Home> వినోదం
Advertisement

Kantara OTT Release: గుడ్‌న్యూస్, అమెజాన్ ప్రైమ్‌లో విడుదలైన కాంతారా

Kantara OTT Release: ఏ మాత్రం చడీ చప్పుడు లేకుండా..సైలెంట్‌గా విడుదలై సంచలనం రేపిన కాంతారా ఇప్పుడు ఓటీటీ స్ట్రీమింగ్ అవుతోంది. బాక్సాఫీసు రికార్డు బద్దలుగొట్టి..ప్రపంచవ్యాప్తంగా భారీగా వసూళ్లు చేసిన సినిమా ఇది. 

Kantara OTT Release: గుడ్‌న్యూస్, అమెజాన్ ప్రైమ్‌లో విడుదలైన కాంతారా

ఇటీవల భారీ విజయాన్ని నమోదు చేసుకున్న పాన్ ఇండియా సినిమా కాంతారా కోసం నెటిజన్ల నిరీక్షణకు తెరపడింది. ఇవాళ్టి నుంచి కాంతారా సినిమా అమెజాన్‌లో స్ట్రీమింగ్ ప్రారంభమైంది. తెలుగు, తమిళ, మలయాళం, కన్నడ భాషల్లో స్ట్రీమింగ్ అవుతోంది.

చలనచిత్ర పరిశ్రమలో ఇప్పుడు ఏ నోట విన్నా కాంతారా గురించే చర్చ నడుస్తోంది. సెప్టెంబర్ 30న విడుదలైన ఈ పాన్ ఇండియా సినిమా ప్రపంచవ్యాప్తంగా 400 కోట్లు వసూలు చేసింది. బాక్సాఫీసు రికార్డులు బద్దలుగొట్టింది. ఈ సినిమా ఓటీటీ విడుదల ఎప్పుడా అనే నిరీక్షణకు తెరపడింది. నవంబర్ 24 అంటే ఇవాల్టి నుంచి అమెజాన్ ఓటీటీలో స్ట్రీమింగ్‌‌కు సిద్ధమైంది. ఈ విషయాన్ని కాంతారా సినిమా హీరో కమ్ డైరెక్టర్ రిషభ్ శెట్టి స్వయంగా వెల్లడించారు. కథనం, అద్భుతమైన విజ్యువల్స్‌కు ప్రేక్షకుల్నించి భారీ స్పందన వ్యక్తమైంది. 

ఈ సినిమాలో దక్షిణ కన్నడ కాల్పనిక గ్రామం నేపధ్యంలో కాంతారావు శెట్టి అనే పాత్రలో కన్పిస్తారు రిషభ్ శెట్టి. కంబాల ఛాంపియన్‌గా నటించిన రిషభ్ శెట్టికి ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్‌కు మధ్య జరిగే పోరాటమిది. ఓటీటీ విడుదల సందర్భంగా రిషభ్ శెట్టి ఓ కీలక విషయాన్ని వెల్లడించాడు. ఇందులో సీక్వెన్స్ చాలా కష్టంగా ఉందని..360 డిగ్రీల షాట్స్, రెయిన్ ఎఫెక్ట్‌తో కూడిన సింగిల్ షాట్ అని అన్నారు. మరోవైపు షూటింగ్ జరిగే ప్రాంతానికి నీళ్లను తీసుకెళ్లడం కష్టమైందన్నాడు. బావి నుంచి నీరు తీసుకునేందుకు గ్రామస్థుల అనుమతి కోరామన్నారు. షూటింగ్ సందర్భంగా రెండు సందర్భాల్లో రెండు భుజాలకు గాయమైనా..ఆపకుండా షూటింగ్ కొనసాగించానన్నాడు. 

ప్రపంచ బాక్సాఫీసు వద్ద 400 కోట్లకు పైగా వసూలు చేసి..ఆర్ఆర్ఆర్, కేజీఎఫ్ ఛాప్టర్ 2, పొన్నియన్ సెల్వన్ 1, బ్రహ్మాస్త్ర, విక్రమ్ తరువాత కాంతారా సినిమా ఆరవ భారతీయ చిత్రంగా నిలిచింది. కధపై నమ్మకమే సినిమాను విజయవంతం చేసిందని రిషభ్ శెట్టి తెలిపాడు. 

Also read: Superstar Krishna Death : సూపర్ స్టార్ కృష్ణ మరణం.. గుండెలు మెలిపెట్టేలా మహేష్‌ బాబు తొలి పోస్ట్

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Read More