Home> వినోదం
Advertisement

Bigg Boss Telugu 4 Elimination: పాపం గంగవ్వ.. ఫస్ట్ వీక్ నామినేట్ అయ్యింది వీరే...

Bigg Boss Telugu 4 Elimination | అప్పుడే బిగ్ బాస్ హౌస్‌లో రచ్చ మొదలైంది. కరాటే కళ్యాణి, జోర్దార్ సుజాతలు రెండో రోజు గొడవపడ్డారు. అప్పుడే ఓదార్చడాలు సైతం మొదలయ్యాయి. రెండో రోజే బిగ్ బాస్ 4 తొలివారం ఎలిమినేషన్ ప్రక్రియ మొదలైంది. గంగవ్వను సైతం ఇంటి సభ్యులు నామినేట్ చేయడం ప్రేక్షకులను ఆశ్చర్యానికి లోను చేసింది.

Bigg Boss Telugu 4 Elimination: పాపం గంగవ్వ.. ఫస్ట్ వీక్ నామినేట్ అయ్యింది వీరే...

బిగ్ బాస్ సీజన్ 4 ఆదివారం (సెప్టెంబర్ 6న) ప్రారంభమైన విషయం తెలిసిందే. అప్పుడే బిగ్ బాస్ హౌస్‌లో రచ్చ మొదలైంది. కరాటే కళ్యాణి, జోర్దార్ సుజాతలు రెండో రోజు గొడవపడ్డారు. అప్పుడే ఓదార్చడాలు సైతం మొదలయ్యాయి. తొలిరోజు ఎలాగూ హౌస్‌లో కాలుపెట్టిన రోజు కాగా, రెండో రోజే బిగ్ బాస్ 4 తొలివారం ఎలిమినేషన్ ప్రక్రియ మొదలైంది. గంగవ్వను సైతం ఇంటి సభ్యులు నామినేట్ చేయడం ప్రేక్షకులను ఆశ్చర్యానికి లోను చేసింది. మరోవైపు గంగవ్వ అంటే అప్పుడే భయమెందుకు, మీతో కొట్లాడి గెలిచే మనిషి కాదు కదా అని కామెంట్ చేస్తున్నారు. Jaya Prakash Reddy Death: జయప్రకాష్‌ రెడ్డి అంత్యక్రియలకు తనయుడు దూరం

ఇందులో భాగంగా తొలి వారం.. నామినేట్ చేయాలనుకునే ఇంటి సభ్యుల పేర్లు చెప్పి ముఖంమీదే తలుపులు వేయాలని సూచించారు. బిగ్ బాస్ ముందుగానే ఇచ్చిన గిఫ్టుల ద్వారా జంటలు ఏర్పడ్డాయి. అలా ఇద్దరు ఇద్దరు కంటెస్టెంట్లు వెళ్లి నిల్చుంటే ఇంటి సభ్యులు అందులో ఒకరిని ఎలిమినేషన్ కోసం నామినేషన్ చేయడం తొలివారం ఎలిమినేషన్ ప్రక్రియ. Bigg Boss 4: అరియానా గ్లోరి ఫొటోలు

మొదట హీరో అభిజిత్, దేత్తడి హారికలు వెళ్లగా.. ఇంటిసభ్యులు ఏకాభిప్రాయంతో అభిజిత్‌‌ను నామినేట్ చేశారు. సూర్యకిరణ్, యాంకర్ దేవి నాగవల్లి వెళ్లగా.. సూర్యకిరణ్‌ను నామినేట్ చేశారు. అఖిల్ సార్ధక్, కరాటే కళ్యాణి వెళ్లగా.. అఖిల్ సార్ధక్‌ను నామినేషన్‌కు పంపారు. దివి, అమ్మ రాజశేఖర్ వెళ్లగా.. దివిని నామినేట్ చేసి రాజశేఖర్‌ను సేవ్ చేశారు. లాస్య, మెహబూబ్‌లలో యాంకర్ లాస్యను ఇంటి సభ్యులు సేవ్ చేశారు. ఆరో జంటగా మొనాల్ గజ్జర్, జోర్దార్ సుజాత వెళ్లగా.. కరాటే కళ్యాణి ఆవేశంతో ఊగిపోయింది. తనతో జరిగిన గొడవ కారణంగా సుజాతను నామినేట్ అయ్యేలా చేసింది. మొనాల్ సేఫ్ అయింది. సింగర్, నటుడు నోయల్, స్పెషల్ కంటెస్టెంట్ గంగవ్వ వెళ్లగా.. గంగవ్వను నామినేట్ చేయడం గమనార్హం.  Remedies for Knee Pain: మోకాళ్ల నొప్పులు బాధిస్తున్నాయా.. ఇలా చేస్తే సరి

తొలి వారం నామినేట్ అయ్యింది వీరే...
అభిజిత్, సూర్యకిరణ్, అఖిల్ సార్ధక్, దివి, మెహబూబ్, సుజాత, గంగవ్వ   Bigg Boss Telugu Voting: బిగ్ బాస్ ఓటింగ్.. రెండు రకాలుగా ఓట్లు వేయవచ్చు 

తొలి వారం సేవ్ అయ్యింది వీరే...
దేత్తడి హారిక, దేవి నాగవల్లి, కరాటే కళ్యాణి, అమ్మ రాజశేఖర్, యాంకర్ లాస్య, మొనాల్ గజ్జర్, నోయల్  COVID19 రిపోర్టు ఇస్తానని పిలిచి నర్సుపై అఘాయిత్యం 
 Isha Koppikar Photos: ‘చంద్రలేఖ’ నటి గుర్తుందా.. ఇప్పుడెలా ఉందో చూడండి
Anasuya Hot Photos: యాంకర్ అనసూయ లేటెస్ట్ ఫొటోలు

Read More