Home> వినోదం
Advertisement

Hari Hara Veera Mallu షూట్ అప్డేట్.. డూప్ రూమర్లకు చెక్ పెట్టిన క్రిష్‌

Hari Hara Veera Mallu Set హరిహర వీరమల్లు సినిమా సెట్లోకి పవన్ కళ్యాణ్ అడుగుపెట్టాడు. అసలు పవన్ కళ్యాణ్ రాజకీయాలతో బిజీగా ఉండటంతో డేట్స్ అడ్జస్ట్ చేయలేకపోతోన్నాడు. దీంతో సినిమాల పరిస్థితి గందరగోళంగా మారింది.

Hari Hara Veera Mallu షూట్ అప్డేట్.. డూప్ రూమర్లకు చెక్ పెట్టిన క్రిష్‌

Pawan Kalyan Still From Hari Hara Veera Mallu : పవన్ కళ్యాణ్ ప్రస్తుతం హరి హర వీరమల్లు సెట్‌లో ఉన్నాడు. గత నాలుగైదు రోజుల క్రితం పవన్ కళ్యాణ్ హరి హర వీరమల్లు మీద కొన్ని రూమర్లు వచ్చాయి. పవన్ కళ్యాణ్ అందుబాటులో లేకపోవడంతో డూప్‌తో షూటింగ్ చేస్తున్నారంటూ గాసిప్స్ వచ్చాయి. దీనిపై క్రిష్ పరోక్షంగా కౌంటర్లు వేసినట్టు కనిపిస్తోంది. తాజాగా క్రిష్ ఓ స్టిల్ షేర్ చేశాడు. హరి హర వీరమల్లు సినిమా సెట్‌లోంచి ఆ ఫోటోను తీసినట్టు తెలుస్తోంది.

సినిమా షూటింగ్‌కు ప్యాకప్ చెప్పాక అంటూ ఓ ఫోటోను షేర్ చేశాడు. అందులో పవన్ కళ్యాణ్‌ మొహాన్ని అయితే చూపించలేదు. కానీ పవన్ కళ్యాణ్ మార్క్ స్టైల్లో ఎర్ర తుండు గుడ్డ, చాయ్ గ్లాస్ ఆ పోస్టర్లో కనిపించింది. మొత్తానికి హరి హర వీరమల్లు సినిమా షూటింగ్ ప్రస్తుతం ఫుల్ స్వింగులో ఉందని అభిమానులు సంబరపడుతున్నారు.

 

ఆలస్యం అయినా పర్లేదు గానీ మంచి సినిమా తీయ్ అంటూ క్రిష్‌కు పవర్ స్టార్ అభిమానులు సూచనలు సలహాలు ఇస్తున్నారు. అంతే కాకుండా పవన్ కళ్యాణ్ బియర్డ్ లుక్ కూడా పెడుతుండటంతో అభిమానులు సంబరపడిపోతోన్నారు. వర్క్ షాప్‌ సమయంలో పవన్ కళ్యాణ్ అలా సింపుల్‌గా కూర్చుని ఉండటం, అందులో లైట్‌గా బియర్డ్ లుక్‌లో కనిపించడంతో అందరూ ఆ లుక్‌ను ఫిక్స్ అయ్యారు.

దీంతో అదే లుక్‌ను కూడా సినిమాలో పెట్టినట్టు తెలుస్తోంది. దీంతో క్రిష్ మీద పవన్ కళ్యాణ్‌ అభిమానులు సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు. అయితే పవన్ కళ్యాణ్ సినిమాల పరిస్థితి మాత్రం ఎటూ తేలకుండాపోతోంది. హరి హర వీరమల్లు సినిమానే ఎన్నో రోజుల నుంచి నానుతూ వస్తోంది. ఒక అడుగు ముందుకు వేస్తే..పది అడుగులు వెనక్కి వచ్చినట్టు అవుతోంది. హరిష్ శంకర్ సినిమా అయితే జాడే లేకుండాపోయింది. అసలు పవన్ కళ్యాణ్‌ తన సినిమాలను పూర్తి చేస్తాడా? లేదా? అన్నది కూడా అనుమానంగానే ఉంది.

Also Read : Avatar 2 New Trailer : మీరు కూడా ఇలా తయారయ్యారేంట్రా?.. అవతార్ ట్రైలర్ ఆలస్యంపై ట్రోల్స్  

Also Read : Baladitya Vs Geetu : ఆదిరెడ్డి చెబుతున్నా వినడం లేదు.. గీతూ మొండిపట్టు.. అల్లాడిపోయిన బాలాదిత్య

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

Android Link https://bit.ly/3P3R74U

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter , Facebook

Read More