Home> వినోదం
Advertisement

శానిటరీ ప్యాడ్ ఛాలెంజ్ స్వీకరించిన సినీ ప్రముఖులు..!

అక్షయ్‌కుమార్, రాధికా ఆప్టే, సోనమ్‌ కపూర్‌ ముఖ్య తారాగణంగా ఆర్‌.బాల్కీ దర్శకత్వంలో వస్తున్న చిత్రమే ‘ప్యాడ్‌మ్యాన్‌’.

శానిటరీ ప్యాడ్ ఛాలెంజ్ స్వీకరించిన సినీ ప్రముఖులు..!

అక్షయ్‌కుమార్, రాధికా ఆప్టే, సోనమ్‌ కపూర్‌ ముఖ్య తారాగణంగా ఆర్‌.బాల్కీ దర్శకత్వంలో వస్తున్న చిత్రమే ‘ప్యాడ్‌మ్యాన్‌’. తక్కువ ధరలో శానిటరీ ప్యాడ్‌లను తయారు చేసి,  తన ఊరి మహిళలకు అందించిన వ్యక్తి అరుణాచలమ్‌ మురుగనాథమ్‌ జీవితం ఆధారంగా ఈ చిత్రాన్ని రూపొందించారు. ఫిబ్రవ‌రి 9న విడుదల అవుతున్న ఈ సినిమాకి సంబంధించిన ప్రచార కార్యక్రమాలు జోరుగా సాగతున్నాయి.

ఈ క్రమంలో  ప్యాడ్‌మాన్ ఛాలెంజ్ అనే కొత్త ఛాలెంజ్‌తో ముందుకొచ్చారు ఈ చిత్ర నటులు. శానిటరీ ప్యాడ్ చేతిలో పట్టుకొని ఫోటో దిగడమే ఈ ఛాలెంజ్. ఈ ఛాలెంజ్‌లో  తొలుత అక్షయ్ కుమార్ చేతిలో శానిటరీ ప్యాడ్ పట్టుకొని.. ఫోటో దిగి.. దీపికా పదుకొణేకి ఛాలెంజ్ స్వీకరించమని ట్యాగ్ చేయగా.. ఆమె కూడా ఆ ఛాలెంజ్‌ను స్వీకరించి ఫోటో దిగింది.

తర్వాత దీపికా అదే ఛాలెంజ్ స్వీకరించమని బ్యాడ్మింటన్ స్టార్ పివి సింధుని కోరుతూ ట్యాగ్ చేసింది. ప్రస్తుతం అమీర్ ఖాన్, రాజ్ కుమార్ రావు, షబానా ఆజ్మీ, అలియా భట్, అర్జున్ కపూర్ లాంటి ప్రముఖులు కూడా ఈ శానిటరీ ప్యాడ్ ఛాలెంజ్ స్వీకరించడం విశేషం. అయితే ఈ ఛాలెంజ్‌ను ప్రారంభించినందుకు ఈ శానిటర్ ప్యాడ్స్ రూపకర్తైన అరుణాచలమ్ మురుగనాథమ్ కూడా ఆయా సెలబ్రిటీలకు ట్విటర్ ద్వారా ధన్యవాదాలు తెలిపారు.

Read More