Home> వినోదం
Advertisement

NBK 107 Vs Chiru 154 : చిరుకి దరిదాపుల్లోకి రాలేని బాలయ్య.. మరీ అంత తక్కువా?.. దటీజ్ మెగాస్టార్

NBK 107 Vs Chiru 154 చిరంజీవి, బాలయ్య ఫ్యాన్స్ మధ్య ఎప్పుడూ కోల్డ్ వార్ జరుగుతుందన్న సంగతి తెలిసిందే. చిరు, బాలయ్య సినిమాల మధ్య ప్రతీ విషయంలోనూ పోటీ నడుస్తూనే ఉంటుంది.

NBK 107 Vs Chiru 154 : చిరుకి దరిదాపుల్లోకి రాలేని బాలయ్య.. మరీ అంత తక్కువా?.. దటీజ్ మెగాస్టార్

NBK 107 Vs Chiru 154 : మెగా ఫ్యామిలీ వర్సెస్ నందమూరి ఫ్యామిలీ అంటూ సోషల్ మీడియాలో జరిగే చర్చ గురించి చెప్పాల్సిన పని లేదు. అసలే ఈ మధ్య మెగా ఫ్యామిలీ కాస్త ఫ్లాపుల్లోకి వెళ్లింది. మరో వైపు నందమూరి ఫ్యామిలీ బ్లాక్ బస్టర్ హిట్లను కొట్టేసింది. బాలయ్య అఖండతో హిట్ కొడితే.. కళ్యాణ్‌ రామ్ బింబిసారతో అందరినీ ఆశ్చర్యపరిచాడు. ఆర్ఆర్ఆర్ సినిమాతో ఎన్టీఆర్, రామ్ చరణ్ ఇద్దరూ హిట్లు కొట్టేశారు. కానీ చిరంజీవి ఆచార్య ఫ్లాప్ దెబ్బ కొట్టేసింది. ఆ డిజాస్టర్ చిరంజీవి, రామ్ చరణ్‌, కొరటాల శివ ఖాతాల్లోకి వెళ్లింది.

అలా చిరంజీవి ఆ ఒక్క ఫ్లాపుతో దారుణాతి దారుణమైన ట్రోలింగ్ బారిన పడ్డాడు. అయితే గాడ్ ఫాదర్ సినిమాకు కాస్త పాజిటివ్ టాక్ వచ్చినా.. కలెక్షన్ల మీద మాత్రం ఆ ప్రభావం పడలేదు. వచ్చే కలెక్షన్లకు, ప్రకటించే కలెక్షన్లకు పొంతన లేదని ట్రేడ్ వర్గాలు చెప్పుకొచ్చాయి. అలా మెగా ఫ్యామిలీ ఇప్పుడు కాసింత వెనకపడింది. నందమూరి వారు క్లీన్ హిట్లు కొట్టేస్తుంటే.. మెగా ఫ్యామిలీ మాత్రం ఇలా బ్రేక్ ఈవెన్ సాధించేందుకు కష్టపడుతోంది.

అయినా కూడా బిజినెస్ పరంగా మెగా ఫ్యామిలీ సినిమాలే ముందున్నాయి. చిరంజీవికి సినిమాకు ఉన్న డిమాండ్, జరుగుతున్న బిజినెస్.. బాలయ్య సినిమాలకు జరగడం లేదు. చిరంజీవి బాబీ దర్శకత్వంలో రాబోతోన్న Chiru 154 సినిమాకు వాల్తేరు వీరయ్య అనే టైటిల్ పరిశీలనలో ఉంది. అయితే ఈ మూవీని సంక్రాంతికి రిలీజ్ చేస్తామని ఇది వరకు ఎప్పుడో ప్రకటించేశారు. 

ఇప్పుడు బాలయ్య కూడా సంక్రాంతి బరిలోకి దిగేందుకు రెడీ అయ్యాడు. గోపీచంద్ మలినేనితో కలిసి తీస్తోన్న NBK 107 అంటే వీరసింహారెడ్డి సినిమాను సంక్రాంతి సీజన్‌కు విడుదల చేయాలని ఫిక్స్ చేశారు. అయితే ఈ రెండు సినిమా బిజినెస్‌లో ఎంతో తేడా ఉందని తెలుస్తోంది. మరీ ముఖ్యంగా ఓవర్సీస్‌లో బాలయ్య సినిమాను మూడు కోట్లకే కొన్నారని, తక్కువ స్క్రీన్లలో రిలీజ్ చేస్తున్నారని సమాచారం. అదే సమయంలో చిరంజీవి సినిమాకు దాదాపు తొమ్మిది కోట్ల మేర బిజినెస్ జరిగిందని టాక్. మరి వీటిలో ఎంత నిజముందో నిర్మాతలకే తెలియాలి.

Also Read : Bigg Boss Geetu : అడిగి మరీ పరువుతీసుకోవడం అంటే ఇదే.. గీతూ అతి ఇక మారదా?

Also Read : Prabhas బర్త్ డే.. ఆదిపురుష్‌ అప్డేట్ చూసి ఏడుస్తున్న అభిమానులు

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

Android Link https://bit.ly/3P3R74U

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Read More