Home> వినోదం
Advertisement

Ghani Film: వరుణ్​ తేజ్ 'గని' విడుదల తేదీ ఫిక్స్​- వాయిదా అందుకేనా?

Ghani Film: వరుణ్​ తేజ్ హీరోగా నటించిన 'గని' సినిమా విడుదల తేదీ ఖరారైంది. ఈ సినిమాను వచ్చే ఏడాది మార్చిలో విడుదల చేయాలని చిత్ర యూనిట్​ నిర్ణయించినట్లు తెలిసింది.

Ghani Film: వరుణ్​ తేజ్ 'గని' విడుదల తేదీ ఫిక్స్​- వాయిదా అందుకేనా?

Ghani Film: మెగా హీరో వరణ్​ తేజ్​ నటించిన తాజా చిత్రం 'గని' నుంచి మరో అప్​డేట్ (Ghani Film) వచ్చింది. ఈ సినిమా విడుదల తేదీని ప్రకటించారు హీరో వరణ్​ తేజ్​. మార్చి 18న సినిమా థియేటర్లలో ప్రేక్షకుల ముందుకు (Ghani Movie release Date) రానున్నట్లు ఇన్​స్టా పోస్ట్​ ద్వారా తెలిపారు.

పలుమార్లు వాయిదా..

ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న గని సినిమాను.. డిసెంబర్​లోనే రిలీజ్​ చేయాలని చిత్ర యూనిట్​ భావించింది. అంతకతు ముందు నవంబర్​లో కూడా ఓ తేదీని అనుకుంది. 2022 జున్​లో విడుదల చేయాలని భావించింది. చివరకు మార్చి 18ని ఫిక్స్ చేసినట్లు తెలుస్తోంది.

డిసెంబర్​లో వుడుద చేద్దామని ముందుగా భావించినప్పటికీ.. 'పుష్ప', 'అఖండ', 'శ్యామ్ సింగరాయ్'​ వంటి సినిమాలతో పోటీ ఉంటుందనే ఉద్దేశంతో డిసెంబర్ రేసు నుంచి తప్పుకుంది గని. ఇక సంక్రాంతి బరిలో 'ఆర్​ఆర్​ఆర్​','రాధే శ్యామ్' వంటి భారీ సినిమాలు ఉన్నాయి. అందుకే పెద్ద సినిమాల పోటీ లేకుండా..  చిత్ర యూనిట్ మార్చి నెలను ఎంచుకున్నట్లు తెలుస్తోంది.

'గని' సినిమా గురించి..

బాక్సింగ్ నేపథ్యంలో ఈ సినిమా సాగుతుంది. బాక్సర్​గా వరుణ్​ లుక్​ కూడా అదిరింది. ఈ సినిమాలో వరుణ్​కు జోడీగా సయూ మంజ్రేకర్​ నటించారు. జగపతి బాబు, ఉపేంద్ర, సునీల్​ శెట్టి, నవీన్​ చంద్ర, నదియా, నరేశ్, తనికేళ్ల భరణి నటించారు.
కిరణ్​ కొర్రపాటి ఈ సినిమాకు దర్శకత్వం (Ghani Movie Director) వహించగా, తమన్ మ్యూజిక్ అందించారు. అల్లు అరవింద్ సమర్పణలో.. సిద్ధు ముద్ద, అల్లు బాబీ సంయుక్తంగా ఈ సినిమాను నిర్మించారు.

'గని'కోసం ప్రత్యేక శిక్షణ..

ఈ సినిమాలో బాక్సర్​గా మెప్పించేందుకు వరుణ్​ ప్రత్యేక శిక్షణ తీసుకున్నారు. ఇంగ్లాండ్​ మాజీ బాక్సర్​ టోనీ జెఫరీస్ వరుణ్​కు శిక్షణనివ్వడం గమనార్హం.

Also read: Anushka and Naveen Polishetty: అనుష్కతో ఖరారైన నవీన్ పోలిశెట్టి అప్‌కమింగ్ మూవీ, కధ ఏంటో తెలుసా

Also read: Sara Tendulkar Pics: హాలిడే ఎంజాయ్ చేస్తూ వివిధ దేశాల్లో సారా టెండూల్కర్

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Read More