Home> వినోదం
Advertisement

Ram Charan - Keerthy Suresh: కీర్తి సురేష్‌కి పడిపోయిన మెగా హీరో.. నాటునాటు మాములుగా లేదుగా!!

Ram Charan Impressed Keerthy Suresh Acting. 'మహానటి' సినిమాలో కీర్తి సురేష్‌ నటనకి అభిమానినయ్యా అని మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తెలిపారు.

Ram Charan - Keerthy Suresh: కీర్తి సురేష్‌కి పడిపోయిన మెగా హీరో.. నాటునాటు మాములుగా లేదుగా!!

Ram Charan Impressed Keerthy Suresh Acting: స్టార్ హీరోయిన్ కీర్తి సురేశ్‌ (Keerthy Suresh) ప్రధాన పాత్రలో నటించిన చిత్రం 'గుడ్‌ లక్‌ సఖి' (Good Luck Sakhi). క్రీడా నేపథ్యంలో తెరకెక్కిన ఈ సినిమాని నగేష్‌ కుకునూరు (Nagesh Kukunoor) దర్శకత్వం వహించారు. ఈ చిత్రంలో రైఫిల్‌ షూటర్‌ పాత్రలో కీర్తి, కోచ్‌ పాత్రలో సీనియర్ హీరో జగపతి బాబు నటించారు. ఇప్పటికే చాలాసార్లు వాయిదా పడిన గుడ్‌ లక్‌ సఖి సినిమా శుక్రవారం (జనవరి 28) విడుదల కానుంది. ఈ నేపథ్యంలో బుధవారం రాత్రి హైదరాబాద్‌లో 'గుడ్‌ లక్‌ సఖి' ప్రీ రిలీజ్ ఈవెంట్ జరిగింది. 

'గుడ్‌ లక్‌ సఖి' ప్రీ రిలీజ్ ఈవెంట్‌ (Good Luck Sakhi PreRelease Event)కు ముఖ్య అతిథిగా హాజరు కావాల్సిన మెగాస్టార్ చిరంజీవికి కరోనా సోకడంతో ఆయన స్థానంలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ (Ram Charan) వచ్చారు. ఈ వేడుకలో చరణ్ మాట్లాడుతూ దర్శకనిర్మాతలను అభినందించారు. ఇక ఈ సినిమాకు చాలా మంది జాతీయ అవార్డు గ్రహీతలు పని చేశారని, దీనిని చిన్న సినిమా అని పిలవవద్దన్నారు. గుడ్‌ లక్‌ సఖి సినిమాకు సోలో రిలీజ్ డేట్ దొరికిందని, సినిమా పెద్ద హిట్ కావాలని చరణ్ కోరుకున్నారు. 

Also Read: Kohli - Manjrekar: అభిమానులకు ఐసీసీ ట్రోఫీలు కావాలి.. ర్యాంకులు కాదు! బీసీసీఐకి మంజ్రేకర్ మద్దతు!!

'నాన్న గారి సందేశాన్ని వినిపించడానికే నేను ఈ వేడుకకి వచ్చా. నాన్న కరోనాతో ఈ వేడుకకి రాలేకపోయారు. అంతర్జాతీయ తరహా కథల్ని భారతీయ సినిమాల్లోకి తీసుకొచ్చిన ఘనత నగేష్‌ కుకునూర్‌ సొంతం. హైదరాబాద్‌ బ్లూస్‌, ఇక్బాల్‌ లాంటి సినిమాలు చూసి ఎంతో స్ఫూర్తి పొందాను. ఆయనతో కలిసి ఈ వేదికని పంచుకున్నందుకు చాలా సంతోషంగా ఉంది' అని మెగా పవర్ స్టార్ పేర్కొన్నారు.

కీర్తి సురేష్‌ 'అజ్ఞాతవాసి' సినిమాలోనే తనకు బాగా నచ్చిందని, 'మహానటి' చూశాక ఆమె నటనకి అభిమానినయ్యా అని మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తెలిపారు. 'గుడ్‌ లక్‌ సఖి' సినిమాలో కీర్తి చెప్పిన చిత్తూరు యాస చాలా బాగుందని, ఇలాంటి కథలు కీర్తి మరిన్ని చేయాలి కోరుకున్నారు. ఆర్‌ఆర్‌ఆర్ సినిమాలోని నాటు నాటు పాటకు తనతో పాటు స్టెప్పులు వేయాలని కీర్తి కోరగా.. చరణ్ అదరగొట్టాడు. కీర్తితో కలిసి చరణ్ స్టెప్పులేయడం అందరినీ ఆకట్టుకుంది. ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. త్వరలోనే కీర్తితో చరణ్ ఓ సినిమా చేయనున్నాడని సమాచారం.

Alo Read: Horoscope Today January 27 2022: నేటి రాశి ఫలాలు.. ఆ రాశి వారికి పూర్తి మిశ్రమకాలం!!

షూటింగ్‌ ప్రధానాంశంగా సాగే 'గుడ్‌ లక్‌ సఖి' కథలో కీర్తి సురేశ్‌ 'సఖి' అనే గ్రామీణ యువతి పాత్ర పోషించారు. సఖికి శిక్షణ ఇచ్చే వ్యక్తిగా జగపతి బాబు కనిపించనున్నారు. ఆది పినిశెట్టి, రాహుల్ రామకృష్ణ కీలక పాత్రలో కనిపించనున్నారు. తన గ్రామంలో ఉన్న వారందరి చేత బ్యాడ్‌లక్‌ సఖిగా పిలిపించుకున్న ఆమె.. దేశ వ్యాప్తంగా ఎలా గుర్తింపు తెచ్చుకున్నారు? ఆమె జీవితం ఎలాంటి మలుపులు తీసుకుంది? అనే ఆసక్తికర అంశాలతో ఈ సినిమా తెరకెక్కింది. దిల్‌ రాజు సమర్పణలో సుధీర్‌ చంద్ర పదిరి నిర్మించిన ఈ సినిమాకు దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందించారు.

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Read More