Home> వినోదం
Advertisement

Guntur Kaaram: కుర్చీ మడతపెట్టి సాంగ్‌ను మొత్తంగా దింపేసిన జపాన్ జంట.. వైరల్ అవుతున్న వీడియో..

Mahesh Babu - Guntur Kaaram: మహేష్ బాబు, త్రివిక్రమ్ కాంబినేషనలో ఈ సంక్రాంతి కానుకగా విడుదలైన 'గుంటూరు కారం' సినిమా డివైడ్ టాక్‌తో మంచి వసూళ్లనే సాధించింది. ఇక ఈ సినిమాలోని కుర్చీ మడతపెట్టి సాంగ్ పై ముందుగా నెగిటివ్ కామెంట్స్ వినిపించగా.. ఇందులో ఈ పాటనే బ్లాక్ బస్టర్‌గా నిలిచింది. అంతేకాదు ఈ సినిమాలోని స్టెప్పులను ఇపుడు విదేశీయులు సైతం వీడియోలు చేస్తూ సోషల్ మీడియాలో రచ్చ లేపుతున్నారు.

Guntur Kaaram: కుర్చీ మడతపెట్టి సాంగ్‌ను మొత్తంగా దింపేసిన జపాన్ జంట.. వైరల్ అవుతున్న వీడియో..

Mahesh Babu - Guntur Kaaram: సూపర్ స్టార్‌ మహేష్ బాబుతో స్టార్ డైరెక్టర్ త్రివిక్రమ్ తెరకెక్కించిన మూవీ 'గుంటూరు కారం'. గతంలో వీళ్లిద్దరి కలయిలో అతడు, ఖలేజా సినిమాలు వచ్చాయి. అందులో అతడు మూవీ కల్ట్ క్లాసిక్‌గా నిలిస్తే.. ఖలేజా మూవీ సిల్వర్ స్క్రీన్ పై కాకుండా స్మాల్ స్క్రీన్ పై సూపర్ హిట్టైయింది. దీంతో గుంటూరు కారం మూవీపై అభిమానులు భారీ అంచనాలే పెట్టుకున్నారు. కానీ ఈ సినిమాకు ఓ మోస్తరు టాక్‌తో అనుకున్నంత రేంజ్‌లో వసూళ్లను రాబట్టలేకపోయింది.

గుంటూరు కారం మూవీకి ఫస్ట్ డే మహేష్ బాబు ఇమేజ్‌తో పాటు త్రివిక్రమ్ స్టార్ డమ్ వంటివి  కలిసొచ్చి మంచి కలెక్షన్స్‌నే  రాబట్టింది.అంతేకాదు రూ. 90 కోట్లకు పైగా గ్రాస్ వసూళ్లతో నాన్ ప్యాన్ ఇండియా క్యాటగిరిలో హైయ్యెస్ట్ ఫస్ట్ డే వసూళ్లను సాధించిన మూవీగా 'గుంటూరు కారం' రికార్డులకు ఎక్కింది. మరోవైపు ఈ సినిమాకు పోటీగా విడుదలైన హనుమాన్ మూవీ సూపర్ పాజిటివ్ టాక్ తెచ్చుకోవడం గుంటూరు కారం సినిమాకు కాస్త మైనస్‌గా మారింది. మొత్తంగా బాక్సాఫీస్ దగ్గర హనుమాన్ సినిమా దూకుడును  సైతం తట్టుకుంటూ ఓన్లీ మహేష్ బాబు ఇమేజ్ కారణంగా  ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర డీసెంట్ కలెక్షన్స్ రాబట్టింది.

ఇక ఈ సినిమా రిలీజ్‌కు ముందు కుర్చీ మడతపెట్టి సాంగ్ మహేష్‌ బాబుతో త్రివిక్రమ్ చేయించడంపై నెగిటివ్ కామెంట్స్ వినిపించాయి. కానీ విడుదల తర్వాత అదే ఈ సినిమాకు ప్లస్‌గా మారింది. ఈ పాటలో మహేష్ బాబు.. శ్రీలీలతో కలిసి వేసిన స్టెప్పులతో థియేటర్స్ అదిరిపోయాయి. ప్రస్తుతం లిరికల్ వీడియో.. ఫుల్ వీడియో సాంగ్ యూట్యూబ్‌లో ట్రెండింగ్‌లో కొనసాగుతోంది. ఈ మూవీ సాంగ్ ఇప్పటికే దాదాపు 170 మిలియన్ వ్యూస్ రాబట్టింది. అంతేకాదు ఈ పాట తెలుగులోనే కాదు విదేశీలను సైతం ఆకట్టుకుంటుంది.

గతంలో ఆర్ఆర్ఆర్‌లోని 'నాటు నాటు' తరహాలోనే ఈ పాటకు విదేశీలు స్టెప్పులు వేస్తున్నారు. తాజాగా జపాన్ దేశానికి చెందిన ఓ జంట కుర్చీ మడతపెట్టి సాంగ్‌ను మక్కీకీ మక్కీ దింపేసింది. ఈ వీడియో మహేష్ ఆర్మీకి సంబంధించిన ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసారు. ఈ పాట కూడా సోషల్ మీడియాలో రచ్చ లేపుతోంది. మొత్తంగా ఈ పాటకు జపాన్ దేశపు జంట చేసిన డాన్స్ వీడియో నెటింట్లో వైరల్ అవుతోంది. గుంటూరు కారం సినిమా ప్రస్తుతం నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ అవుతోంది. అక్కడ నెంబర్ వన్ ట్రెండింగ్‌లో ఓ వారం పాటు కొనసాగింది. ప్రస్తుతం ఈ సినిమాకు సంబంధించి హిందీ, తెలుగులో టాప్‌ 10లో ట్రెండ్ అవుతోంది.

మహేష్ బాబు విషయానికొస్తే.. త్వరలో ఈయన రాజమౌళి సినిమా షూటింగ్‌లో జాయిన్ కానున్నారు. దానికి సంబంధించిన పనులు జరగుతున్నాయి. త్వరలో సెట్స్ పైకి వెళ్లనుంది. ఈ సినిమాకు 'మహారాజ్' అనే టైటిల్ సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతోంది. ఇదే ఈ సినిమాకు పెడతారా.. ? మరేదైనా పెడతారా అనేది చూడాలి.

ఇదీ చదవండి: రోడ్డు ప్రమాదంలో బీఆర్ఎస్ ఎమ్మెల్యే లాస్య నందిత మృతి

ఇదీ చదవండి: నేడు స్కూళ్లు, కాలేజీలకు సెలవు ప్రకటించిన ప్రభుత్వం..

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

 Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

Read More