Home> వినోదం
Advertisement

Nikhil 18 Pages : కొంచెం టైం ఇవ్వు.. నిఖిల్‌ను వేడుకున్న హీరో శింబు

Hero Simbu Sings for Nikhil నిఖిల్ అనుపమ కాంబోలో రాబోతోన్న 18 పేజీలు అనే సినిమా కోసం హీరో శింబు రంగంలోకి దిగాడు. 18 పేజీలు సినిమా కోసం హీరో శింబు ఓ పాటను పాడబోతోన్నాడు.

Nikhil 18 Pages : కొంచెం టైం ఇవ్వు.. నిఖిల్‌ను వేడుకున్న హీరో శింబు

Hero Simbu Sings Konchem Time Ivvu Pilla : హీరో శింబు పాడే పాటలు తెలుగులో బాగానే క్లిక్ అవుతున్నాయి. ఇది వరకే ఎన్టీఆర్, రామ్ వంటి వారి కోసం శింబు పాటల పాడాడు. మన హీరోల కోసం తమిళ వాళ్లు పాటలు పాడటం.. పక్క భాషల హీరోల కోసం మన హీరోలు పాటలు పాడటం పరిపాటే. ఇప్పుడు నిఖిల్ కోసం శింబు పాట పాడేందుకు వచ్చాయి. ఈ పాటను ఆల్రెడి శింబు పాడినట్టుగా ఉన్నాడు.

రామ్ వారియర్ కోసం శింబు పాడిన బుల్లెట్టు బండి ఫుల్ ఫేమస్ అయింది. తమిళ డైరెక్టర్ లింగుసామి కోసం కూడా ఆ పాట పాడి ఉండొచ్చు. దేవీ శ్రీ ప్రసాద్ మ్యూజిక్ డైరెక్షన్లో వచ్చిన ఈ పాట, శింబు వాయిస్‌కు బాగానే సెట్ అయింది. ఆ పాట కూడా ట్రెండ్ సెట్టర్‌గా నిలిచింది. ఇప్పుడు నిఖిల్ కోసం శింబు వచ్చాడు. 

 

శ్రీమణి సాహిత్యం, గోపీసుందర్ సంగీతం, శింబు వాయిస్ మరోసారి మ్యాజిక్ చేసేట్టుగా ఉంది. టైం ఇవ్వు పిల్ల.. కొంచెం టైం ఇవ్వు అంటూ సాగే ఈ పాట పాడే సమయంలో శింబు సైతం ఫన్నీగా కౌంటర్లు వేశాడు. ఈ పాటను నేను పాడలేను అని చేతులెత్తేశాడు. నిఖిల్ బతిమిలాడటం, ఇద్దరూ కలిసి పాట పాడటం ఈ వీడియోలో కనిపిస్తోంది.

ఈ పాట పాడుతూ.. టైం ఇవ్వు పిల్ల.. కొంచెం టైం ఇవ్వు అంటూ.. నాకు కూడా కొంచెం టైం ఇవ్వు అంటూ శింబు అడిగేశాడు. మొత్తానికి శింబుతో కలిసి ఇలా పాట రికార్డింగ్ చేయడం ఆనందంగా ఉందంటూ పాట ఎప్పుడు రాబోతోందో అప్డేట్ ఇచ్చాడు. డిసెంబర్ 5న ఈ పాట రాబోతోందంటూ ప్రకటించాడు.

Also : Yashoda Movie: సమంత 'యశోద'కు లైన్ క్లియర్.. ఐదు కోట్ల దావా అందుకే!

Also : Bandla Ganesh Politics : అంత గొప్పవాన్ని కాదు.. ఆ స్థాయి లేదు.. రాజకీయాలతో ఎంతో నష్టపోయాను.. బండ్ల గణేష్ ట్వీట్లు వైరల్

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 

ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter , Facebook

Read More