Home> వినోదం
Advertisement

Chiyaan Vikram: పేరుకి అవార్డుల హీరో.. కానీ నిర్మాతలకు తప్పని కష్టాలు

Vikram Thangalan: చియాన్ విక్రమ్ హీరోగా నటిస్తున్న తంగాలన్ సినిమా ప్యాన్ ఇండియా రేంజ్ లో.. విడుదల కాబోతుంది పని చాలా రోజులుగా చెబుతున్నారు. కానీ సినిమాకి ఎప్పటికప్పుడు కొత్త ఇబ్బందులు వచ్చి పడుతూనే ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఈ సినిమా విడుదల గురించి సోషల్ మీడియాలో చర్చ  మొదలైంది. 
 

Chiyaan Vikram: పేరుకి అవార్డుల హీరో.. కానీ నిర్మాతలకు తప్పని కష్టాలు

Thangalan Release Date: కోలీవుడ్ స్టార్ హీరోలలో ఒకరు అయిన.. చియాన్ విక్రమ్ కు శివ పుత్రుడు, అపరిచితుడు, వంటి హిట్ సినిమాలతో.. తెలుగులో కూడా మంచి ఫ్యాన్ బేస్ ఏర్పడింది. అప్పట్లో ఈ హీరో ఎన్నో అవార్డులు, రివార్డులు అందుకున్నారు. నిమా బాగుంటే ధియేటర్లలో చూసే అభిమానం.. విక్రమ్ కి తెలుగు ఇండస్ట్రీలో.. ఇప్పటికి కూడా ఉంది. పరోసా ప్లాపులు వచ్చినా.. ఇప్పటికీ ఆయన్ని అభిమానించేవారు ఉన్నారు. కానీ ప్రస్తుతం విడుదలవుతున్న ఆయన సినిమాలు అన్ని ఏవో ఒక సమస్యలు ఎదుర్కొంటున్నాయి. ముఖ్యంగా వరస ప్లాపులు తెచ్చుకొని నిర్మాతలకు సైతం ఇబ్బందులని తెచ్చిపెడుతున్నాయి. ఈ క్రమంలో విక్రమ్ నెక్స్ట్ సినిమా విషయంలో బోలెడు ఇబ్బందులు ఎదురయ్యేలా కనిపిస్తున్నాయి. 

విక్రమ్ హీరోగా త్వరలో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న సినిమా తంగాలన్. పా.రంజిత్ ఈ సినిమాకి దర్శకత్వం వహిస్తున్నారు. ఇంతకుముందు సినిమాలతో పోలిస్తే.. ఈ సినిమా కోసం విక్రమ్ చాలానే కష్టాలు పడుతున్నారు. సినిమాలో తన పాత్ర కోసం, తన లుక్ కోసం విక్రమ్ ప్రాణాలు పెడుతున్నారు. 

అయితే అంతా బాగానే ఉంది కానీ..ఈ సినిమాకి  మొదటి నుంచి కొన్ని కష్టాలు మాత్రం తప్పలేదు. ఇందులో మొదటిది అనుకున్న దానికంటే సినిమా బడ్జెట్ భారీగా పెరిగిపోతూ ఉండటం. స్టార్ హీరో సినిమా అన్నాక.. బడ్జెట్ పెరగడం కొత్త కాదు. కానీ అసలు ప్రశ్న ఆ సినిమా విడుదల అయ్యాక అంత రేంజ్ లో.. కలెక్షన్లు చేయగలదా లేదా అని…ఇక తంగాలన్ సినిమా విషయంలో కలెక్షన్లు అంత ఆశాజనకంగా ఉండేలాగా అనిపించడం లేదు. దానికి ముఖ్య కారణం ఎంత విక్రమ్ కోలీవుడ్ లో స్టార్ హీరో అయినప్పటికీ మిగతా భాషల్లో అంత మార్కెట్ లేదు. 

తంగాలన్ సినిమాకి కూడా ఇతర భాషల నుంచి హక్కుల కోసం.. అనుకున్న స్థాయిలో డిమాండ్ కూడా లేదు. మరోవైపు పా.రంజిత్ సినిమాలో తమిళ్లో ఆడాయో లేదో పక్కన పెడితే తెలుగులో మాత్రం బాగా ఆడిన రికార్డు లేదు. ఇక వీళ్ళిద్దరి కాంబోలో సినిమా.. అది కూడా కేవలం మాస్ ప్రేక్షకులకు మాత్రమే నచ్చేలా అనిపించే కంటెంట్.. కాబట్టి సినిమాపై అంత క్రేజ్ లేదు.

మరోవైపు ఈ ఏడాది జనవరిలో విడుదల కావలసిన సినిమా.. సమ్మర్ సీజన్ కూడా పూర్తయిపోతుంది.. కానీ ఇంకా విడుదల తేదీని ప్రకటించలేదు. దసరా లేదా, దివాళి సందర్భంగా విడుదల చేయాలి అనుకుంటే అప్పటికే బోలెడు స్టార్ హీరోల సినిమాలు లైన్లో ఉన్నాయి. పోనీ డిసెంబర్ దాకా ఆగుదాం అన్నా కూడా నిర్మాత ఇంకా ఎక్కువ ఇబ్బందులు పడాల్సి వస్తుంది. మరి ఎన్ని ఆటంకాలను దాటుకుంటూ విక్రమ్ సినిమా.. ఎంతవరకు హిట్ అవుతుందో.. అలానే నిర్మాతలకి లాభం తెచ్చి పెడుతుందో లేదో తెలియాలి అంటే.. మరి కొద్ది రోజులు వేచి చూడాలి.

Also Read: Revanth Phone To CBN: చంద్రబాబుకు రేవంత్ గాలం.. ఫోన్‌ కాల్‌తో ఇండియా కూటమిలోకి ఆహ్వానం?

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిFacebookTwitter

Read More