Home> వినోదం
Advertisement

Jai Hanuman: చిరంజీవి, మహేష్ బాబు కీలక పాత్రల్లో 'జై హనుమాన్' .. ప్రశాంత్ వర్మ కీలక వ్యాఖ్యలు..

Jai Hanuman: 2024 సంక్రాంతి సీజన్‌లో విడుదలైన హనుమాన్ సినిమా బ్లాక్ బస్టర్‌గా నిలిచింది. అంతేకాదు థియేట్రికల్‌గా ఈ మూవీ బయ్యర్స్‌కు రూ. 100 కోట్లకు పైగా లాభాలను తీసుకొచ్చింది. ఈ మూవీకి సీక్వెల్‌గా 'జై హనుమాన్' మూవీ తెరకెక్కించబోతున్నట్టు ఈ మూవీ క్లైమాక్స్‌లో చెప్పిన సంగతి తెలిసిందే కదా. ఈ సీక్వెల్‌లో కీలక పాత్రల్లో చిరంజీవి, మహేష్ బాబు నటించే అవకాశాలున్నట్టు దర్శకుడు ప్రశాంత్ వర్మ తెలిపాడు.

Jai Hanuman: చిరంజీవి, మహేష్ బాబు కీలక పాత్రల్లో 'జై హనుమాన్' .. ప్రశాంత్ వర్మ కీలక వ్యాఖ్యలు..

Hanu Man Sequel Jai Hanuman: త్రేతా యుగంలో శ్రీ రాముడికి హనుమంతుడు ఏం ప్రతిజ్ఞ చేసాడు. రాముడికి ఇచ్చిన మాట ఏమిటనేది జై హనుమాన్ మూవీలో చూపించబోతున్నట్టు ప్రశాంత్ వర్మ.. హనుమాన్ సినిమా క్లైమాక్స్‌లో చూపించాడు. అదే ఈ మూవీ విజయంలో కీ రోల్ పోషించింది. అంతేకాదు 2025లోనే జై హనుమాన్ మూవీ రిలీజ్ చేస్తున్నట్టు ప్రకటించాడు. ఈ మూవీ అనౌన్స్‌మెంట్ దగ్గర నుంచి ఈ మూవీలో శ్రీరాముడు, హనుమంతుడు పాత్రలు ఎవరు చేస్తారనేది ఆసక్తికరంగా మారింది. ఇప్పటికే స్క్రిప్ట్ వర్క్ పూర్తి చేసినట్టు ప్రశాంత్ వర్మ తెలిపాడు. ఈ మూవీని లార్జ్ స్కేల్‌లో పెద్ద నటీనటులతో తెరకెక్కించబోతున్నట్టు చెప్పారు.

ఈ సందర్బంగా సామాజిక మాధ్యమాల్లో వస్తోన్న వార్తలతో పాటు తన మనుసులో మాట బయటపెట్టాడు. ఈ మూవీలో శ్రీరాముడిగా మహేష్ బాబు చేస్తే బాగుంటుందని ప్రశాంత్ వర్మ చెప్పాడు. ఇప్పటికే సోషల్ మీడియాలో మహేష్‌ బాబు శ్రీరాముడిగా ఉన్న ఫోటోలు తెగ వైరల్ అవుతున్నాయి. ఇక మా టీమ్ కూడా మహేష్ బాబు రాముడికి ఉన్న ఫోటోలను మా స్టూడియోలో రీ క్రియేట్ చేసి చూసుకున్నామన్నారు.

అటు హనుమాన్ పాత్ర కూడా పెద్దదే. దాన్ని పోషించే నటుడిని చూస్తే భక్తి భావం పొంగిపొర్లాలి. నిజ జీవితంలో కూడా భక్తి భావం ఉండాలి. చిరంజీవి గారు హనుమంతుడి పాత్ర పోషిస్తే బాగుంటుందన్నారు. ఆన్ స్క్రీన్‌తో పాటు ఆఫ్ స్క్రీన్‌లో కూడా వారి ఇమేజ్ సరితూగాలి. అందుకు చిరంజీవి పర్ఫెక్ట్ ఛాయిస్ అన్నారు. గతంలో చిరంజీవి .. జగదేకవీరుడు అతిలోకసుందరి సినిమాలో ఓ సన్నివేశంలో హనుమంతుడి వేషంలో కనిపిస్తారు. ఇపుడు పూర్తి స్థాయిలో చేస్తే చూడాలనుకునే అభిమానుల్లో నేను ఒకడిని అన్నారు.

ఇక ఆంజనేయ స్వామికి అష్ట సిద్ధులు తెలుసు. ఆయన ఏ రూపంలోనైనా కనిపించవచ్చు. ఆ శక్తులను జై హనుమాన్ సినిమాలో చూపించబోతున్నట్టు ప్రశాంత్ వర్మ చెప్పారు. ఇప్పటికే పలువురు బాలీవుడ్ నటులు సైతం హనుమాన్ పాత్ర పోషించడానికి రెడీ అంటున్నారు. కానీ తన మనసులో మాత్రం చిరంజీవి గారే ఉన్నారని చెప్పుకొచ్చారు. అంతేకాదు మేము అనుకున్న భారతీయ సూపర్ హీరోల సినిమాలన్ని తెరకెక్కిస్తాము.

ఇప్పటికే తన దగ్గర 25 మందితో ఓ స్క్రిప్ట్ టీమ్ పనిచేస్తోంది. దాన్ని 100కి పెంచుతానని చెప్పుకొచ్చాడు. మా దగ్గర ఉన్న కొంత మంది అసిస్టెంట్స్ కే ఇంత అమౌంట్ ఇచ్చి షూట్ చేసుకొని రమ్మని చెబుతాను. అది నచ్చితే వాళ్లకే ప్రాజెక్ట్ అప్పగిస్తాము. జై హనుమాన్ మూవీకి సంబంధించిన పనులు యేడాది కిందటే మొదలయ్యాయి. ఈ సినిమాను ఎలా షూట్ చేయాలి. వీఎఫ్ఎక్స్ పనుల వంటి విషయాల్లో క్లారిటీ రావాల్సి ఉంది. అంతేకాదు రాబోయే సినిమాల నాణ్యత విషయంలో అస్సలు రాజీ పడబోమన్నారు.

  Also Read Hacking Accounts: తెలంగాణపై హ్యాకర్ల ముప్పేట దాడి.. గవర్నర్‌, మంత్రి, కవిత ఖాతాలను వదలని హ్యాకర్లు‌

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి FacebookTwitter

Read More