Home> వినోదం
Advertisement

Director Bobby : అయ్యో పాపం బాబీ.. హగ్గివ్వకుండా హ్యాండిచ్చిన కేథరిన్

Catherine in Waltair Veerayya event నిన్న జరిగిన వాల్తేరు వీరయ్య ఈవెంట్‌లో కొన్ని చిత్రమైన సంఘటనలు జరిగాయి. వాల్తేరు వీరయ్య ఈవెంట్‌కు వచ్చిన కేథరిన్‌కు అనుకోకుండా బాబీకి షాక్ ఇచ్చింది. అందరి ముందు తలదించుకునేలా చేసింది.

Director Bobby : అయ్యో పాపం బాబీ.. హగ్గివ్వకుండా హ్యాండిచ్చిన కేథరిన్

Catherine Not Given Hugs To Director Bobby సినిమా ఫంక్షన్‌లలో కొన్ని సార్లు వింత ఘటనలు జరుగుతుంటాయి. హీరో హీరోయిన్లు సైగలు, చాటు మాటు ముచ్చట్లు, హీరోల పేర్లను హీరోయిన్లు మరిచిపోవడం, హీరోయిన్ల పేరుని చెప్పడం హీరోలు మరిచిపోవడం, దర్శకుల గురించి విస్మరించడం ఇలా ఎన్నెన్నో ఘటనలు జరుగుతుంటాయి. ఆ కంగారు, హడావిడిలో అలాంటి పొరపాట్లు జరుగుతుంటాయి. అయితే తాజాగా ఇలాంటి ఓ వింత ఘటన దర్శకుడు బాబీకి ఎదురైంది.

వాల్తేరు వీరయ్య ఈవెంట్‌ విశాఖలో గ్రాండ్‌గా జరిగింది. ఈ ఈవెంట్‌కు హీరోయిన్ అయిన శ్రుతి హాసన్ రాలేదు.కానీ అందరి చూపు కేథరిన్, ఊర్వశీ రౌటేలా మీద పడింది. ఈ ఇద్దరూ వాల్తేరు వీరయ్య సినిమాలో నటించారు. కేథరిన్ ఓ మంచి పాత్రలో కనిపిస్తే.. ఊర్వశీ బాస్ పార్టీ సాంగ్‌లో స్పెషల్‌గా స్టెప్పులు వేసింది. అయితే వాల్తేరు వీరయ్య ఈవెంట్‌లో మాత్రం కేథరిన్ ఇచ్చిన షాక్‌కు బాబీ సర్ ప్రైజ్ అయినట్టు కనిపిస్తోంది.

ఈవెంట్‌లోకి వచ్చిన కేథరిన్.. చిరంజీవికి, రవితేజకు హగ్ ఇచ్చింది. రవితేజ పక్కనే బాబీ కూర్చున్నాడు. ఇక చిరంజీవి, రవితేజకు హగ్ ఇచ్చిన కేథరిన్ నెక్ట్స్ తనకే ఇస్తుందని అనుకున్నట్టున్నాడు. రవితేజకు హగ్ ఇచ్చిన తరువాత బాబీ లేచి నిల్చున్నాడు. కానీ కేథరిన్ మాత్రం బాబీని చూడలేదు. అస్సలు పట్టించుకోలేదు. దీంతో బాబీ సైలెంట్ అయిపోయాడు. ఇప్పుడు దీనికి సంబంధించిన మీమ్స్, ట్రోల్స్ నెట్టింట్లో వైరల్ అవుతున్నాయి.

 

బాబీ బాధపడినట్టున్నాడు.. ఎవ్వరూ చూడలేదు కదా? సరిపోయింది.. లేదంటే పరువు పోయేది అని అనుకుంటున్నాడంటూ ఇలా నానా రకాలుగా ట్రోల్స్ చేశారు. ప్రస్తుతం ఈ మీమ్, రీల్ వీడియోలు నెట్టింట్లో తెగ ట్రెండ్ అవుతున్నాయి. వాల్తేరు వీరయ్య సంక్రాంతి బరిలోకి దిగబోతోంది. జనవరి 13న పూనకాలు లోడింగ్ అంటూ బాబీ చాలా కాన్ఫిడెంట్‌గా చెబుతూనే ఉన్నాడు. మరి రిజల్ట్ ఎలా ఉంటుందో చూడాలి.

Also Read: Keerthy Suresh Bikini : బికినీలో కీర్తి సురేష్‌.. మహానటిని ఇలా ఎప్పుడూ చూసి ఉండరు.. హీటెక్కించే పిక్స్

Also Read: Shaakuntalam Trailer.. శాకుంతలం ట్రైలర్.. మెస్మరైజ్ చేసిన సమంత.. అల్లు అర్హ ఎంట్రీ అదుర్స్

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 

ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 

TwitterFacebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

Read More