Home> వినోదం
Advertisement

Niharika Reddy on Balakrishna: బాలయ్య బాబు కొడతాడు,కోప్పడతాడు, కసురుకుంటాడని ఎవర్రా బాబు చెప్పింది ?

Niharika Reddy on Balakrishna: నందమూరి బాలకృష్ణ గురించి కాస్ట్యూమ్ డిజైనర్ నిహారిక రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు, బాలయ్య బాబు కొడతాడు,కోప్పడతాడు, కసురుకుంటాడని ఎవర్రా బాబు చెప్పింది ?  అంటూ ఆమె ఒక సుదీర్ఘ పోస్ట్ చేశారు. ఆ వివరాలు 
 

Niharika Reddy on Balakrishna: బాలయ్య బాబు కొడతాడు,కోప్పడతాడు, కసురుకుంటాడని ఎవర్రా బాబు చెప్పింది ?

Costume Designer Niharika Reddy on Balakrishna: నందమూరి బాలకృష్ణకు ముక్కు మీద కోపం ఉంటుందని ఆయన అందరినీ కొడుతూ ఉంటారని, కోప్పడుతూ ఉంటారని ఇలా ఒక రకమైన ప్రచారం అయితే ముందు నుంచి జరుగుతూ ఉండేది. అయితే కొంతవరకు అలాంటి ప్రచారాన్ని ఆయన చేస్తున్న అన్ స్టాపబుల్ షో దూరం చేసిందని చెప్పక తప్పదు. అయితే బాలకృష్ణ చాలా ఫ్రెండ్లీ అని ఆయనతో పని చేసిన చాలా మంది చెబుతూ ఉంటారు.

తాజాగా ఇదే విషయాన్ని సినీ పరిశ్రమకు చెందిన కాస్ట్యూమ్ డిజైనర్ వెల్లడించారు. డైరెక్టర్ కమ్ రైటర్ డీఎస్ కన్నన్ భార్య, నిహారిక రెడ్డి అసిస్టెంట్ డైరెక్టర్గా సినీ పరిశ్రమలు అడుగుపెట్టి తర్వాత నటిగా కూడా కొన్ని సినిమాల్లో కనిపించారు. ప్రస్తుతానికి ఒక ఫ్యాషన్ డిజైనర్ గా బోటిక్ నడుపుతూనే సినిమాలకు కాస్ట్యూమ్ డిజైనర్ గా వ్యవహరిస్తున్నారు. ఆమె బాలకృష్ణ హీరోగా నటించిన ఎన్టీఆర్ బయోపిక్ సినిమాకు కాస్ట్యూమ్ డిజైనర్ గా వ్యవహరించాల్సి ఉంది.

తేజ దర్శకత్వంలో ఈ సినిమా అనౌన్స్ చేసినప్పుడు కాస్ట్యూమ్ డిజైనర్ గా నిహారిక పేరు తెర మీదకు వచ్చింది. అయితే తేజ ఆ సినిమా నుంచి తప్పుకోవడంతో నిహారిక కూడా సినిమా నుంచి తప్పుకోవాల్సి వచ్చింది. అయితే తాజాగా తన అనుభవాన్ని నిహారిక సోషల్ మీడియా వేదికగా పంచుకున్నారు. ‘’ఈరోజు పొద్దున్నే మేము బంజారాహిల్స్ నుంచి వస్తూ ఉంటే   మా కారు పక్కనే ఇంకో కార్ నెమ్మదిగా వెళ్తుంది.

విండోస్ ఓపెన్ చేసుకుని, నల్లటి కళ్లద్దాలు పెట్టుకుని, తెల్లని దుస్తుల్లో ,హుషారుగా ,చాలా ప్రశాంతమైన చిరునవ్వుతో ఓ వ్యక్తి డ్రైవర్ పక్క సీట్లో కూర్చుని ఉన్నారు. కొన్ని క్షణాల పాటు నా కళ్ళని నేను నమ్మలేకపోయాను, అచ్చం బాలయ్య గారిలా ఉన్నారే అని! మళ్లీ చూస్తే ఆయనే ! వెంటనే మా కార్ ని ఆయన కార్ పక్కకి పోనిచ్చాము. బాలయ్య బాబే కదా అనుకుంటుంటే అందరము మా పాప అయితే సినిమాల్లో కంటే బయటే చాలా హ్యాండ్సమ్ గా ఉన్నారమ్మా బాలయ్య గారు అంటూ తెగ మురిసిపోయింది.

ఇక ఆరాటం తట్టుకోలేక కార్ లో నుండే హాయ్ సర్ అంటూ పలకరిస్తే, వెంటనే ఆయన విండో నుంచి చెయ్యి బయటకు పెట్టి హాయ్ అంటూ ఒక పెద్ద స్మైల్ ఇచ్చారు చూడండి......వాహ్ !  He made our day అంతే ! మా అందరికీ హాయ్ చెప్తూ వెళ్లారు చిన్నపిల్లాడిలా నవ్వుతూ ! ఆయన్నలా చూసినప్పుడు కలిగిన సంతోషానికి, ఆయన హాయ్ చెప్పినప్పుడు మేము పొందిన ఆనందానికి అక్షర రూపం ఇవ్వడం సాధ్యం కాని పని అంతే ! అలా చూస్తూ ఉండిపోయాము ఎవరికి ఫోటో తీయాలి అని కూడా థాట్ రాలేదు ... ఫోటో మిస్ అయిపోయాము ఫోటో లేకున్నా ఈ రోజుకి ఇదొక గొప్ప సంతృప్తి !  అంతే  చిన్న చిన్న సంతోషాలు అంటూ ఆమె చేసిన పోస్ట్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. 

Also Read: Chalapathi Rao Cried: మిమ్మల్ని మళ్లీ చూస్తామో లేదో అంటూ కన్నీళ్లు పెట్టుకున్న చలపతి

Also Read: Chalapathi Rao: ఆరోజుల్లోనే క్రేజీ లవ్ స్టోరీ.. వారంలో పెళ్లి.. 27 ఏళ్లకే భార్య మృతి

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 

ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook.

 
 
Read More