Home> వినోదం
Advertisement

"గరుడవేగ" శాటిలైట్ రైట్స్‌కి పోటాపోటీ..!

  

డాక్టర్ రాజశేఖర్ హీరోగా నటించిన "పీఎస్‌వీ గరుడవేగ" ఇటీవలే విడుదలై సూపర్ హిట్టైన విషయం తెలిసిందే. ఇంత భారీ హిట్ సాధించిన ఈ చిత్ర శాటిలైట్ రైట్స్ విషయంలో ప్రస్తుతం పోటాపోటీ వాతావరణం నెలకొంది. దాదాపు 4 కోట్ల నుండి 5 కోట్ల వరకు ఈ శాటిలైట్ హక్కులను కొనడానికి తెలుగు టీవీ ఛానల్స్ మధ్య పోటీ ఏర్పడిందని తెలుస్తోంది. అలాగే హిందీలో కూడా డిజిటల్ రైట్స్ కైవసం చేసుకోవడానికి కొన్ని ప్రముఖ సంస్థలు ముందుకొస్తున్నాయి. సన్నీలియోన్‌కి హిందీలో ఉన్న మార్కెట్ బట్టి, ఈ హక్కులు అడుగుతున్నట్లు వినికిడి. ఆమె ఈ చిత్రంలో ఒక ప్రత్యేక గీతంలో నటించిన సంగతి తెలిసిందే. అలాగే తమిళంలో కూడా ఈ చిత్ర రీమేక్ హక్కులు కొనడానికి కొందరు నిర్మాతలు ముందుకొస్తున్నారు. ప్రవీణ్ సత్తారు దర్శకత్వంలో కోటేశ్వరరాజు, మురళీ శ్రీనివాస్ నిర్మాతలుగా తెరకెక్కిన ఈ చిత్రానికి భీమ్స్ సిసిరీలియో సంగీతం అందించారు. 

Read More