Home> వినోదం
Advertisement

Sadha: విడాకులపై సీనియర్ హీరోయిన్ ‘సదా’ సంచలన వ్యాఖ్యలు.. ఎవరు ఎక్స్ పెక్ట్ చేయలేదుగా..

Sadha: ‘సదా’ ఒకప్పుడు తెలుగులో వరుస సినిమాలతో సత్తా చాటింది. ముఖ్యంగా జయం సినిమాలో వెళ్లవయ్యా వెళ్లు అంటూ సదా చెప్పిన డైలాగుకు యూత్ ఫిదా అయ్యారు. ప్రస్తుతం కొన్ని సినిమాల్లో నటిస్తూనే.. కొన్ని టీవీ రియాలిటీ షోలకు న్యాయ నిర్ణతగా వ్యవహరిస్తోంది. తాజాగా ఈ కథానాయిక విడాకులపై తన అభిప్రాయాన్ని కుండబద్దలు కొట్టింది.

Sadha: విడాకులపై సీనియర్ హీరోయిన్ ‘సదా’ సంచలన వ్యాఖ్యలు.. ఎవరు ఎక్స్ పెక్ట్ చేయలేదుగా..

Sadha: సదా తెలుగు, తమిళం సహా రెండు ఇండస్ట్రీస్ లో కథానాయికగా సత్తా చాటింది. తెలుగులో తేజ దర్శకత్వంలో నితిన్ హీరోగా పరిచయమైన ‘జయం’ మూవీతో కథానాయికగా పరిచయమైన.. ఆ తర్వాత మెరుపు వేగంతో దూసుకుపోయింది. అంతేకాదు తమిళంలో శంకర్ దర్శకత్వంలో తెరకెక్కిన ‘అన్నియన్’ (అపరిచితుడు) సినిమా సదాకు మంచి పేరు తీసుకొచ్చింది. 2002లో కథానాయికగా పరిచయమైన ఇప్పటికీ కథానాయికగా సత్తా చాటుతూనే ఉంది. మధ్యలో కొన్ని తెలుగు, తమిళంలో ప్రసారమయ్యే టీవీ షోలకు జడ్జ్ గా వ్యవహరించింది.

అంతేకాదు ప్రస్తుతం సినిమాల పరంగా దూకుడు తగ్గినా.. ఎపుడు తన హాట్ ఫోటో షూట్స్ తో వార్తల్లో వ్యక్తిగా నిలుస్తోంది. ఏజ్ 40కు దగ్గర పడుతున్న ఈ భామ.. ఇప్పటికీ సింగిల్ గానే ఉంటుంది. ఈ నేపథ్యంలో పెళ్లి, విడాకులపై తనదైన శైలిలో స్పందించింది.

ప్రస్తుతం తాను స్వేచ్ఛా జీవిగా ఉన్నానన్నారు. పెళ్లి చేసుకొని దాన్ని ఒదులుకోలేనని చెప్పింది. పెళ్లిపై నాకు ఎంతో నమ్మకం గౌరవం ఉంది. కానీ మనసుకు దగ్గరగా ఎవరు నచ్చలేదు. అందుకే పెళ్లికి దూరంగా ఉన్నాను. ఎవరైనా నచ్చితే ఖచ్చితంగా మ్యారేజ్ చేసుకుంటాను. అది కూడా మీడియా మిత్రులకు చెప్పి చేసుకుంటానని చెప్పింది.  ఇక పెద్దలు కుదిర్చే అరేంజెడ్ మ్యారేజ్ కు తాను పూర్తి వ్యతిరేకం అన్నారు. నేను పెళ్లి అంటూ చేసుకుంటే లవ్ మ్యారేజ్ తప్ప.. అరేంజెడ్ పెళ్లి మాత్రం చేసుకోను. ఇక పెళ్లి తర్వాత భర్తను భరించడం కష్టం అనిపిస్తే.. అది భరిస్తూ.. కాపురం చేసేకంటే విడాకులు ఇచ్చేయడం బెటర్ అని చెప్పుకొచ్చింది. ఏది ఏమైనా సదా పెళ్లి చేసుకోవాలంటే ఆమెను మెప్పించే వాడు రావాలన్న మాట.

Read more: Us man forceful sneeze: బాప్ రే.. గట్టిగా తుమ్మగానే.. పొట్ట చీల్చుకుని బైటపడ్డ పేగులు.. ఎక్కడో తెలుసా..?..

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి FacebookTwitter

Read More