Home> వినోదం
Advertisement

HBD Venkatesh: విక్టరీ వెంకటేష్ పుట్టిన రోజు కానుక..F3 పోస్టర్ విడుదల

F3 Poster: విక్టరీ వెంకటేష్ పుట్టిన రోజు సందర్భంగా తెలుగు సినీ పరిశ్రమలో చిరంజీవి వంటి స్టార్ హీరోలతో పాటు ఇతర సినీ పరిశ్రమలకు చెందిన తారలకు కూడా విషెస్ తెలుపుతున్నారు. 
 

HBD Venkatesh: విక్టరీ వెంకటేష్ పుట్టిన రోజు కానుక..F3 పోస్టర్ విడుదల

Venkatesh: విక్టరీ వెంకటేష్ పుట్టిన రోజు సందర్భంగా తెలుగు సినీ పరిశ్రమలో చిరంజీవి వంటి స్టార్ హీరోలతో పాటు ఇతర సినీ పరిశ్రమలకు చెందిన తారలకు కూడా విషెస్ తెలుపుతున్నారు. దాంతో పాటు సోషల్ మీడియాలో కూడా వెంకటేష్‌కు పుట్టిన రోజు శుభాకాంక్షలు వెల్లువలా వస్తున్నాయి. అదే సమయంలో విక్టరీ వెంకటేష్ కూడా తన పుట్టిన రోజున అభిమానులకు కానుకగా తను ప్రస్తుతం నటిస్తున్న నారప్ప మూవీకి సంబంధించిన అప్డేట్స్ షేర్ చేశాడు.

Also Read | Yearender 2020: ఈ  ఏడాది వివాహం చేసుకున్న సెలబ్రిటీలు ఎవరంటే...

నారప్ప మూవీకి ముందు విక్టరీ వెంకటేష్ (Venkatesh) నటించిన F2 చిత్రం విడుదలై మంచి విజయం సాధించిన విషయం తెలిసిందే. చాలా కాలం నుంచి ఒక కామెడీ మూవీ కోసం వేచి చూస్తున్న అభిమానులకు ఈ సినిమా బాగా నచ్చింది. దీంతో మూవీ మంచి విజయాన్ని కైవసం చేసుకుంది. దాంతో ఆ సినిమా సీక్వెల్ F3ను కూడా ప్లాన్ చేశారు. ఈ రోజు పుట్టిన రోజు సందర్భంగా దాని ఫస్ట్ లుక్ పోస్టర్ కూడా విడుదల చేసింది సినిమా యూనిట్.

Also Read | Smriti Mandhana గురించి మీకు తెలియని విషయాలు!

F2 మూవీని దిల్ రాజు (Dil Raju) నిర్మించగా అనిల్ రావిపూడి డైరక్ట్ చేశాడు. ఈ సినిమా ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ ఆఫ్ ఇండియాలో కూడా ఎంపికైంది. దాంతో పాటు Indian Best Feature Film విభాగంలో టాలీవుడ్ నుంచి అవార్డు కూడా సొంతం చేసుకుంది.  ప్రస్తుతం F3 సీక్వెల్ ప్రీ పొడ్రక్షన్‌లో ఉంది. విక్టరీ వెంకటేష్, వరుణ్ తేజ్ హీరోగా కొనసాగనున్నారు అనేది సినిమా పోస్టర్ చూస్తే అర్జం అవుతుంది. అయితే హీరోయిన్‌గా తమన్నా భాటియా, మెహ్రీన్ కొనసాగుతారా లేదా అనేది కొంత కాలం వేచి చూస్తేనే తెలుస్తుంది. 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

  • మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Read More