Home> వినోదం
Advertisement

Sexual Harassment: సెక్స్యువల్ ఫేవర్ చేయాలంటూ నటిపై ఒత్తిడి.. సినీనిర్మాత సోదరుడ్ని అరెస్ట్ చేసిన పోలీసులు

Sexual Harassment: బాలీవుడ్ కు చెందిన ఓ నటిని లైంగిక వేధింపులకు గురి చేసిన కేసులో ఓ వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు ముంబయి పోలీసులు. అయితే ఆ వ్యక్తి బాలీవుడ్ లోని ఓ ప్రముఖ నిర్మాత సోదరుడైన స్వప్నిల్ లోఖండే అని తేలిందని పోలీసులు వెల్లడించారు.

Sexual Harassment: సెక్స్యువల్ ఫేవర్ చేయాలంటూ నటిపై ఒత్తిడి.. సినీనిర్మాత సోదరుడ్ని అరెస్ట్ చేసిన పోలీసులు

Sexual Harassment: బాలీవుడ్ కు చెందిన ఓ నటిని లైంగిక వేధింపులకు గురి చేసిన కేసులో ఓ వ్యక్తిని ముంబయి పోలీసులు అరెస్టు చేశారు. ఆ వ్యక్తి బాలీవుడ్ లోని ప్రముఖ నిర్మాత సోదరుడని పోలీసుల విచారణలో తేలింది.

లైంగిక వేధింపుల నేపథ్యంలో స్వప్నిల్ లోఖండే అనే వ్యక్తిపై IPC సెక్షన్ 354 కింద కేసు నమోదు చేసినట్లు ముంబయిలోని ఆరే పోలీసులు తెలిపారు. స్వప్నిల్ తనతో అనుచితంగా ప్రవర్తించడం సహా తన అనుమతి లేకుండా తాకడం, లైంగికంగా సహాయం చేయాలని కోరినట్లు సదరు నటి ఫిర్యాదులో పేర్కొంది.

ఏం జరిగిందంటే?

నటి ఫిర్యాదు ప్రకారం.. నటనపై ఆసక్తితో ఓ యువతి ముంబయికి వచ్చింది. ఈ క్రమంలో మోడలింగ్ చేస్తూ.. బాలీవుడ్ సినిమాల్లో అవకాశాల కోసం ఎదురుచూస్తూ ఉంది. అయితే ఈ నేపథ్యంలో బాలీవుడ్ కు చెందిన ఓ నిర్మాత సోదరుడు స్వప్నిల్ లోఖండే ఆమెకు పరిచయమయ్యాడు. సినిమాల్లో అవకాశం ఇప్పిస్తానంటూ ఆ యువతిని నమ్మబలికాడు స్వప్నిల్.

ఆ యువతికి సినిమాల్లో అవకాశం ఇప్పిస్తానని చెప్పి.. తనకు లైంగిక సహాయం చేయాలంటూ ఆమెను డిమాండ్ చేశాడు. అనుమతి లేకుండా ఆమె ప్రైవేట్ పార్ట్స్ తాకడం వంటి అనుచిత ప్రవర్తనతో నిరాశ చెందిన ఆ యువతి ముంబయి పోలీసులను ఆశ్రయించింది.

పోలీసులను ఆశ్రయించిన ఆ నటి.. స్వప్నిల్ తనపై లైంగికంగా బలవంతం చేయబోయాడని ఆవేదన వ్యక్తం చేసింది. అందుకు తాను నిరాకరించగా.. స్వప్నిల్ బెదిరింపులకు పాల్పడ్డాడని పోలీసులకు ఆమె విన్నవించుకుంది. దీంతో సెక్షన్ 354 కింద కేసు నమోదు చేసిన పోలీసులు.. నిందితుడ్ని అదుపులోకి తీసుకున్నారు.  

Also Read: Akhanda movie: మహేష్ బాబు థియేటర్లో అఖండ మూవీ చూసిన Balayya Babu, బోయపాటి శ్రీను

Also Read: Evaru Meelo Koteeswarulu: ఎన్టీఆర్ షోలో కోటి రూపాయలు గెలుచుకున్న మహేశ్?  

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Read More