Home> వినోదం
Advertisement

Rohit Shetty Injured: ప్రమాదంలో స్టార్ డైరెక్టర్‌కు గాయాలు.. హుటాహుటిన హాస్పిటల్ కి !

Director Rohit Shetty Injured బాలీవుడ్ లో అనేక సూపర్ హిట్ సినిమాలు తెరకెక్కించిన డైరెక్టర్ రోహిత్ శెట్టి హైదరాబాద్ లో జరిగిన షూటింగ్ లో గాయపడ్డారు. అందుకు సంబంధించిన వివరాల్లోకి వెళితే

Rohit Shetty Injured: ప్రమాదంలో స్టార్ డైరెక్టర్‌కు గాయాలు.. హుటాహుటిన హాస్పిటల్ కి !

Director Rohit Shetty Injured at Indian Police Force web series Shooting: బాలీవుడ్ లో అనేక సూపర్ హిట్ సినిమాలు తెరకెక్కించిన డైరెక్టర్ రోహిత్ శెట్టి ప్రమాదానికి గురయ్యారు. ప్రస్తుతం ఆయన డైరెక్టర్ గా తెరకెక్కుతున్న ఒక వెబ్ సిరీస్ షూటింగ్ హైదరాబాద్ లో జరుగుతోంది. హైదరాబాద్ శివారులోని రామోజీ ఫిలిం సిటీలో ఆయన ఇండియన్ పోలీస్ ఫోర్స్ పేరుతో ఒక వెబ్ సిరీస్ తెరకెక్కిస్తున్నారు.

అమెజాన్ ప్రైమ్ వీడియోలో ప్రసారం కాబోతున్న ఈ వెబ్ సిరీస్ లో సిద్ధార్థ్ మల్హోత్రా ఎస్పీ కబీర్ మాలిక్ పాత్రలో నటిస్తుండగా శిల్పా శెట్టి ఒక కీలక పాత్రలో నటిస్తోంది. అలాగే వివేక్ ఓబెరాయ్ ఈ సిరీస్ లో కీలక పాత్రలో నటిస్తున్నారు. ఇషా తల్వార్, విభూతి తల్వార్, నికితిన్ ధీర్, శ్వేతా తివారి ప్రధాన పాత్రల్లో నటిస్తున్న ఈ వెబ్ సిరీస్ షూటింగ్ నిమిత్తం ఆయన హైదరాబాద్ లో ఉన్నారు. ఈ వెబ్ సిరీస్ మీటింగ్ రామోజీ ఫిలిం సిటీలో షూటింగ్ జరుపుతున్నారు.

ఒక చేజింగ్ సీన్ షూటింగ్ చేస్తున్న సమయంలో ఆయన గాయపడినట్లు తెలుస్తోంది. దీంతో వెంటనే రోహిత్ శెట్టిని ఎల్బీనగర్లోని కామినేని హాస్పిటల్ కి తరలించి చికిత్స అందిస్తున్నారని యూనిట్ సభ్యులు చెబుతున్నారు. బాలీవుడ్లో రోహిత్ శెట్టి యాక్షన్ డైరెక్టర్ గా మంచి పేరుంది.

జమీన్ అనే సినిమాతో దర్శకుడిగా పరిచయమైన ఆయన తర్వాత గోల్మాల్, గోల్మాల్ రిటన్స్, గోల్మాల్ 3, చెన్నై ఎక్స్ప్రెస్, సింగం, సింగం రిటర్న్స్, దిల్వాలే, గోల్మాల్ అగైన్, సింబా, సూర్యవంశీ వంటి కొన్ని సినిమాలతో ప్రేక్షకులను అలరించారు. ఇటీవల ఆయన దర్శకత్వం వహించిన సర్కస్ అనే సినిమా విడుదలైంది. ఈ సినిమాలో రణవీర్ సింగ్, వరుణ్ శర్మ, పూజా హెగ్డే వంటి వారు కీలక పాత్రల్లో నటించారు. అయితే ఆయన ఆరోగ్య పరిస్థితి ఎలా ఉందనే విషయం మీద పూర్తి సమాచారం అందాల్సి ఉంది.

Also Read: Anjushree Parvathi death: బిర్యానీ తిని కేరళ యువతి మృతి.. ఐదు రోజుల్లో రెండో మరణం?

Also Read: Rishabh Pant's knee surgery: రిషబ్ పంత్ కాలికి శస్త్ర చికిత్స.. గుడ్ న్యూస్ చెప్పిన డాక్టర్లు!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 

ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook

 
Read More