Home> వినోదం
Advertisement

Ginna Colletcions: టాక్ బాగానే ఉన్నా షాకిస్తున్న కలెక్షన్స్.. విష్ణు కొంప ముంచిన ట్రోలర్లు!

Ginna Colletcions: మంచు విష్ణు జిన్నా సినిమాతో తెలుగు ప్రేక్షకుల ముందుకు వచ్చారు ఆ సినిమాకు మంచి టాక్ వచ్చినా కలెక్షన్స్ మాత్రం రావడం లేదని అంటున్నారు. ఆ వివరాలు 

Ginna Colletcions: టాక్ బాగానే ఉన్నా షాకిస్తున్న కలెక్షన్స్.. విష్ణు కొంప ముంచిన ట్రోలర్లు!

Huge trolling Affected the Ginna Movie Box Office Colletcions: కాజల్ అగర్వాల్ తో కలిసి మోసగాళ్లు అనే సినిమా చేసిన తర్వాత సుమారు ఏడాది గ్యాప్ తీసుకొని మంచు విష్ణు జిన్నా అనే సినిమాతో తెలుగు ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. దీపావళి కానుకగా నాలుగు సినిమాలు విడుదలవుతున్నా సరే వాటికి పోటీగా మంచు విష్ణు కూడా రంగంలోకి దిగారు. నిజానికి ఈ జిన్నా సినిమా అక్టోబర్ 5వ తేదీ విడుదల కావాల్సి ఉంది.

కానీ ఆ రోజు ది గోస్ట్, గాడ్ ఫాదర్, స్వాతిముత్యం లాంటి మూడు సినిమాలు విడుదలకు రెడీ అవ్వడంతో చివరి నిమిషంలో మంచు విష్ణు వెనక్కి దగ్గర తమ సినిమాను అక్టోబర్ 21వ తేదీకి వాయిదా వేస్తున్నట్లు అప్పుడు ప్రకటించారు. అనుకున్నట్లుగానే మంచు విష్ణు నటించిన జిన్నా సినిమా శుక్రవారం నాడు ప్రేక్షకుల ముందుకు వచ్చేసింది. శ్రీనువైట్ల అసిస్టెంట్ సూర్య డైరెక్ట్ ఈ సినిమాలో మంచు విష్ణు సరసన హీరోయిన్లుగా పాయల్ రాజ్ పుత్,  సన్నీలియోన్ నటించగా ఇతర కీలక పాత్రలలో చమ్మక్ చంద్ర, వెన్నెల కిషోర్, నరేష్, అన్నపూర్ణమ్మ వంటి ఇతర నటీనటులు కనిపించారు.

ఈ సినిమాకి నెగిటివ్ ట్రాక్ వస్తుందని అందరూ భావించారు కానీ సినిమాకి రిలీజ్ అయ్యాక పాజిటివ్ టాక్ అయితే లభించింది. కానీ మొదటి రోజు కలెక్షన్ల విషయానికి వస్తే రెండు తెలుగు రాష్ట్రాలలో కేవలం 12 లక్షల మేర షేర్ వసూలు చేసినట్లు బాక్సాఫీస్ వర్గాల భోగట్టా. నిజానికి మంచు విష్ణు మార్కెట్ ప్రకారం ఈ సినిమాని పర్ఫెక్ట్ గా డిస్ట్రిబ్యూట్ చేశారు. సుమారు 5 కోట్ల వరకు ఈ సినిమా హక్కులు అమ్ముడు అయ్యాయి అయితే మొదటి రోజు మరీ దారుణంగా 12 లక్షలు వసూలు చేయడం ఏంటని అందరూ ఆశ్చర్యపోతున్నారు.

అయితే మా ఎన్నికల్లో విష్ణు పోటీ చేయడం మొదలు మంచు విష్ణు సహా మంచు మోహన్ బాబు కుటుంబాన్ని పెద్ద ఎత్తున సోషల్ మీడియాలో ట్రోలర్లు టార్గెట్ చేసి ట్రోల్ చేస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. ఇప్పటికే అనేక పర్యాయాలు మంచు విష్ణు ఈ విషయం మీద ట్రోలర్లకు వార్నింగ్ ఇచ్చారు అయినా జిన్నా సినిమా మీద కూడా ఈ ట్రోలింగ్ ఎఫెక్ట్ పడినట్లే కనిపిస్తోంది. సినిమా చూసినవారందరూ బాగానే ఉంది అంటున్నా సరే ప్రేక్షకులు థియేటర్ వరకు వెళ్లడానికి ఆసక్తి చూపించలేదన అంటున్నారు.

దీనికి తోడు మరో మూడు సినిమాలు కూడా అదే రోజున విడుదలవడం జిన్నా సినిమా కంటే అవి బాగున్నాయని టాక్ బయటకు రావడంతో ఈ సినిమాకు మరింత ఎఫెక్ట్ పడినట్లుగా చెప్పవచ్చు.. మంచు విష్ణు జిన్నా సినిమా బాగుందని రివ్యూస్ బయటకు వచ్చిననా సరే ఎక్కువగా ప్రేక్షకులు ఆయన మీద వచ్చిన ట్రోల్స్ కే ప్రాధాన్యత ఇస్తున్నట్లుగా చెప్పొచ్చు. అందుకే బహుశా ధియేటర్ల వరకు ప్రేక్షకులు రాలేదేమో అనే ఒక విశ్లేషణయితే ఉంది. మరి మున్ముందు రోజుల్లో ఈ సినిమా పరిస్థితి ఎలా ఉంటుందో చూడాలి మరి. 
Also Read: Balakrishna for Allu Sirish: అల్లు హీరో కోసం బాలయ్య.. అరవింద్ పిలుపుకు గ్రీన్ సిగ్నల్!

Also Read: Prabhas Facts: హీరో కాకుంటే ప్రభాస్ అదే అయ్యేవాడట.. 20 ఏళ్లలో ఎన్ని వందల కోట్లు సంపాదించారో తెలుసా?

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

Android Link https://bit.ly/3P3R74U

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Read More