Home> వినోదం
Advertisement

Ghani Special Song Video: గని మూవీ నుంచి సర్ ప్రైజ్.. తమన్నా స్పెషల్ సాంగ్ ఫుల్ వీడియో రిలీజ్!

Ghani Special Song Video: యువ కథానాయకుడు వరుణ్ తేజ్, సయీ మంజ్రేకర్ జంటగా నటించిన చిత్రం 'గని'. బాక్సింగ్ నేపథ్యంలో తెరకెక్కిన ఈ మూవీని ఏప్రిల్ 8న విడుదల చేయనున్నారు. ఈ క్రమంలో ప్రమోషన్స్ జోరు పెంచిన చిత్రబృందం సినిమాలోని తమన్నా స్పెషల్ సాంగ్ వీడియోను విడుదల చేసింది. 
 

Ghani Special Song Video: గని మూవీ నుంచి సర్ ప్రైజ్.. తమన్నా స్పెషల్ సాంగ్ ఫుల్ వీడియో రిలీజ్!

Ghani Special Song Video: మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ హీరోగా బాలీవుడ్ సయీ మంజ్రేకర్ హీరోయిన్ గా నటించిన చిత్రం 'గని'. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం.. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ పూర్తి చేసుకుంటోంది. ఏప్రిల్ 8న సినిమా థియేటర్లలో విడుదల కానుంది. ఈ క్రమంలో సినిమాకు సంబంధించిన ప్రమోషన్స్ ను చిత్రబృందం షురూ చేసింది. ఇప్పటికే ఈ సినిమాలోని విడుదలైన మూడు లిరికల్ సాంగ్స్ ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నాయి. 

అయితే ఇప్పుడీ సినిమాలోని స్పెషల్ సాంగ్ వీడియోను మేకర్స్ రిలీజ్ చేశారు. 'కొడితే' లిరికల్ సాంగ్ ఇప్పటికే ప్రేక్షకులను అలరిస్తుండగా.. ఇప్పుడా సాంగ్ ఫుల్ వీడియోను చిత్రబృందం రిలీజ్ చేసింది. ఈ స్పెషల్ సాంగ్ లో స్టార్ హీరోయిన్ తమన్నా స్టెప్పులేసింది. తమన్నా డ్యాన్స్ కు కుర్రకారు ఫిదా అవుతున్నారు. 

'కొడితే' సాంగ్ ను రామజోగయ్య శాస్త్రి రచించగా.. హారికా నారాయణ్ ఆలపించింది. ఎస్ ఎస్ తమన్ సంగీతాన్ని సమకూర్చారు. బాక్సింగ్ నేపథ్యంలో రూపొందిన ఈ చిత్రంలో వరుణ్ తేజ్ కు జంటగా సయీ మంజ్రేకర్ నటించగా.. బాలీవుడ్ నటుడు సునీల్ శెట్టి, జగపతి బాబు, ఉపేంద్ర, నవీన్ చంద్ర సినిమాలో కీలక పాత్రలు పోషించారు. కిరణ్ కొర్రపాటి దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రానికి.. సిద్ధు ముద్ద, అల్లు బాబీ నిర్మాతలుగా వ్యవహరించారు.  

Also Read: Nagumomu Tharale Video Song: ప్రభాస్ ఫ్యాన్స్ కు గుడ్ న్యూస్.. 'నగుమోము తారలే' సాంగ్ వీడియో రిలీజ్!

Also Read: Samyuktha Menon Photos: సంప్రదాయ దుస్తుల్లో మెరిసిపోతున్న 'భీమ్లానాయక్' హీరోయిన్!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి. 

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Read More