Home> వినోదం
Advertisement

F3 Movie OTT & Collections: F3 సినిమా భారీగా కలెక్షన్లు, ఓటీటీలో విడుదల ఎప్పుుడంటే..?

 F3 Movie OTT release & Collections: విక్టరీ వెంకటేశ్, వరుణ్ తేజ్ నటించిన ఎఫ్ 3 నవ్వులు పూయిస్తోంది. డబుల్ కాదు..త్రిపుల్ బ్లాక్‌బస్టర్‌గా నిలిచింది. భారీ వసూళ్లతో దూసుకుపోతోంది. మరో పదిరోజుల్లో ఓటీటీలో విడుదల కానుంది. 

 F3 Movie OTT & Collections: F3 సినిమా భారీగా కలెక్షన్లు, ఓటీటీలో విడుదల ఎప్పుుడంటే..?

 F3 Movie OTT Release & Collections:: విక్టరీ వెంకటేశ్, వరుణ్ తేజ్ నటించిన ఎఫ్ 3 నవ్వులు పూయిస్తోంది. డబుల్ కాదు..త్రిపుల్ బ్లాక్‌బస్టర్‌గా నిలిచింది. భారీ వసూళ్లతో దూసుకుపోతోంది. మరో పదిరోజుల్లో ఓటీటీలో విడుదల కానుంది. 

టాలీవుడ్‌లో ఇటీవల విడుదలైన చిత్రాల్లో తక్కువ బడ్జెట్‌తో భారీ వసూళ్లు చేస్తున్న సినిమాగా ఎఫ్ 3 నిలబడుతోంది. విడుదలై 40 రోజులవుతున్నా ఇంకా వసూళ్లలో దూసుకెళ్తోంది. ఎఫ్ 2 ని మించిన కామెడీతో సినిమా నవ్వులు పూయిస్తోంది. మే 27న ధియేటర్లలో విడుదలైన ఈ సినిమా..వంద కోట్ల క్లబ్ ఎప్పుడో దాటేసింది. 

అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాలో విక్టరీ వెంకటేశ్, వరుణ్ తేజ్‌తో పాటు తమన్నా, మెహ్రీన్, సోనాల్ చౌహాన్ నటించారు. రాజేంద్రప్రసాద్, మురళీ శర్మ, అలీ, సునీల్‌లు ఇతర పాత్రల్లో కన్పిస్తారు. వరుణ్, వెంకటేశ్‌ల కామెడీకు ప్రేక్షకులు పగలబడి నవ్వుతున్నారు. రెండు తెలుగు రాష్ట్రాల్లోని కొన్ని థియేటర్లలో ఇప్పటికీ హౌస్‌ఫుల్‌గా నడుస్తోంది. దిల్‌రాజు, శిరీష్ నిర్మించిన ఈ చిత్రం భారీగా వసూళ్లు రాబడుతోంది. ప్రపంచవ్యాప్తంగా ఇప్పటికే 134 కోట్ల గ్రాస్ కలెక్షన్లు, 70.94 కోట్ల షేర్ వసూలు చేసింది. 

ఎఫ్ 3 సినిమా ఓటీటీ హక్కుల్ని ఇప్పటికే సోనీ లివ్ సొంతం చేసుకుంది. నిర్మాతల నిర్ణయం ప్రకారం విడుదలైన 50 రోజుల తరువాత ఓటీటీ స్ట్రీమింగ్ ఉంటుంది. అంటే మరో పదిరోజుల తరువాత సోనీలివ్‌లో ఎఫ్ 3 సినిమా స్ట్రీమింగ్ కానుంది. నైజాం ప్రాంతంలో 20.57 కోట్లు, సీడెట్ ఏరియాలో 8.58 కోట్లు, తూర్పు గోదావరిలో 4.18 కోట్లు, పశ్చిమలో 3.14 కోట్లు, ఉత్తరాంధ్రలో 7.48 కోట్లు, గుంటూరులో 4.18 కోట్లు, కృష్ణాలో 3.23 కోట్లు, నెల్లూరులో 2.31 కోట్లు వసూలు చేసింది. 

Also read: Chiranjeevi Name: ఆచార్య ఎఫెక్ట్ తో పేరు మార్చుకున్న చిరంజీవి.. అదృష్టం కోసమేనా.. అసలు నిజమేంటి?

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి

Android Link https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి. Twitter , Facebook

Read More