Home> వినోదం
Advertisement

Hollywood Actors in Mahesh Movie: మహేష్ మూవీలో తొర్.. ఒక రేంజ్ లో ప్లాన్ చేసిన జక్కన్న!

Chris Hemsworth and Samuel L Jackson to be part in Mahesh Babu - Rajamouli Movie : రాజమౌళి- మహేష్ బాబు సినిమాలో హాలీవుడ్ నటులు నటించే అవకాశం ఉందని అంటున్నారు. ఆ వివరాలు

Hollywood Actors in Mahesh Movie: మహేష్ మూవీలో తొర్.. ఒక రేంజ్ లో ప్లాన్ చేసిన జక్కన్న!

Chris Hemsworth and Samuel L Jackson to be part in Mahesh Babu - Rajamouli Movie : ఇటీవల ఆర్ఆర్ఆర్ సినిమాతో హిట్ అందుకున్న రాజమౌళి తన తరువాత సినిమా మహేష్ బాబుతో ఉంటుందని ఇప్పటికే ప్రకటించారు. మహేష్ బాబు ప్రస్తుతం త్రివిక్రమ్ డైరెక్షన్లో సినిమా చేస్తున్నారు. ఆ సినిమా పూర్తయిన తర్వాత రాజమౌళి డైరెక్షన్లో సినిమా ప్రారంభమయ్యే అవకాశం ఉంది. ఈ మధ్య కాలంలో ఒక ఫిలిం ఫెస్టివల్ లో పాల్గొన్న రాజమౌళి ప్రపంచాన్ని చుట్టి వచ్చే ఒక సాహసికుడి కథ అంటూ మహేష్ బాబుతో చేయబోయే సినిమా సబ్జెక్ట్ గురించి ఒక హింట్ ఇచ్చారు.

దీంతో ఈ సినిమా గురించి ఇప్పటికే రకరకాల ప్రచారాలు మొదలయ్యాయి. కేఎల్ నారాయణ అత్యంత భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్న ఈ సినిమాలో పలువురు హాలీవుడ్ నటించిన కూడా భాగమయ్యే అవకాశం ఉందనే ప్రచారం ఊపందుకుంది. ఇప్పటికే రాజమౌళి సినిమాలను హాలీవుడ్ లో కూడా పెద్ద ఎత్తున వీక్షిస్తున్నారు. ఆర్ఆర్ఆర్ సినిమాకు అయితే హాలీవుడ్ నటీనటులు, దర్శకనిర్మాతలు అలాగే పలువురు రచయితల నుంచి అనేక ప్రశంసలు దక్కాయి.

ఈ నేపద్యంలో హాలీవుడ్ రేంజ్ లో మహేష్ బాబు సినిమా ప్లాన్ చేసిన రాజమౌళి పలువురు హాలీవుడ్ నటులను కూడా సినిమాలో భాగమయ్యేలా ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. ఎవెంజర్స్​, స్టార్​ వార్స్​, ఎక్స్​ఎక్స్​ఎక్స్​, జురాసిక్​ పార్క్​, స్పైడర్​ మ్యాన్, కెప్టెన్​ అమెరికా​ వంటి సూపర్ హిట్​ చిత్రాల్లో నటించిన హాలీవుడ్ యాక్టర్ శామ్యూల్​ ఎల్​ జాక్స్​ను (Samuel L Jackson), క్రిస్ హెమ్స్ వర్త్(Chris Hemsworth) తీసుకోబోతున్నట్లు తెలుస్తోంది.

అయితే మాములుగా సాధారణంగా హాలీవుడ్ నటుల రెమ్యూనరేషన్ మనతో పోలిస్తే చాలా అధికంగా ఉంటుంది. అక్కడి వారంతా డాలర్లలో ఫీజు పుచ్చుకుంటారు మన 80 రూపాయల కలిపితే గానీ వారికి ఒక డాలర్ అవ్వదు. ఈ నేపథ్యంలో వాళ్లను మన సినిమాలో భాగం చేయాలంటే భారీగానే ఖర్చు పెట్టాల్సి ఉంటుంది. అయితే రాజమౌళి సినిమా అంటే ఎంత ఖర్చు పెట్టినా ఎలాంటి ఇబ్బంది ఉండదని దానికి ఖర్చుకు మించిన రాబడి కచ్చితంగా వస్తుందని నిర్మాతలు భావిస్తూ ఉంటారు. అయితే ఇది అంతా ప్రచారమే కాగా నిజంగా అసలు ఏం జరగనుంది, ఎవరిని ఈ సినిమాలో భాగం చేస్తున్నారు అనే విషయాలను రాజమౌళి అధికారికంగా ప్రకటిస్తే కానీ సరైన క్లారిటీ వచ్చే అవకాశం కనిపించడం లేదు.
Also Read: Bigg Boss 6 Elimination: షాకిచ్చిన బిగ్ బాస్... ఊహించని కంటెస్టెంట్ ఔట్!

Also Read: Salaar Leaked Scene: సలార్ మేకర్స్ కు మరో టెన్షన్.. సెట్ నుంచి వీడియో లీక్!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

Android Link https://bit.ly/3P3R74U

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Twitter , Facebook

Read More