Home> వినోదం
Advertisement

Hanu Man: సంక్రాంతి బాక్సాఫీస్ దగ్గర అన్ని రికార్డులను మడతేట్టేసిన హనుమాన్.. ఇది నెక్ట్స్ లెవల్..

Hanuman: హనుమాన్ సినిమా పొంగల్ పోటీలో హై ఎక్స్‌పెక్టేషన్స్‌తో రావడమే కాదు.. అందరి అంచనాలను మించి బాక్సాఫీస్ దగ్గర సంక్రాంతి విజేతగా నిలిచి సంచలనం రేపింది. రిలీజైన మూడు రోజుల్లో బ్రేక్ ఈవెన్ పూర్తి చేసుకున్న ఈ సినిమా మొత్తంగా 12 రోజుల్లోనే ఎన్నో రికార్డులను మడతపెట్టేసింది.  

Hanu Man: సంక్రాంతి బాక్సాఫీస్ దగ్గర అన్ని రికార్డులను మడతేట్టేసిన హనుమాన్.. ఇది నెక్ట్స్ లెవల్..

Hanuman Box Office Collections: ప్రశాంత్ వర్మ గత రెండేళ్లుగా హనుమాన్ సినిమా కోసం ఎంతో శ్రమించాడు. విడుదల సమయంలో సరైన థియేటర్స్ కూడా దొరకలేదు. అయినా.. ఎన్నో కష్ట నష్టాలను ఓర్చుకొని ఈ మూవీ బాక్సాఫీస్ దగ్గర సంక్రాంతి విజేతగా నిలిచింది. అంతేకాదు ఇప్పటి వరకు విడుదలైన సంక్రాంతి చిత్రాల్లో హైయ్యెస్ట్‌ గ్రాసర్‌గా నిలిచే అవకాశాలున్నాయి.

ఇక బాక్సాఫీస్ దగ్గర హను మాన్ దూకుడు ఫస్ట్ డే ఫస్ట్ షో నుంచి కొనసాగుతూనే ఉంది. ప్రీమియర్స్ ద్వారానే దాదాపు రూ.3 కోట్లకు పైగా షేర్.. రూ. 6 కోట్లకు పైగా గ్రాస్ వసూళ్లను సాధించిన ఈ సినిమా మీడియం రేంజ్ చిన్న చిత్రాల్లో  సరికొత్త రికార్డు క్రియేట్ చేసింది. అంతేకాదు హనుమాన్.. మూడు రోజుల్లోనే బ్రేక్ ఈవెన్ పూర్తి చేసుకొని సరికొత్త సంచనాలకు కేరాఫ్ అడ్రస్‌గా మారింది. అంతేకాదు 2024లో టాలీవుడ్‌లోనే.. మన దేశంలోనే తొలి హిట్‌గా నిలిచింది హనుమాన్ మూవీ.

సంక్రాంతి గట్టిపోటీలో సూపర్ స్టార్ మహేష్‌ బాబు, స్టార్ డైరెక్టర్ త్రివిక్రమ్ శ్రీనివాస్‌ల 'గుంటూరు కారం" సినిమా ఉన్న ఆ సినిమాతో పోటీని తట్టుకొని నిలబడింది హనుమాన్. తొలి రోజు ముందు నుంచే బాక్సాఫీస్ దగ్గర ప్రారంభమైన హనుమాన్ దూకుడు కంటిన్యూగా కొనసాగుతూనే ఉంది.  ఈ మూవీ ప్రపంచ వ్యాప్తంగా ఇప్పటి వరకు 12 రోజుల్లో రూ. 122 కోట్ల షేర్.. (రూ.226 కోట్ల గ్రాస్) వసూళ్లను రాబట్టినట్టు ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. ఇక యూఎస్ (అమెరికా) బాక్సాఫీస్ దగ్గర ఈ మూవీ $4.5 మిలియన్ డాలర్స్ కలెక్ట్ చేసినట్టు సమాచారం.  మొత్తంగా 29.55 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ చేసిన ఈ మూవీ రూ. 30.50 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్‌తో బరిలో దిగిన ఈ మూవీ ఇప్పటి వరకు థియేట్రికల్‌గా రూ. 85 కోట్లకు పైగా లాభాలను తీసుకొచ్చింది.

మరోవైపు ఈ మూవీ డిజిటల్, శాటిలైట్ రూపేణా..మరో రూ. 40 కోట్ల అదనపు లాభాలను నిర్మాతకు తీసుకొచ్చింది. ఓవరాల్‌గా అయోధ్యలో భవ్య రామ మందిర నిర్మాణం జరుగుతోన్న ఈ శుభవేళలో హను మాన్ సినిమా తెలుగు సహా ఇతర భాషల్లో మంచి వసూళ్లను రాబట్టడం శుభ పరిణామం. ఈ  చిత్రాన్ని తెలుగు, హిందీ తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో ఇప్పటికే విడుదల చేయగా... మరాఠీ, ఇంగ్లీష్, స్పానిష్, కొరియన్, చైనీస్, జపనీస్ లాంగ్వేజిస్ లోనూ విడుదల  చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. తేజ సజ్జా, అమృత అయ్యర్, వరలక్ష్మీ శరత్ కుమార్, సముద్రఖని, గెటప్ శ్రీను ముఖ్యపాత్రలు పోషించిన ఈ చిత్రం "విజువల్ ఫీస్ట్"గా నీరాజనాలు అందుకుంటోంది.

ఆ సంగతి పక్కన పెడితే.. హనుమాన్ మూవీ క్లైమాక్స్‌లో ఈ మూవీకి సీక్వెల్‌గా 'జై హనుమాన్' మూవీ తెరకెక్కించబోతున్నట్టు దర్శకుడు ప్రశాంత్ వర్మ ప్రకటించారు. ఇప్పటికే స్క్రిప్ట్ వర్క్ పూర్తి చేసిన ఈ చిత్రానికి సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ వర్క్ ను అయోధ్య భవ్య రామ మందిరంలో బాల రాముడు కొలువైన శుభవేళలో ప్రకటించడం విశేషం. ఈ సినిమాలో హనుమాన్ లో నటించిన తేజ సజ్జా హీరోగా నటిస్తాడా .. ? వేరే స్టార్ హీరో ఎవరైనా నటిస్తారా అనేది చూడాలి. మొత్తంగా 'హనుమాన్'మూవీతో ప్యాన్ ఇండియా లెవల్లో సంచలనం రేపిన ప్రశాంత్ వర్మ.. రాబోయే 'జై హనుమాన్' మూవీతో ఎలాంటి సంచలనాలకు కేరాఫ్ అడ్రస్‌గా నిలిస్తుందో చూడాలి.

Read: Ayodhya Crown: అయోధ్య రాముడికి స్వర్ణ కిరీటం.. వజ్రాలు, విలువైన రాళ్లు పొదిగినది ఎన్ని కోట్లు అంటే?

Also Read: BRS Party MLAS Meet Revanth: బీఆర్‌ఎస్‌ పార్టీలో కలకలం.. సీఎం రేవంత్‌ను కలిసిన నలుగురు ఎమ్మెల్యేలు

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి. 

Android Link: https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu 

Apple Link: https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Read More