Home> వినోదం
Advertisement

Jabardasth Completes 10 Years : జబర్దస్త్ షోకు పదేళ్లు.. గెటప్ శ్రీను ఎమోషనల్

Jabardasth Completes 10 Years జబర్దస్త్ షో వచ్చి పదేళ్లు అవుతుండటంతో గెటప్ శ్రీను ఎమోషనల్ అయ్యాడు. జీవితాన్ని ఇచ్చింది.. గురువులను ఇచ్చింది.. నడక నేర్పిందంటూ జబర్దస్త్ షో గురించి గెటప్ శ్రీను చెప్పుకొచ్చాడు.

Jabardasth Completes 10 Years : జబర్దస్త్ షోకు పదేళ్లు.. గెటప్ శ్రీను ఎమోషనల్

Jabardasth Completes 10 Years బుల్లితెరపై జబర్దస్త్ షోకు ఉన్న క్రేజ్ గురించి అందరికీ తెలిసిందే. పదేళ్ల పాటు ఈ షో ప్రేక్షకులను ఎంటర్టైన్ చేస్తూనే ఉంది. బూతు షో, అడల్ట్ షో అంటూ ఎన్ని ట్రోల్స్ జరిగినా, ఎన్ని వివాదాలు చుట్టిముట్టినా షో అప్రతిహతంగా సాగుతూనే వచ్చింది. నేటితో ఈ షో ప్రారంభమై పదేళ్లు అవుతోంది. ఈ క్రమంలో జబర్దస్త్ ఆర్టిస్టులు ఎమోషనల్ అవుతున్నారు. ఈ సందర్భంగా గెటప్ శ్రీను పోస్ట్ వేస్తూ..

 

ఫిబ్రవరి 7, 2013 మా తలరాతలు మార్చిన రోజు ... మాలో వున్నా సత్తాను చాటుకునే అవకాశం వచ్చిన రోజు ... ముఖ్యంగా జబర్ధస్త్ ప్రేక్షకుల ఇంట్లో కుటుంబసభ్యులమైన రోజు ... జబర్దస్త్ మొదలైన రోజు ఈరోజు .... మా జబర్దస్త్ ... నటన నేర్పింది... మెళుకువలు నేర్పింది.. గౌరవం నేర్పింది .. నడవడిక నేర్పింది ... బతుకు నేర్పింది 

గురువుల్ని ఇచ్చింది .. అన్నల్ని ఇచ్చింది .. స్నేహితుల్నిచ్చింది..  గుర్తిపునిచ్చింది ... ఆర్థికంగా నిలబెట్టింది ... వెండితెరపై మక్కువుతో వచ్చిన మాకు ... అడ్డుతెరలు తీసింది ... జబర్దస్త్ బుల్లితెర .. నాటి  నుండి నేటి వరకు మా  జబర్దస్త్ కుటుంబాల్లో వెలుగునిచ్చి .. కడుపు నింపుతున్న .. మా అమ్మ జబర్దస్త్ కు ..

ఈ కార్యక్రమాన్ని రూపొందించిన మా మల్లెమాల శ్యామప్రసాద్ రెడ్డి గారికి ..,మీ వరకు తీసుకొచ్చిన ఈటీవీ యాజమాన్యానికి ..,మీ విలువైన సమయాన్ని మాపై వెచ్చించి మమ్మల్ని ఈ స్థాయిలో నిలబెట్టిన జబర్దస్త్ ప్రేక్షకులకి పేరు పేరున పాదాభివందనం ... మాలో ఎవ్వరు ఎక్కడున్నా .. మీ ప్రేమని ఇలాగే మా పై చూపిస్తారని  ఆశిస్తూ .. మీ జబర్దస్త్ కళాకారులు అని ఎమోషనల్ పోస్ట్ వేశాడు.

ఇప్పుడు ఈ షో ఎంతగా పడిపోయిందో అందరికీ తెలిసిందే. ఒకప్పుడు ఆది అనసూయ ట్రాక్, ఆది పంచ్‌లు, సుధీర్ మీద సెటైర్లు, గెటప్ శ్రీను వింత గెటప్‌లతో జబర్దస్త్ షో హవా కొనసాగించేది. కానీ ఇప్పుడు వీరంతా కూడా తమ తమ సినిమాల పనుల్లో బిజీగా ఉన్నారు.

Also Read:  Anasuya Bharadwaj Photoshoot : పొద్దు తిరుగుడు పువ్వులా అనసూయ.. పూలతోటలో సోయగాల పరిమళం

Also Read: Prabhas Health : ప్రభాస్‌కు అనారోగ్యం.. షూటింగ్‌లు క్యాన్సిల్

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 

ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitterFacebook

Read More