Home> వినోదం
Advertisement

Ghani Movie Release Date: వరుణ్ తేజ్ 'గని' రిలీజ్ పై నిర్మాతలు క్లారిటీ.. విడుదల ఎప్పుడంటే?

Ghani Movie Release Date: యంగ్ హీరో వరుణ్ తేజ్ నటించిన కొత్త చిత్రం 'గని' రిలీజ్ పై ఆ చిత్ర నిర్మాతలు కీలక ప్రకటన చేశారు. కరోనా ఆంక్షలు సడలించిన వెంటనే సినిమాను థియేటర్లలో రిలీజ్ చేసేందుకు సిద్ధంగా ఉన్నామని తెలిపారు. అయితే సినిమాను విడుదల చేసేందుకు మేకర్స్ నిర్ణయించుకున్న డేట్స్ ను ఈ సందర్భంగా ప్రకటించారు. 
 

Ghani Movie Release Date: వరుణ్ తేజ్ 'గని' రిలీజ్ పై నిర్మాతలు క్లారిటీ.. విడుదల ఎప్పుడంటే?

Ghani Movie Release Date: మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ హీరో నటించిన 'గని' సినిమా రిలీజ్ పై నిర్మాతలు మంగళవారం కీలక ప్రకటన చేశారు. ఈ చిత్రాన్ని త్వరలోనే థియేటర్లలో విడుదల చేసేందుకు సిద్ధంగా ఉన్నామని తెలిపారు. ఇరు తెలుగు రాష్ట్రాలలో కరోనా ఆంక్షల నేపథ్యంలో థియేటర్లు పూర్తిగా తెరుచుకోలేదు. ఆ కరోనా పరిస్థితులు త్వరలోనే పూర్తిగా నయం అవుతాయని తాము నమ్ముతున్నట్లు స్పష్టం చేశారు. 

ఈ నేపథ్యంలో 'గని' సినిమాకు సంబంధించిన కొత్త రిలీజ్ డేట్స్ ను ప్రకటించారు. కరోనా వల్ల ఏర్పడిన పరిస్థితులు చక్కదిద్దుకుంటే.. సినిమాను ఫిబ్రవరి 24 లేదా మార్చి 4న రిలీజ్ చేయనున్నట్లు చిత్ర నిర్మాతలు తెలిపారు. తెలుగు చిత్రసీమకు సంబంధించిన కొన్ని పెద్ద చిత్రాలు రిలీజ్ కానున్న నేపథ్యంలో వారికి ఇబ్బంది కలగకుండా సినిమా రిలీజ్ పై నిర్ణయం తీసుకున్నట్లు చెప్పుకొచ్చారు. 

అనేక సార్లు విడుదల వాయిదా..

ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న 'గని' చిత్రాన్ని.. గతేడాది డిసెంబరులోనే విడుదల చేసేందుకు చిత్రబృందం సన్నద్ధమైంది. కానీ, కొన్ని కారణాల వల్ల సినిమాను వాయిదా వేస్తున్నట్లు అంతకు ముందు ప్రకటించింది. దీంతో పాటుగా గతేడాది జులై, నవంబరు నెలల్లో సినిమాను రిలీజ్ చేయాలని చిత్రబృందం నిర్ణయించినా.. కరోనా ఆంక్షల కారణంగా వెనక్కి తగ్గింది. అయితే డిసెంబరు నెలలో విడుదల చేద్దామనుకున్న సమయంలో 'పుష్ప', 'అఖండ', 'శ్యామ్ సింగరాయ్' చిత్రాలు అప్పటికే బరిలో నిలిచాయి. ఆ తర్వాత సంక్రాంతి బరిలో 'ఆర్ఆర్ఆర్', 'రాధేశ్యామ్' వంటి పాన్ ఇండియా చిత్రాలు రేసులో ఉన్నాయి. అలాంటి పరిస్థితుల్లో 'గని' నిర్మాతలు వెనక్కు తగ్గారు. 

ఈ చిత్రంలో వ‌రుణ్ తేజ్ బాక్స‌ర్ పాత్ర‌లో కనువిందు చేయనున్నాడు. ఈ పాత్ర కోసం వరుణ్ తేజ్ చాలా క‌ష్ట‌ప‌డ్డాడు. సిక్స్ ప్యాక్ చేసి.. బాక్సింగ్‌ ప్రొఫెష‌న‌ల్‌గా క‌నిపించాల‌నే ఉద్దేశంతో అమెరికాకు వెళ్లి మ‌రీ ప్ర‌త్యేక‌మైన శిక్ష‌ణ‌ను తీసుకున్నారు. హాలీవుడ్ చిత్రం 'టైటాన్స్‌', బాలీవుడ్‌లో 'సుల్తాన్' వంటి చిత్రాల‌కు యాక్ష‌న్ స‌న్నివేశాల‌ను డిజైన్ చేసిన హాలీవుడ్ స్టంట్ మాస్ట‌ర్స్ లార్నెల్ స్టోవ‌ల్‌, వ్లాడ్ రింబ‌ర్గ్ ఈ చిత్రానికి యాక్ష‌న్ స‌న్నివేశాల‌ను రూపొందించడం విశేషం. 

ఈ సినిమాలో వరుణ్​కు జోడీగా సయీ మంజ్రేకర్​ నటించారు. జగపతి బాబు, ఉపేంద్ర, సునీల్​ శెట్టి, నవీన్​ చంద్ర, నదియా, నరేశ్, తనికేళ్ల భరణి కీలక పాత్రలు పోషించారు. కిరణ్​ కొర్రపాటి ఈ సినిమాకు దర్శకత్వం వహించగా, తమన్ మ్యూజిక్ అందించారు. అల్లు అరవింద్ సమర్పణలో.. సిద్ధు ముద్ద, అల్లు బాబీ సంయుక్తంగా ఈ సినిమాను నిర్మించారు.  

Also Read: Is Mia Khalifa Dead?: పోర్న్ స్టార్ మియా ఖలీఫా మృతి?.. సోషల్ మీడియాలో న్యూస్ వైరల్!

ALso Read: Malavika Mohanan Bikini: బికినీ ఫొటోషూట్ లో తగ్గేదేలే అంటున్న మాళవిక మోహనన్

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి. 

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Read More