Home> వినోదం
Advertisement

Shreya Muralidhar : కార్డియాక్ అరెస్ట్‌తో యంగ్ యూట్యూబర్ శ్రియా మురళీధర్ మృతి

Shreya Muralidhar passes away : యంగ్ యూట్యూబర్ శ్రియా మురళీధర్ కార్డియాక్ అరెస్ట్‌కు గురి అయి మరణించింది. యూట్యూబ్ ద్వారా ఎంతో గుర్తింపు పొందిన శ్రియా ముర‌ళీధ‌ర్...యాంకర్ ప్రదీప్ రియాలిటీ షో... పెళ్లి చూపులులో కంటెస్టెంట్‌గా పాల్గొంది. శ్రియా మురళీధర్ స్వస్థలం హైదరాబాద్‌లోని లక్డీక‌పూల్‌.

Shreya Muralidhar : కార్డియాక్ అరెస్ట్‌తో యంగ్ యూట్యూబర్ శ్రియా మురళీధర్ మృతి

Famous Young Youtuber Shreya Muralidhar dies of cardiac arrest: ఫేమస్ యంగ్ యూట్యూబర్ శ్రియా మురళీధర్ గుండెపోటుతో మృతి చెందింది. ఇరవై ఏడేళ్ల శ్రియా మురళీధర్ కార్డియాక్ అరెస్ట్‌కు గురి అయి మరణించింది. యూట్యూబ్ ద్వారా ఎంతో గుర్తింపు పొందిన శ్రియా ముర‌ళీధ‌ర్ (Shreya Muralidhar) ...యాంకర్ ప్రదీప్ రియాలిటీ షో... పెళ్లి చూపులులో కంటెస్టెంట్‌గా పాల్గొంది. తర్వాత పలు షార్ట్ ఫిల్మ్స్‌లోనూ ఆమె నటించారు. అలాగే బ్యూటీ అండ్ ద బాస్ సీజన్ 2లో (Beauty and the Boss Season 2) శ్రియా మురళీధర్ ఓ పాత్రలో మెప్పించారు. శ్రియా మురళీధర్ యాంకర్ గా కూడా అలరించారు.

అలాగే ఇన్‌స్టాగ్రామ్ ఇన్‌ఫ్లూయెన్స‌ర్‌ గా ఆమె మెప్పించారు. వాట్ ద ఫన్ (What the fun) యూట్యూబ్ ఛాన‌ల్‌లో కొన్ని షార్ట్ ఫిల్మ్స్ చేశారు. శ్రియా మురళీధర్ స్వస్థలం హైదరాబాద్‌లోని లక్డీక‌పూల్‌. యూట్యూబ్‌లో (YouTube) పలు షార్ట్ ఫిలింలలో నటించి తక్కువ కాలంలో మంచి పేరు తెచ్చుకున్నారు శ్రియా మురళీధర్. 

 

Also Read : Magical Rs.1 Note: గంటలో లక్షాధికారిని చేసే 1 రూపాయి నోటు.. దీని ఖరీదు రూ.7 లక్షలు

శ్రియా మురళీధర్ ఆకస్మికంగా మరణం (Shreya Muralidhar passes away) అందరినీ కలచివేసింది. పలువురు సినీ ఇండస్ట్రీ ఆమె మృతిపై విచారం వ్యక్తం చేశారు. ఆమె కుంటుంబానికి సంతాపం తెలిపారు. శ్రియా మురళీధర్ మృతితో (Shreya Muralidhar death) ఆమె కుటుంబసభ్యులు, స్నేహితులు తల్లడిల్లిపోయారు.

Also Read : Rs 500 note with green strip: రూ. 500 నోటుపై ఇలా ఉంటే అది Fake note అవుతుందా ?

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Read More