Home> వినోదం
Advertisement

Allu Arjun Pushpa : 'పుష్ప' తెలుగులో ఫ్లాప్.. కుండ బద్దలు కొట్టేసిన డైరెక్టర్ తేజ

Director Teja About Allu Arjun Pushpa Movie డైరెక్టర్ తేజ ఎంత ముక్కుసూటిగా మాట్లాడుతుంటాడో అందరికీ తెలిసిందే. తాజాగా తేజ..తన అహింసా సినిమా ప‌్రమోషన్స్‌లో భాగంగా పుష్ప సినిమా గురించి మాట్లాడాడు. పుష్ప సినిమా తెలుగులో అంతగా రికవరీ చేయలేదని అన్నాడు. హిందీ ఆడియెన్స్‌కు నచ్చిందని, అక్కడ బాగా ఆడిందని ఇక్కడ కూడా హిట్ అని అంటున్నారట.
 

Allu Arjun Pushpa : 'పుష్ప' తెలుగులో ఫ్లాప్.. కుండ బద్దలు కొట్టేసిన  డైరెక్టర్ తేజ

Director Teja-Allu Arjun Pushpa : అల్లు అర్జున్ హీరోగా సుకుమార్ దర్శకత్వంలో వచ్చిన పుష్ప చిత్రం క్రేజ్ ప్రపంచవ్యాప్తంగా పాతుకుపోయింది. పుష్ప రాజ్ పాత్రలో బన్నీ నటనకు అందరూ ఫిదా అయ్యారు. మరీ ముఖ్యంగా నార్త్ ఆడియెన్స్ మాత్రం బన్నీ మ్యానరిజాన్ని ఫాలో అయ్యారు. అల్లు అర్జున్ యాక్టింగ్‌కు అంతా ఆశ్చర్యపోయారు. బన్నీని నెత్తిన పెట్టేసుకున్నారు.  బన్నీ ఈ సినిమాతో అక్కడ జెండా పాతినట్టు అయింది. వంద కోట్లు కొల్లగొట్టి అక్కడి స్టార్ హీరోలకు వణుకు పుట్టించేశాడు.

అయితే పుష్ప చిత్రం విడుదలకు ముందు చాలా రకాల కథనాలు వచ్చాయి. హిందీలో బన్నీ సినిమాను కొనేందుకు ఎవ్వరూ ముందుకు రావడం లేదని, బిజినెస్ జరగడం లేదని, హిందీలో రిలీజ్ చేయకపోవచ్చు అంటూ ఇలా గాసిప్స్ వచ్చాయి. మధ్యలో హిందీ పోస్టర్లను తీసేయడం, ఓ పాటను హిందీలోనూ రిలీజ్ చేయలేదు. అయితే ఇలాంటి రూమర్ల మధ్యలో రిలీజ్ అయిన సినిమా చివరి వరకు నిలబడి వంద కోట్లు రాబట్టేసింది. హిందీలో మొదటి రోజు మూడు నుంచి ఐదు కోట్ల మధ్యలో కలెక్ట్ చేసినట్టుంది.

అయితే పుష్పకు తెలుగులో మొదటి రోజు దారుణమైన నెగెటివ్ టాక్ వచ్చింది. అయితే రాను రాను సినిమాకు కలెక్షన్లు నిలకడగా రావడం మొదలెట్టాయి. అయితే ట్రేడ్ వర్గాల లెక్కల ప్రకారం తెలుగు రాష్ట్రాల్లో పుష్ప అంతగా లాభాల పంటను పండించలేదని తెలుస్తోంది. ఆంధ్రలోని కొన్ని ఏరియాల్లో డిస్ట్రిబ్యూటర్లు నష్టపోయారనే టాక్ కూడా వచ్చింది.

ఎక్కువ రేట్లకు అమ్ముడుపోవడం, టికెట్ రేట్ల కాంట్రవర్సీ, ఏపీలో తక్కువ రేట్లు ఉండటంతో కొన్ని ఏరియాల్లో లాస్ వచ్చిందనే టాక్ వచ్చింది. నిర్మాతలు సైతం కొంత మొత్తాన్ని సెటిల్ చేసినట్టు సమాచారం బయటకు వచ్చింది. అలా పుష్ప తెలుగులో అంతగా ఆడలేదని అంతా అన్నారు.

అదే విషయాన్ని ఇప్పుడు డైరెక్టర్ తేజ అన్నాడు. అసలే తేజ ముక్కుసూటిగా నిజాన్ని నిక్కచ్చిగా చెబుతుంటాడు. అలాంటి తేజ.. పుష్ప సినిమా గురించి ఇలా మాట్లాడటంతో హాట్ టాపిక్ అవుతోంది. నార్త్‌లో బాగా ఆడేసరికి ఇక్కడ ఇండస్ట్రీ కూడా హిట్ అని చెప్పుకుంటోంది.. కానీ కొన్ని ఏరియాల్లో మాత్రం నష్టాలు వచ్చాయని చెప్పుకొచ్చాడు. మల్టీప్లెక్సుల్లోని దోపిడీ, తిను బండారాల రేట్ల మీద కూడా తేజ అసహనం వ్యక్తం చేశాడు. వాటి వల్లే జనాలు థియేటర్లకు రావడం లేదని అన్నాడు. 

ఏది ఎలా ఉన్నా కూడా పుష్ప చిత్రం మాత్రం ఇంటర్నేషనల్ వైడ్‌గా ఫేమస్ అయింది. చివరకు క్రికెట్, ఫుట్ బాల్ సెలెబ్రిటీలు సైతం పుష్ప రాజ్, శ్రీవల్లి స్టెప్పులను వేసేశారు. బన్నీలా మారిపోయి స్టెప్పులు వేసేశారు. చిన్నా పెద్దా అనే తేడా లేకుండా అందరూ తగ్గేదేలే అని అంటున్నారు. పుష్ప పార్ట్ 2 గురించి అంతా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. వచ్చే ఏడాది పుష్ప ది రైజ్ చిత్రం థియేటర్లోకి వచ్చే అవకాశం ఉంది.

Also Read : ఆవారా జిందగీ అంటోన్న బిగ్ బాస్ శ్రీహాన్

Also Read : Adipurush First Look : రాముడికి మీసాలు గడ్డాలు ఉంటాయా?.. వీడియో వైరల్

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

Android Link - https://bit.ly/3P3R74U

Apple Link - https://apple.co/3loQYe 

Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

Read More