Home> వినోదం
Advertisement

Dil Raju: ‘ధీర’ హక్కులను సొంతం చేసుకున్న దిల్ రాజు.. సినిమాపై పెరిగిన అంచనాలు

Laksh Chadalawada: దిల్ రాజు ఏదన్నా సినిమాని డిస్ట్రిబ్యూట్ చేస్తున్నాడు అని అన్న లేదా నిర్మాణం వహిస్తున్నారన్న అని తెలిస్తే చాలు ఆ చిత్రంపై ప్రేక్షకులకు తప్పకుండా అంచనాలు భారీగా పెరుగుతాయి. ఎందుకంటే దిల్ రాజు స్టోరీస్ సెలక్షన్ ఎప్పుడూ లెక్కలు తప్పవు అనేది ప్రేక్షకుల నమ్మకం…

Dil Raju: ‘ధీర’ హక్కులను సొంతం చేసుకున్న దిల్ రాజు.. సినిమాపై పెరిగిన అంచనాలు

Dheera: దిల్ రాజు ఏదన్నా సినిమాని డిస్ట్రిబ్యూట్ చేయడానికి ఒప్పుకున్నారు అంటే ఆ చిత్రం కథ తప్పకుండా మినిమం గ్యారంటీ అయి ఉంటుంది. ఈ విషయం పైన ప్రేక్షకులకు కూడా ఎక్కువ నమ్మకం ఉన్నందువలనే దిల్ రాజు డిస్ట్రిబ్యూట్ చేసే సినిమాలపై అంచనాలు ఏర్పడుతూ ఉంటాయి. ఇప్పుడు ఇదే జాబితాలో చేరింది ధీరా సినిమా.

దిల్ రాజు చేయి పడితే ఆ ప్రాజెక్ట్ స్థాయి మారిపోతోంది. ఓ సినిమాను అంచనా వేయడంలో ఆయన శైలి ప్రత్యేకం. అలాంటి దిల్ రాజు ప్రస్తుతం కథను నమ్మి హక్కులను సొంతం చేసుకున్న చిత్రం లక్ష్ చదలవాడ హీరోగా చేస్తున్న ధీర. నైజాం, వైజాగ్ హక్కుల్ని దిల్ రాజు తీసుకున్నారు. దీంతో  ఈ చిత్రంపై అంచనాలు భారీగా పెరిగాయి.

లక్ష్ చదలవాడ ‘ధీర’ అంటూ ఓ మంచి కమర్షియల్ సబ్జెక్టుతో రాబోతున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే ఈ చిత్రం నుంచి వచ్చిన పోస్టర్లు, టీజర్లు ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. వలయం, గ్యాంగ్‌స్టర్ గంగరాజు వంటి హిట్ సినిమాల తరువాత లక్ష్ చదలవాడ మరోసారి మాస్ ప్రేక్షకుల్ని మెప్పించేందుకు సిద్దమయ్యారు. ఈ సినిమాని చదలవాడ బ్రదర్స్ సమర్పణలో శ్రీ తిరుమల తిరుపతి వెంకటేశ్వర బ్యానర్‌ మీద పద్మావతి చదలవాడ నిర్మించారు.  విక్రాంత్ శ్రీనివాస్ వహిస్తున్న ఈ సినిమా ఇప్పుడు దిల్ రాజు చేతిలోకి వెళ్ళింది.

ఇప్పటికే ఈ చిత్రం సెన్సార్ కార్యక్రమాలు కూడా పూర్తయ్యాయి. ఇక దిల్ రాజు బ్రాండ్ మీద ఈ సినిమా ఫిబ్రవరి 2న గ్రాండ్‌గా విడుదల కానుంది. దీంతో ఆడియెన్స్‌లోనూ ధీర మీద మరింత ఆసక్తి పెరిగింది.

ఈ సినిమాలో లక్ష చదలవాడ తో పాటు నేహా పఠాన్, సోనియా బన్సాల్, మిర్చి కిరణ్, హిమజ, నవీన్ నేని, భరణి శంకర్, సామ్రాట్, బాబీ బేడి, వైవా రాఘవ్, భూషణ్, మేక రామకృష్ణ, సంధ్యారాణి తదితరులు నటిస్తున్నారు. ఇక సాంకేతిక బృందం విషయానికి వస్తే చదలవాదా బ్రదర్ సమర్పణలు శ్రీ తిరుమల తిరుపతి వెంకటేశ్వర బ్యానర్ పై పద్మావతి చదలవాడ నిర్మిస్తున్న ఈ సినిమాకి సాయి కార్తీక్ సంగీతం అందిస్తుండగా కన్నా తీసి సినిమాటోగ్రఫీ బాధ్యతలు తీసుకున్నారు. ఫైట్ మాస్టర్స్ గా జాషువ, వింగ్ చున్ అంజి, ఎడిటర్ గా వినయ్ రామస్వామి వ్యవహరిస్తున్నారు.

Also Read: India Vs Eng: ఉప్పల్‌లో భారత జట్టుకు తీవ్ర నిరాశ.. టామ్ హార్ట్‌లేకు హార్ట్‌ లేదబ్బా

Also Read: Bottole Thrash: 'బాటిల్‌' కోసం చెప్పుతో కొట్టిన ప్రముఖ గాయకుడు.. నెట్టింట్లో తీవ్ర దుమారం

 

 

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

 Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

Read More