Home> వినోదం
Advertisement

Dhanush SIR Collection : ధనుష్ 'సార్' వసూళ్ల వర్షం.. బ్రేక్ ఈవెన్‌కు అతి దగ్గర్లో

Dhanush SIR Movie Day 2 Collection ధనుష్‌ సినిమాలకు తెలుగులో మంచి డిమాండ్ ఉంటుంది. తమిళ డబ్బింగ్ సినిమాలతోనే ధనుష్‌ ఇక్కడ మార్కెట్ ఏర్పర్చుకున్నాడు. కానీ ఇప్పుడు సార్ సినిమాతో ఏకంగా తెలుగులోకి వచ్చేశాడు ధనుష్‌.

Dhanush SIR Collection : ధనుష్ 'సార్' వసూళ్ల వర్షం.. బ్రేక్ ఈవెన్‌కు అతి దగ్గర్లో

Dhanush SIR Movie Day 2 Collection ధనుష్ సార్ సినిమాకు ఫుల్ పాజిటివ్ రివ్యూలు వచ్చాయి. మౌత్ టాక్ కూడా బాగానే కుదిరింది. దీంతో మొదటి రోజు కంటే రెండో కలెక్షన్లు ఎక్కువగా వచ్చేశాయి. కోలీవుడ్‌, టాలీవుడ్‌లోనూ ఈ చిత్రం మంచి వసూళ్లను రాబట్టేస్తోంది. ధనుష్ ఇమేజ్‌కు పూర్తి భిన్నమైన ఈ సినిమా అంతటా మంచి టాక్‌తో దూసుకుపోతోంది. ఐదు కోట్ల వరకు గ్రాస్ సాధించి అందరినీ ఆశ్చర్యపరిచింది. రెండో రోజు అంతకంటే ఎక్కువగా కలెక్షన్లను సాధించేసిందని తెలుస్తోంది.

మొదటి రోజు రెండు తెలుగు రాష్ట్రాల్లో ఈ సినిమా దాదాపు 2.65 కోట్ల షేర్ రాబట్టింది. రెండో రోజు 3.15 కోట్ల షేర్ రాబట్టింది. అలా రెండు రోజుల్లోనే ఈ సినిమా 5.80 కోట్ల షేర్ రాబట్టినట్టు సమాచారం అందుతోంది. 10.54కోట్ల గ్రాస్‌తో ధనుష్‌ సార్ సినిమా రెండో రోజుల్లో దుమ్ములేపేసింది. అసలు ఈ సినిమాకు జరిగిన బిజినెస్‌కు వస్తోన్న కలెక్షన్లకు ఎక్కడా కూడా పొంతన లేదు.

ఈ సినిమా పన్నెండు కోట్ల గ్రాస్, ఆరు కోట్ల షేర్ రాబడితే బ్రేక్ ఈవెన్ అవుతుందని సమాచారం. అయితే ఇప్పటికే 5.80 కోట్ల షేర్ వచ్చినట్టు తెలుస్తోంది. అంటే రేపటితో ఈ సినిమా ప్రాఫిట్ జోన్‌లోకి వచ్చేస్తుందన్న మాట. ఇప్పుడు ధనుష్ సార్ సినిమా మాత్రం ఈ వారంలో ఇంత ఫాస్ట్‌గా బ్రేక్‌ ఈవెన్ మార్క్‌ను రాబట్టినట్టు అవుతుంది.

ఈ వారం పెద్ద సినిమాలేవీ రిలీజ్ కాకపోవడంతో ధనుష్ సార్‌కు తిరుగులేకుండా పోయింది. కిరణ్‌ అబ్బవరం చేసిన వినరో భాగ్యము విష్ణుకథ పర్వాలేదనిపిస్తుంది. అయితే ఈ రెండింటికి పోలిక పెట్టాల్సిన అవసరం లేదు. ఎవరికి తెగాల్సిన టికెట్లు వారికి తెగుతున్నట్టుగా కనిపిస్తోంది. అలా ఈ ఫస్ట్ వీకెండ్‌లోనే ధనుష్ సార్, కిరణ్ అబ్బవరం కూడా గట్టెక్కేలానే కనిపిస్తోంది.

అటు కోలీవుడ్‌లోనూ ధనుష్ సినిమా దుమ్ములేపేస్తోందని టాక్. భారీ ఓపెనింగ్స్ రాకపోయినా కూడా మౌత్ టాక్‌తో అదరగొట్టేస్తోందట. అక్కడ దాదాపు ముప్పై ఐదు కోట్ల షేర్ రాబడితేనే హిట్ సినిమాగా లెక్కేసే చాన్స్ ఉంది.

Also Read:  Taraka Ratna Death Live Updates: 'మోకిల' నివాసానికి చేరుకున్న తారకరత్న భౌతికకాయం..భోరున విలపిస్తున్న నందమూరి కుటుంబం

Also Read: Taraka Ratna Siva Devotee: శివుని భక్తునిగా నటించి శివరాత్రి రోజే శివైక్యం.. శివుని ఆన లేనిదే చీమైనా కుట్టునా!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 

ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitterFacebook

Read More