Home> వినోదం
Advertisement

Unstoppable with NBK: ఎట్టకేలకు బాలకృష్ణ వేదికపై చిరంజీవి.. ఫ్యాన్స్ కి పండగేగా..

Unstoppable Season 4: నందమూరి బాలకృష్ణ.. ఆహాలో సూపర్ హిట్ అయిన.. అన్ స్టాపబుల్ సెలబ్రిటీ టాక్ షో సీజన్ 4తో త్వరలో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. ఈ సీజన్లో బాలయ్య ఆహ్వానించనున్న సెలబ్రిటీ గెస్ట్ల జాబితా.. ఇప్పుడు అందరి దృష్టిని ఆకర్షిస్తుంది.
 

Unstoppable with NBK: ఎట్టకేలకు బాలకృష్ణ వేదికపై చిరంజీవి.. ఫ్యాన్స్ కి పండగేగా..

Unstoppable Season 4 Guest List: బాలకృష్ణ హోస్ట్గా.. వ్యవహరిస్తున్న సెలబ్రిటీ టాక్ షో అన్ స్టాపబుల్ గురించి తెలియని వారు ఉండరు. ఎప్పుడూ సీరియస్ గా, గంభీరంగా కనిపించే బాలయ్య లో ఫన్ సైడ్ కూడా ఉంది అని ప్రేక్షకులకు పరిచయం చేసిన షో అది. అందుకే ఇప్పటికే మూడు సీజన్లు వచ్చినా కూడా.. ప్రేక్షకులు మాత్రం ఇంకా ఆసక్తిగా వచ్చే సీజన్ కోసం ఎదురు చూస్తున్నారు. 

ఇప్పటికే అన్ స్టాపబుల్ మూడు సీజన్లు.. పూర్తి అయ్యాయి. అన్నీ మంచి రెస్పాన్స్ అందుకున్నాయి. తాజాగా ఇప్పుడు ఈ షో నాలుగవ సీజన్ త్వరలో మొదలు కాబోతోంది. దీనికి సంబంధించిన పనులు కూడా ఇప్పటికే చాలా వరకు పూర్తయ్యాయి. ఇక నాలుగవ సీజన్ లో ఏ సెలబ్రిటీలు గెస్ట్ లుగా రాబోతున్నారు అనేది హాట్ టాపిక్ గా మారింది.

అసలు కొత్త సీజన్ మొదలు కాబోతోంది అని అనగానే ప్రేక్షకులు ఈ సీజన్ కి అయినా చిరంజీవి గెస్ట్ గా వస్తారా అని ప్రశ్నలు మొదలుపెట్టారు. అనుకున్నట్లుగానే ఈ షో దర్శక నిర్మాతలు ప్రేక్షకులకు సర్ప్రైజ్ ఇవ్వబోతున్నారు. అన్ స్టాపబుల్ సీజన్ 4 కి ముఖ్యఅతిథిగా మెగాస్టార్ చిరంజీవి రాబోతున్నారు. 

దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన ఇంకా వెలువడలేదు.. కానీ ఈ వార్త మాత్రం సోషల్ మీడియాలో తెగ వైరల్ అయిపోతుంది. అయితే ఆగస్టు 22న చిరంజీవి పుట్టినరోజు సందర్భంగా ఈ వార్త అధికారికంగా బయటకు వచ్చే అవకాశం ఉందని సమాచారం. ఒకవేళ అదే నిజం అయితే ఈ విషయం ఫాన్స్ కి పండగ అని చెప్పుకోవచ్చు. 

బాలకృష్ణ, చిరంజీవిలను ఒకేసారి ఒకే వేదిక మీద చూడాలని ఫాన్స్ చాలా ఆసక్తిగా ఎదురు చూస్తూ ఉంటారు. వాళ్ళ క్రేజీ కాంబినేషన్ కి చాలా మంది ఫ్యాన్స్ కూడా ఉన్నారు. ఇక ఆ వినోదం కోసం ఫాన్స్ చాలా ఎక్సైట్ అవుతున్నారు. చిరంజీవితో పాటు ఈసారి అక్కినేని నాగార్జున కూడా గెస్ట్ గా విచ్చేయనున్నారు అని వార్తలు వినిపిస్తున్నాయి. 

ఇంతకు ముందు సీజన్లో చంద్రబాబు నాయుడు కూడా గెస్ట్ గా వచ్చారు. ఈసారి ఆంధ్ర ప్రదేశ్ లో టిడిపి పార్టీ గెలిచింది. ఈ నేపథ్యంలో బాలకృష్ణ మరికొందరు రాజకీయ నాయకులను ఆహ్వానించే అవకాశం ఉందని తెలుస్తోంది. మరి ఎవరెవరు ఈసారి గెస్ట్లుగా బాలకృష్ణతో చర్చ చేయబోతున్నారు అని ఫాన్స్ కూడా ఎదురుచూస్తున్నారు.

Also Read: YS Viveka Murder Case: వైఎస్ జగన్ చెల్లెలు సంచలనం.. వైఎస్‌ వివేకా హత్యపై కీలక పరిణామం

Also Read: Andhra Pradesh: గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులకు గుడ్ న్యూస్‌.. ఇకపై ఆ నిబంధన ఉండదు..

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

TwitterFacebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

Read More