Home> వినోదం
Advertisement

HBD Sanjay Dutt: 'లియో' అప్ డేట్.. 'అర్జున్ దాస్'గా వచ్చేసిన సంజయ్ దత్..

Leo Movie update: దళపతి విజయ్-లోకేష్ కనగరాజ్ కాంబోలో తెరకెక్కుతున్న సినిమా 'లియో'. ఇందులో బాలీవుడ్ హీరో సంజయ్ దత్ నటిస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా ఈ మూవీకి సంబంధించిన లుక్ ను రిలీజ్ చేశారు మేకర్స్.
 

HBD Sanjay Dutt: 'లియో' అప్ డేట్.. 'అర్జున్ దాస్'గా వచ్చేసిన సంజయ్ దత్..

Sanjay Dutt look in leo: కోలీవుడ్ స్టార్ హీరో దళపతి విజయ్ టైటిల్ రోల్ చేస్తున్న సినిమా 'లియో'(leo Movie). స్టార్ డైరెక్టర్ లోకేష్ కనగరాజ్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో త్రిష హీరోయిన్  గా నటిస్తోంది. లోకేష్-విజయ్ కాంబోలో గతంలో 'మాస్టర్' అనే సూపర్ హిట్ వచ్చింది. ఆ తర్వాత వీరిద్దరూ చేస్తున్న మూవీ కావడంతో దీనిపై భారీగానే అంచనాలు ఉన్నాయి. ఇప్పటికే ఈ చిత్రం నుంచి రిలీజ్ అయిన పోస్టర్స్, సాంగ్స్, గ్లింప్స్ సినిమాపై హైప్ ను పెంచేశాయి. 

ఈ సినిమాలో బాలీవుడ్ హీరో సంజయ్ దత్ నటిస్తున్న సంగతి తెలిసిందే. ఇవాళ(జూలై 29)న సంజయ్ పుట్టినరోజు. ఈ సందర్భంగా ఆయన ఫస్ట్ లుక్ ను రిలీజ్ చేశారు మేకర్స్. ఇందులో సంజయ్ దత్.. ఆంటోని దాస్‏ అనే విలన్ పాత్రలో కనిపించబోతున్నారు. ఆంటోని లుక్ విడుదల చేస్తూ.. లోకేష్ కనగరాజ్ ఓ స్పెషల్ వీడియోను షేర్ చేశారు. ఇందులో సంజయ్ సిగరెట్ తాగుతూ..ఫోన్ మాట్లాడుతూ సలామ్ చేస్తున్నట్లుగా చూపించారు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట విపరీతంగా వైరల్ అవుతోంది. 

Also Read: BRO collection Day 1: పవర్ స్టార్ మేనియా.. తొలి రోజు భారీ ఓపెనింగ్స్ రాబట్టిన 'బ్రో' మూవీ..

ఈ సినిమాను దాదాపు రూ.250 కోట్ల బడ్జెట్ తో సెవన్ స్క్రీన్ స్టూడియో నిర్మిస్తోంది. ఈ సినిమాలో గౌతమ్ మీనన్, అర్జున్ సర్జా, ప్రియాఆనంద్ తదితరులు కీలకపాత్రల్లో నటిస్తున్నారు. ప్రస్తుతం ఈ మూవీకి సంబంధించిన పోస్ట్ ప్రొడక్షన్ వర్క్స్ జరుగుతున్నాయి. ఈ చిత్రాన్ని వరల్డ్ వైడ్ గా అక్టోబరు 19న గ్రాండ్ గా రిలీజ్ చేయనున్నారు. ఇది తమిళంతోపాటు తెలుగు, కన్నడ, మలయాళం భాషల్లో విడుదల కానుంది. 

Also Read: Rajinikanth- Nani: రజినీకాంత్ సినిమాలో నాని.. కథను మలుపు తిప్పే పాత్రలో నేచురల్ స్టార్..

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu   

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Read More