Home> వినోదం
Advertisement

Harom Hara: అమెజాన్ ప్రైమ్ లో సుధీర్ బాబు సంచలనం.. ‘హరోంహర’ మూవీతో దేశ వ్యాప్తంగా నెంబర్ వన్ ట్రెండింగ్..

Harom Hara Streaming on Amazon Prime: సూపర్ స్టార్ కుంటుంబ నుంచి సినీ ఇండస్ట్రీలో అడుగు పెట్టిన సుధీర్ బాబు.. హీరోగా తన కంటూ సెపరేట్ ఐడెండిటీ ఏర్పరుచుకున్నాడు.  హిట్ ఫ్లాపులతో సంబంధం లేకుండా సినిమాలు చేసుకుంటూ పోతున్నాడు. ప్రస్తుతం ఈ సినిమా అమెజాన్ ప్రైమ్ లో స్ట్రీమింగ్ అవుతోంది. అంతేకాదు దేశ వ్యాప్తంగా నెంబర్ వన్ ట్రెండింగ్ లో దూసుకుపోతున్నాడు.

Harom Hara: అమెజాన్ ప్రైమ్ లో సుధీర్ బాబు సంచలనం.. ‘హరోంహర’ మూవీతో దేశ వ్యాప్తంగా నెంబర్ వన్ ట్రెండింగ్..

Harom Hara Streaming on Amazon Prime:సుధీర్ బాబు హీరోగా నటించిన లేటెస్ట్ మూవీ ‘హరోం హర’. ఈ సినిమాలో పూర్తి యాక్షన్ హీరోగా నటించి మెప్పించారు. సినిమా బాగున్నా..థియేట్రకల్ గా ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర సరైన ఫలితాన్ని అందుకోలేదు. ఈ సినిమా థియేట్రికల్ రన్ తొందరగా ముగియడంతో ఈ సినిమా అమెజాన్ ప్రైమ్ వీడియోలో ట్రెండింగ్ అవుతోంది. అంతేకాదు ఈ సినిమా ప్రస్తుతం అమెజాన్ ప్రైమ్ వీడియోలో దేశ వ్యాప్తంగా నెంబర్ వన్ ట్రెండింగ్ లో కొనసాగుతోంది. ఈ సినిమాను ఆయుధాల తయారీ నేపథ్యంలో తెరకెక్కించారు. ఈ సినిమాను జ్ఞాన సాగర్ డైరెక్ట్ చేశారు. ఈ సినిమాలో సుధీర్ బాబు అచ్చమైన కుప్పం స్లాంగ్ లో మాట్లాడి మెప్పించారు. ఈ సినిమాలో సుధీర్ బాబు ప్రేయసి పాత్రలో మాళవిక శర్మ చేశారు.  

హరోంహర సినిమా కేవలం తెలుగు ప్రేక్షకులనే కాదు.. దేశ వ్యాప్తంగా అన్ని భాషల ప్రేక్షకులను మెప్పిస్తోంది. ఈ సినిమా వారం రోజులుగా అమెజాన్ ప్రైమ్ లో నెంబర్ వన్ ట్రెండింగ్ లో కొనసాగుతోంది. ఈ సినిమాను సుతంత్ జి నాయుడు నిర్మించారు. ఈ సినిమాను చైతన్య భరద్వాజ్ సంగీతం అందించారు. ఈ సినిమాకు అరవింద్ విశ్వనాథన్ ఫోటోగ్రఫీ అందించారు.

సుధీర్ బాబు విషయానికొస్తే.. సూపర్ స్టార్ కృష్ణ అల్లుడిగా...మహేష్ బాబు బావగా సినీ ఇండస్ట్రీలో అడుగుపెట్టి హీరోగా డిఫరెంట్ మూవీస్ తో దూసుకుపోతున్నాడు. అంతేకాదు బాలీవుడ్ లో ‘బాఘీ’ మూవీతో విలన్ గా ఎంట్రీ ఇచ్చి ప్యాన్ ఇండియా లెవల్లో గుర్తింపు తెచ్చుకున్నాడు. త్వరలో మరో ప్యాన్ ఇండియా మూవీతో పలకరించబోతున్నాడు.

ఇదీ చదవండి: ‘కల్కి ’ సినిమాలో నాగ్ అశ్విన్ చేసిన ఈ బ్లండర్ మిస్టేక్ ను గుర్తించారా..!

ఇదీ చదవండి: ఆ తరంలో NTR, కృష్ణంరాజు.. ఈ జనరేషన్ లో రాజశేఖర్, ప్రభాస్ లకే ఆ క్రెడిట్ దక్కింది..

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Read More