Home> వినోదం
Advertisement

Guntur Kaaram Songs: గుంటూరు కారం నుంచి రొమాంటిక్ మెలోడీ ‘ఓ మై బేబీ’ వచ్చేసింది..

Guntur Kaaram Songs: మహేశ్ బాబు హీరోగా నటించిన గుంటూరు కారం మూవీ నుంచి రెండో సాంగ్ రిలీజైంది.  ‘ఓ మై బేబీ’ అంటూ సాగే ఈ సాంగ్ ఆడియెన్స్ ను ఆకట్టుకుంటోంది. 
 

Guntur Kaaram Songs: గుంటూరు కారం నుంచి రొమాంటిక్ మెలోడీ ‘ఓ మై బేబీ’ వచ్చేసింది..

Guntur Kaaram 'Oh My Baby 'Song Released: సూపర్ స్టార్ మహేశ్ బాబు-త్రివిక్రమ్ కాంబోలో తెరకెక్కిన సినిమా గుంటూరు కారం (Guntur Kaaram). తాజాగా (డిసెంబర్ 13) ఈ మూవీ నుంచి రెండో లిరికల్ సాంగ్ రిలీజైంది. ‘ఓ మై బేబీ’ (Oh My Baby Song)అంటూ సాగే ఈ రొమాంటిక్ సాంగ్ ఆడియెన్స్ ను ఎట్రాక్ట్ చేసేలా ఉంది. డిసెంబరు 11న ఈ సాంగ్ ప్రోమో విడుదల చేయగా.. తాజాగా పుల్ సాంగ్ ను విడుదల చేశారు. ఇందులో శ్రీలీల, మహేష్ కెమెస్ట్రీ అదిరింది. ఈ పాటకు రామజోగయ్య శాస్త్రి లిరిక్స్ అందించగా.. శిల్పా రావు అలపించారు. గుంటూరు కారం మూవీ సంక్రాంతి కానుకగా జనవరి 12న ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ చేయనున్నారు. 

ఇప్పటికే ఈ మూవీ నుంచి రిలీజైన పోస్టర్స్, గ్లింప్స్ కు అదిరిపోయే రెస్పాన్స్ వచ్చింది. తొలి సాంగ్  కూడా మంచి వ్యూస్ తో దూసుకుపోతుంది. అతడు, ఖలేజా తర్వాత మహేష్-త్రివిక్రమ్ కలయికలో వస్తున్న సినిమా కావడంతో దీనిపై భారీగానే అంచనాలు ఉన్నాయి. హారిక అండ్‌ హాసిని క్రియేషన్స్‌ పతాకంపై ఎస్‌.రాధాకృష్ణ నిర్మిస్తున్న ఈ సినిమాకు తమన్ సంగీతం అందిస్తున్నారు. ఈ చిత్రంలో జగపతి బాబు, రమ్యకృష్ణ, జయరాం, ప్రకాశ్ రాజ్, సునీల్ తదితరులు కీలకపాత్రల్లో నటించారు. 

రిలీజ్ డేట్ దగ్గర పడుతుండడంతో మూవీ ప్రమోషన్స్ లో జోరు పెంచింది మహేష్ టీం. అందులో భాగంగానే సాంగ్స్ రిలీజ్ చేస్తోంది. అయితే మరోవైపు ఈ మూవీ ప్రమోషన్స్ లో భాగంగా.. సూపర్ స్టార్ మహేష్ బాలయ్య అన్‌స్టాప‌బుల్ షోకు గెస్ట్ గా వెళ్లనున్నారనే ప్రచారం జరగుతోంది. దీంతోపాటు బిగ్ బాస్ ఫినాలే కూడా మహేష్ గెస్ట్ గా వెళ్లనున్నారట. దీని బట్టి చూస్తే గుంటూరు కారం మేకర్స్ ప్రమోషన్స్ భారీగానే ఫ్లాన్ చేసినట్లు తెలుస్తోంది. 

Also Read: Unstoppable With Nbk: మ‌రోసారి బాల‌య్య షోకు మహేష్ బాబు.. ఈ సారి ఆ స్టార్ డైరెక్టర్ తో కలిసి..

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

TwitterFacebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

Read More