Home> వినోదం
Advertisement

Hema: మంచు విష్ణుని కలిసిన నటి హేమ.. డ్రగ్స్ నెగెటివ్ రిపోర్టు చూపించి సంచలన వ్యాఖ్యలు..

Bengarluru rave party: డ్రగ్స్ ఆరోపణల కేసులో నటి హేమను మా అసోసియేషన్ నుంచి సస్పెండ్ చేసిన విషయం తెలిసిందే. దీనిపై తాజాగా, హేమ మా ప్రెసిడెంట్ మంచు విష్ణును కలిశారు.

Hema: మంచు విష్ణుని కలిసిన నటి హేమ.. డ్రగ్స్ నెగెటివ్ రిపోర్టు చూపించి సంచలన వ్యాఖ్యలు..

Hema meets with maa president Vishnu with drugs negative report: నటి హేమ బెంగళూరు రేవ్ పార్టీ ఘటన దేశంలో తీవ్ర చర్చనీయాశంగా మారింది. బెంగళూరులో జరిగిన రేవ్ పార్టీలో పాల్గొన్న వారిలో కొందరు డ్రగ్స్ తీసుకున్నట్లు గుర్తించారు. వీరిలో బడాబాబుల పిల్లతో పాటు, టెకీలు, టాలీవుడ్ నుంచి నటి హేమ ఉన్నట్లు గుర్తించారు. ఈ నేపథ్యంలో.. పోలీసులు 103 మందికి బ్లడ్ టెస్టులు చేశారు. వీరిలో 86 మందికి పాజిటివ్ వచ్చినట్లు బెంగళూరులో పోలీసులు గుర్తించారు. బ్లడ్ రిపోర్టులో పాజిటివ్ వచ్చిన వాళ్లను పోలీసులు తమ ముందుకు విచారణకు రావాల్సిందిగా పలుమార్లు నోటీసులు జారీ చేశారు. ఇక హేమ డ్రగ్స్ ఘటనలో సినిమాల మాదిరిగా ట్విస్ట్ ల మీద ట్విస్టులు చోటు చేసుకున్నాయి.

Read more: Sonu Sood: హీరో సోనూసూద్ కు బంపర్ ఆఫర్ ఇచ్చిన కుమారీ ఆంటీ.. వీడియో వైరల్..

తొలుత నటి తాను డ్రగ్స్ ఘటన దగ్గర లేదని వీడియో తీసింది. దీంతో బెంగళూరు పోలీసులు కౌంటర్ గా ఆమె ఫోటోలను విడుదల చేశారు. ఆమెకు నోటీసులు జారీ చేశారు. ఒకసారి బిర్యానీ వండుతూ, జ్వరం వచ్చిందని, పలుమార్లు పోలీసులను బురిడికొట్టించే ప్రయత్నం చేసింది. చివరకు  నాటకీయ పరిణామల నేపథ్యంలో బెంగళూరు పోలీసులు హైదరబాద్ చేరుకుని, హేమకు నోటీసులు ఇచ్చి అదుపులోకి తీసుకున్నారు. బెంగళూరులో కోర్టులో హజరుపర్చారు. ఆమెను పోలీసులు విచారించారు. అగ్రహర జైలులో ఉన్నారు. ఇదిలా ఉండగా.. మరోవైపు నటి హేమ అరెస్టు కావడంతో మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ దీన్నితీవ్రంగా పరిగణించింది.

నటి హేమ ప్రాథమిక సభ్యత్వంను రద్దు చేసింది. ఈ నేపథ్యంలో ఇటీవల నటి హేమ జైలు నుంచి బెయిల్ మీద విడుదలయ్యారు. అంతేకాకుండా తిరుమలకు వెళ్లి స్వామివారిని సైతం దర్శించుకున్న విషయం తెలిసిందే. తాజాగా, ఆమె మా ప్రెసిడెంట్ మంచు విష్ణుతో భేటీ అయ్యారు. దేశంలో అత్యున్నత ప్రమాణాలతో కూడిన ల్యాబ్ లో తాను డ్రగ్స్ పై టెస్టులు చేయించుకున్నానని, దానిలో నెగెటివ్ వచ్చిందని అన్నారు. అంతేకాకుండా.. తన ల్యాబ్ రిపోర్టును ఆయనకు అందజేశారు. ఈ క్రమంలో తన సస్పెన్షన్ ను ఎత్తివేయాలని కూడా, మా కు ఒక బహిరంగ లేఖను కూడా రాశారు. కొందరు కావాలని తనపరువుకు భంగం కలిగేలా మీడియాలో కథనాలు రాశారంటూ వాపోయింది.

Read more: Snakes dance: పాముల సయ్యాట.. పచ్చని పొలంలో అరుదైన ఘటన.. వైరల్ వీడియో..

మా లో తొలి నుంచి ఎంతో మందికి అండగా నిలిచానని, ఇప్పుడు తాను ఇబ్బందుల్లో ఉన్నానని, అండగా ఉండాల్సిన బాధ్యత మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ పై ఉందన్నారు. బెంగళూరు పోలీసులు టెస్టులలో కూడా ఇదే విధంగా నెగెటివ్ రిపోర్టు వస్తుందని కూడా నటి హేమ అన్నారు. ఈ విషయాన్ని గమనించి తన సస్పెన్షన్ ను ఎత్తివేస్తారని భావిస్తున్నట్లు మంచు విష్ణుకు ఒక లేఖ రాశారు. అంతేకాకుండా.. మా ఫౌండర్ మెంబర్ అయిన మెగాస్టార్ చిరంజీవికి కూడా ఒక కాపీని జతపర్చారు. దీనిపై మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ మాత్రం ఇప్పటి వరకు స్పందించలేదు.

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

TwitterFacebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి 

Read More