Home> వినోదం
Advertisement

Chiranjeevi: తమ్ముడు నాగబాబు ‘పరువు’ వెబ్ సిరీస్ పై మెగాస్టార్ ప్రశంసల ఝల్లు..

Chiranjeevi: మెగా బ్రదర్ నాగబాబు లీడ్ రోల్లో యాక్ట్ చేసిన వెబ్ సిరీస్ ‘పరువు’. ఈ వెబ్ సిరీస్ ను చిరంజీవి పెద్ద కూతురు సుస్మిత తన భర్త విష్ణు ప్రసాద్ లగ్గిశెట్టితో కలిసి గోల్డ్ బాక్స్ ఎంటర్టైన్మెంట్ ప్రైవేట్ లిమిటెడ్ పతాకంపై నిర్మించారు. తాజాగా ఈ వెబ్ సిరీస్ పై మెగాస్టార్ చిరంజీవి ప్రశంసల ఝల్లు కురిపించారు.

Chiranjeevi: తమ్ముడు నాగబాబు ‘పరువు’ వెబ్ సిరీస్ పై మెగాస్టార్ ప్రశంసల ఝల్లు..

Chiranjeevi : గోల్డ్ బాక్స్ ఎంటర్టైన్మెంట్స్ ప్రైవేట్ లిమిటెడ్ బ్యానర్ పై  విష్ణు ప్రసాద్ లగ్గిశెట్టి, సుస్మిత నిర్మించిన ZEE5 ఒరిజినల్ సిరీస్ ‘పరువు’. సిద్దార్థ్ నాయుడు, వడ్లపాటి రాజశేఖర్ దర్శకత్వం వహించిన ఈ వెబ్ సిరీస్ కు జీ5లో మంచి రెస్పాన్స్ వస్తోంది. ఈ వెబ్ సిరీస్ లో ముఖ్యపాత్రలో నాగబాబు నటించారు. ఇతర పాత్రల్లో నివేదా పేతురాజ్, నరేష్ అగస్త్య, అమిత్ తివారి, ప్రణీత పట్నాయక్, బిందు మాధవి వంటి వారు లీడ్ రోల్స్ లో నటించారు.  ఈ సిరీస్ ఈ నెల 14 నుంచి జీ5లో స్ట్రీమింగ్ అవుతోంది.

ఈ వెబ్ సిరీస్ ఎంతో ఆసక్తికంగా ప్రేక్షకులను కళ్లు తిప్పుకోకుండా గ్రిప్పింగ్‌గా ఉండటం.. ఉత్కంఠ భరితంగా సాగడం వంటివి ప్రేక్షకులను కట్టిపడేస్తున్నాయి. ఆడియన్స్ కూడా పరువు రెండో సీజన్ ఎపుడు వస్తుందా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.తాజాగా పరువు వెబ్ సిరీస్‌ను చూసిన మెగాస్టార్ చిరంజీవి సోషల్ మీడియా వేదికగా ట్వీట్ వేశారు. ఈ సిరీస్ ఆద్యంతం బాగుందన్నారు. అంతేకాదు రెండో సీజన్ కోసం ఎదురుచూస్తున్నట్టు చెప్పుకొచ్చారు.

ఒక చక్కటి ప్లాన్‌తో చందు బాడీ మాయం చేయడం కోసం ఆ జంట పడే తిప్పలు, అదే విషయమై ఎమ్మెల్యే పడే పాట్లు. చివరకి ఈ జంట  తప్పించుకుందా లేదా అని సీజన్‌2 లోనే చూడాలనుకుంటా అని తన ఎగ్జైట్మెంట్‌ను పంచుకున్నారు చిరంజీవి. ‘పరువు చాలా పెద్ద సక్సెస్ అయింది.. తెలుగు ఓటీటీలో అద్భుతమైన కంటెంట్‌ను ఇస్తున్న తన కూతురు సుష్మిత కొణిదెలను చూస్తుంటే ఎంతో గర్వంగా ఉందని కొనియాడారు. నా ప్రియమైన సోదరుడు నాగబాబు అద్బుతంగా నటించారని  చిరంజీవి వేసిన ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

Also Read: Smriti Mandhana: లేడీ కోహ్లీ స్మృతి మంధాన సంచలన రికార్డు.. భారత తొలి క్రికెటర్‌గా

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి FacebookTwitter

Read More