Home> వినోదం
Advertisement

Ghani Pre Release Event: గని మూవీ ప్రీరిలీజ్ ఈవెంట్ కు ముఖ్యఅతిథిగా అల్లు అర్జున్!

Ghani Pre Release Event: మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ హీరోగా నటిస్తున్న చిత్రం 'గని'. ఈ సినిమా ప్రీరిలీజ్ ఈవెంట్ ను ఏప్రిల్ 2న వైజాగ్ లో నిర్వహించనున్నారు. ఈ వేడుకకు ముఖ్యఅతిథిగా ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హాజరుకానున్నారు. 
 

Ghani Pre Release Event: గని మూవీ ప్రీరిలీజ్ ఈవెంట్ కు ముఖ్యఅతిథిగా అల్లు అర్జున్!

Ghani Pre Release Event: మెగాప్రిన్స్ వరుణ్ తేజ్, సయీ మంజ్రేకర్‌ హీరోహీరోయిన్లుగా నటించిన సినిమా 'గని'. కరోనా కారణంగా గత కొన్ని నెలలుగా విడుదల ఆలస్యమవుతున్న ఈ చిత్రం ఎట్టకేలకు ఏప్రిల్ 8న థియేటర్లలో రిలీజ్ అయ్యేందుకు సిద్ధమైంది. ఈ క్రమంలో మూవీ ప్రమోషన్స్ లో చిత్రబృందం జోరును పెంచేసింది. 

ఈ సినిమా ప్రీరిలీజ్ ఈవెంట్ కోసం 'గని' చిత్రబృందం ఓ ప్రకటన చేసింది. ఈ వేడుకను ఏప్రిల్ 2న వైజాగ్ వేదికగా నిర్వహించనున్నట్లు స్పష్టం చేసింది. అయితే ఈ ప్రీరిలీజ్ ఈవెంట్ కు ముఖ్యఅతిథిగా ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హాజరు కానున్నారు. ఈయనతో పాటు స్థానిక రాజకీయ నాయకులు విచ్చేసే అవకాశం ఉంది.  

'గని' మూవీలో హీరో వరుణ్ తేజ్ బాక్సర్ గా తెరపై కనిపించనున్నాడు. ఆయన సరసన బాలీవుడ్ హీరోయిన్ సయీ మంజ్రేకర్ నటించింది. బాక్సర్ గా మారేందుకు వరుణ్ తేజ్ చాలా కష్టపడ్డాడు. బాడీని ఫిట్ గా మార్చుకొని సిక్స్ ప్యాక్ తో ప్రొఫెషనల్ గా కనిపించేందుకు అమెరికాకు వెళ్లి మరి బాక్సింగ్ లో ట్రైనింగ్ తీసుకున్నాడు. హాలీవుడ్ మూవీ 'టైటాన్స్‌', బాలీవుడ్‌లో 'సుల్తాన్' వంటి చిత్రాల‌కు యాక్ష‌న్ స‌న్నివేశాల‌ు రూపొందించిన హాలీవుడ్ స్టంట్ మాస్ట‌ర్స్ లార్నెల్ స్టోవ‌ల్‌, వ్లాడ్ రింబ‌ర్గ్ ..గని చిత్రానికి పనిచేశారు. 

ఈ సినిమాతో కిరణ్ కొర్రపాటి తొలిసారి దర్శకుడిగా మారాడు. అల్లు అరవింద్ సమర్పణలో ఈ చిత్రాన్ని అల్లు బాబీ, సిద్ధు ముద్ద నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు. వరుణ్ తేజ్, సయీ మంజ్రేకర్ తో పాటు జగపతిబాబు, సునీల్‌ శెట్టి, ఉపేంద్ర, నవీన్‌చంద్ర కీలక పాత్రలు పోషించారు. ఎస్ ఎస్ తమన్ సంగీతమందిస్తున్నారు.  

Also Read: Ananya Panday Pics: పచ్చ గౌనులో పొడుగుకాళ్ల సుందరి అనన్యా పాండే

Also Read: RGV on Appu: కన్నడ ప్రజల గుండెల్లో అప్పు ఎప్పటికీ ఉండిపోతారు: ఆర్జీవీ

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి. 

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Read More