Home> వినోదం
Advertisement

Corona Effect: కరోనా కాలంలో భారతీయ సినీ పరిశ్రమకు 9000 కోట్ల నష్టం

చైనా ( China) నుంచి ప్రారంభం అయిన కరోనావైరస్ ( Coronavirus ) భారతదేశ సినిమా జగత్తుపై విపత్తులా విరుచుకుపడింది. 

Corona Effect: కరోనా కాలంలో భారతీయ సినీ పరిశ్రమకు 9000 కోట్ల నష్టం

చైనా ( China) నుంచి ప్రారంభం అయిన కరోనావైరస్ ( Coronavirus ) భారతదేశ సినిమా జగత్తుపై విపత్తులా విరుచుకుపడింది. తీరని గాయాలు చేసింది. లక్షలాది మంది జీవితాలను రిస్కులో పడేసింది. బాలీవుడ్ నుంచి టాలీవుడ్ ( Tollywood ) వరకు సినిమా పరిశ్రమపై కోవిడ్ -19 వైరస్ ( Covid-19)  ఒక గ్రహణంలా పట్టుకుంది. వివిధ చిత్ర పరిశ్రమలకు గత ఆరునెలల్లోనే సుమారు 9,000 కోట్లు నష్టం కలిగినట్టు సమాచారం. దాంతో పాటు లక్షలాది మంది ఉపాధి కోల్పోయారు. 

ALSO READ| Japan: జపాన్ లో పెళ్లి చేసుకుంటే.. ప్రభుత్వం కట్నం ఇస్తుందట

మల్టిప్లెక్సులు తెరవాలి అని డిమాండ్
ఆరునెలల నుంచి కరోనావైరస్ వల్ల సినిమా పరిశ్రమకు వేలాది కోట్ల నష్టం కలిగింది. సినీ పరిశ్రమమై ఆధారపడే వాళ్లు నిరాశ్రయులయ్యారు. ఈ పరిస్థితిని గమినించి మల్టిప్లెక్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా ( Multiplex Association of India ) ప్రభుత్వం ముందు థియేటర్లను తెరిచేందుకు అనుమతి ఇవ్వాలి అంటూ డిమాండ్ చేసింది.

ట్వీట్ చేసిన  MAI
మల్టిప్లెక్స్ ఆసోసియేషన్ ఆప్ ఇండియా ఇటీవలే ఒక ట్వీట్ చేసి మాల్స్, ఎయిర్ లైన్స్, రైల్వే, రెస్టారెంట్స్, జిమ్ ఇతర సెక్టార్స్ ను అన్ లాక్ ఇండియాలో భాగంగా మళ్లీ ప్రారంభం అయ్యే అవకాశం కల్పించారు. అలాగే సినిమా థియేటర్లను మళ్లీ ప్రారంభించేందుకు మళ్లీ అవకాశం కల్పించాల్సిందిగా కోరుతున్నాము అని ట్వీట్ చేశారు. ఇలా చేయడం వల్ల సుమారు రెండు లక్షల మంది జీవితాలు మళ్లీ గాడినపడతాయి అని అంటున్నారు.

ALSO READ|  Google Drive: ఆ ఫైల్స్ ఇక ముప్పై రోజులే సేవ్ అవుతాయి

లక్షలాది మంది ఉద్యోగాలకు ఎసరు
భారత దేశంలో కరోనావైరస్ సంక్రమణను అదుపు చేయడానికి భారత్ ప్రభుత్వం మార్చిలో లాక్ డౌన్ విధించింది. అయితే ప్రస్తుతం అన్ లాకింగ్ ప్రక్రియ కొనసాగుతోంది. అన్ లాక్ 4లో భాగంగా ఎన్నో మినహాయింపులు ఇచ్చారు. అయితే  థియేటర్లు మళ్లీ తెరవాలి అని.. లేదంటే లక్షలాది మంది ఉద్యోగాలకు ఎసరు పడుతోంది. 

ALSO READ| IPL: ఐపీఎల్ లో అత్యంత ఖరీదైన ఆటగాళ్లు వీరే

A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే ZEEHINDUSTAN App డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

IOS Link - https://apple.co/3loQYeR

 

Read More