Home> వినోదం
Advertisement

Nikhil:తండ్రిగా ప్రమోట్ అయిన నిఖిల్ సిద్దార్థ.. విషెస్ చెబుతున్న అభిమానులు

Nikhil to become father : కార్తికేయ 2 సినిమా తో ఇండియా పరంగా సూపర్ హిట్ అందుకున్న నిఖిల్ సిద్ధార్థ ప్రస్తుతం వరుస పెట్టి మూడు సినిమాలతో బిజీగా ఉన్నాడు. ఈ నేపథ్యంలో నిఖిల్ పర్సనల్ లైఫ్ గురించి ఒక శుభవార్త తెగ హల చల్ చేస్తోంది. మరి ఆ వివరాలు ఒకసారి చూద్దాం..

Nikhil:తండ్రిగా ప్రమోట్ అయిన నిఖిల్ సిద్దార్థ.. విషెస్ చెబుతున్న అభిమానులు

Nikhil Siddarth: యంగ్ హీరోల్లో ప్రత్యేక పేరు తెచ్చుకున్న హీరో నిఖిల్ సిద్ధార్థ.. హ్యాపీ డేస్ సినిమాతో మనకు పరిచయమైన ఈ హీరో ఆ తర్వాత వైవిధ్యమైన కథలు ఎంచుకుంటూ.. సూపర్ హిట్లు అందుకున్నారు. ముఖ్యంగా ఈ మధ్య ఈ హీరో తీసిన కార్తికేయ 2 సినిమా పాన్ ఇండియా పరంగా ఆయనకు మంచి ఇమేజ్ తెచ్చిపెట్టింది. తెలుగులోనే కాకుండా హిందీలో కూడా ఈ సినిమా బ్లాక్ బస్టర్గా నిలిచింది. కాగా ఆ తరువాత వచ్చిన 18 పేజెస్, స్పై సినిమాలు మాత్రం నిరాశ మిగిల్చాయి.

ఈ నేపథ్యంలో ఈసారి ఎలాగైనా సూపర్ హిట్ అందుకోవాలని మరో వైవిధ్యమైన కథను ఎంచుకొని స్వయంబు చిత్రంతో మన ముందుకి రాబోతున్నారు ఈ హీరో. కాగా స్వయంభు సినిమాతో పాటు నిఖిల్ ది ఇండియా హౌస్, కార్తికేయ 3 చిత్రాలు కూడా ఇప్పటికే సైన్ చేశారు. ఈ మూడు సినిమాలలో ముందుగా స్వయంభు విడుదల కానంది. తమిళ దర్శకుడు భరత్ కృష్ణమాచారి ఈ సినిమాని డైరెక్ట్ చేస్తున్నారు. సోషియో ఫాంటసీ డ్రామాతో ఈ సినిమా తెరకెక్కబోతుంది. ఈ చిత్రం లో నిఖిల్ యోధుడిగా కనిపించబోతున్నారు. ఈ సినిమా కోసం నిఖిల్ మార్షల్ ఆర్ట్స్ ట్రైనింగ్ కూడా తీసుకున్నారు

ఇలా సినిమాల పరంగా దూసుకుపోతున్న ఈ హీరో.. పర్సనల్ లైఫ్ లో కూడా ఒక గుడ్ న్యూస్ అందుకున్నారు. ఇంతకీ అదేమిటి అంటే మన హీరో నిఖిల్ త్వరలోనే తండ్రి కాబోతున్నారట. కాగా నిఖిల్ 2020లో పల్లవి వర్మ అనే అమ్మాయిని పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే. ఆమె ఇప్పుడు ప్రెగ్నెన్సీతో ఉన్నట్లు సమాచారం. ఈ వార్త ఈరోజు ఉదయం నుంచి సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. అయితే దీనికి కారణం లేకపోలేదు..ఇటీవల ఒక ఫంక్షన్ లో నిఖిల్ భార్య పల్లవి బేబీ బంప్ తో కనిపించారు. ఆ ఫోటో చూసిన నెటిజెన్స్.. నిఖిల్ తండ్రి కాబోతున్నారా..? అని ఆశ్చర్యం వ్యక్తం చేశారు. 

తాజాగా ఇండస్ట్రీ వర్గం వ్యక్తులు కూడా ఈ విషయం గురించి మాట్లాడుతున్నారు. ఇక ఏ వార్త నిజమే అని తెలుస్తోంది.  దీంతో నెటిజెన్స్ నిఖిల్ కి విషెస్ తెలియజేస్తున్నారు.

Also Read: Sumanth: విశాఖ శారదాపీఠాన్ని సందర్శించిన హీరో సుమంత్.. కొత్త సినిమా నామకరణం

Also Read: Infinix Zero Ultra Price: 200MP కెమెరా Infinix Zero Ultra మొబైల్ కేవలం రూ. 8,599కే పొందండి..మళ్లీ మళ్లీ రాని డీల్!  

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

TwitterFacebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి 

Read More