Home> వినోదం
Advertisement

Gully boys Riyaz: భార్యతో 'జీ తెలుగు జాతర'లో రచ్చ చేసిన రియాజ్.. ఎలా ఉందో చూశారా?

Gully boys Riyaz Wife: ఒక ఇంటివాడైన రియాజ్ ఎట్టకేలకు తన భార్యను తెలుగు ప్రేక్షకులకు పరిచయం చేశాడు. 'జీ తెలుగు వారి బోనాల జాతర స్పెషల్' ఈవెంట్లో తన భార్యతో కలిసి కనిపించాడు.

Gully boys Riyaz: భార్యతో 'జీ తెలుగు జాతర'లో రచ్చ చేసిన రియాజ్.. ఎలా ఉందో చూశారా?

Gully boys Riyaz Wife: గల్లీ బాయ్స్ రియాజ్ గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. తొలత సోషల్ మీడియాలో వీడియోలు చేస్తూ ఫేమస్ అయిన ఆయన తన మరుగుజ్జు రూపంతో ప్రేక్షకులకు బాగా దగ్గరయ్యాడు. అయితే జబర్దస్త్ లో కొన్ని ఎపిసోడ్స్ లో కనిపించిన తర్వాత పటాస్ ద్వారా ఫేమస్ అయిన సద్దాం హుస్సేన్ తో కలిసి జీ తెలుగులో ప్రసారమైన అదిరింది షోలో కనిపించి మరింత పేరు తెచ్చుకున్నాడు. ఆ తర్వాత కామెడీ స్టార్స్ లో కూడా ఈ మధ్య కనిపిస్తున్నాడు.

ఆ మధ్య రియాజ్ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిని ఇమిటేట్ చేస్తూ చేసిన ఒక స్కిట్ వివాదాస్పదంగా మారడంతో అనూహ్యంగా క్షమాపణలు కూడా చెప్పాల్సి వచ్చింది. ఆ వివాదం అక్కడితో సద్దుమణిగింది. ఇక ఈ మధ్యనే నెల్లూరు పట్టణానికి చెందిన ఒక అమ్మాయిని పెళ్లి చేసుకుని ఒక ఇంటివాడైన రియాజ్ ఎట్టకేలకు తన భార్యను తెలుగు ప్రేక్షకులకు పరిచయం చేశాడు. బోనాలు సంబరాల సందర్భంగా జీ తెలుగు నిర్వహిస్తున్న 'జీ తెలుగు వారి బోనాల జాతర స్పెషల్' ఈవెంట్లో తన భార్యతో కలిసి కనిపించాడు.

ఇద్దరు కలిసి స్టేజి మీదకు రావడంతో ఆమె పేరు ఏమిటి అని శ్రీముఖి అడుగుతే ఆమె పేరు యాస్మిన్ అని చెబుతాడు, అయితే యాస్మిన్ రియాజ్ అని పక్కనే ఉన్న సద్దాం హుస్సేన్ అనడం ఆసక్తికరంగా మారింది. ఇక ఈ సందర్భంగా రియాజ్, సద్దాం ఇద్దరిలో ఎవరి బాగా కామెడీ చేస్తారు అని అడిగితే మరో మాట లేకుండా తన భర్త రియాజ్ అద్భుతంగా కామెడీ చేస్తాడని యాస్మిన్ చెప్పింది. కేవలం 20 సెకండ్ల నిడివి ఉన్న ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతుంది.

రియాజ్ పెళ్లి చేసుకున్న అమ్మాయి ఎలా ఉంటుందో అని చాలా కాలం నుంచి చాలామంది ఎదురు చూడగా ఇప్పుడు దానికి ఒక క్లారిటీ వచ్చినట్లయింది. ఇక జనసేన అభ్యర్థిగా గతంలో మునిసిపల్ ఎన్నికలలో కూడా రియాజ్ పోటీ చేసి ఓటమి పాలయ్యారు. ప్రస్తుతం ఒక పక్క వెబ్ సిరీస్ మరోపక్క సినిమాలు చేస్తూనే వరుస టీవీ షోస్ లో అవకాశాలు దక్కించుకుంటున్నారు.

Read Also: Vijay Rashmika Love: రష్మికతో ప్రేమలో విజయ్ దేవరకొండ.. బయటపెట్టేసిన అనన్య పాండే.. ఇదిగో వీడియో
Read Also: Chikoti Praveen: ఏయే హీరోయిన్ కి చికోటి ప్రవీణ్ ఎంత ఇచ్చాడో తెలుసా?

స్థానిక నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.   

Android Link https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Twitter , Facebook

Read More