ఇబ్బంది పడి ఇండియాస్ బెస్ట్ యాక్టర్ గా నిలబడ్డ ఎన్టీఆర్!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 

ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 

 TwitterFacebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

 
 
Read More