Home> వినోదం
Advertisement

తమిళ సినిమాపై కన్నేసిన Chiranjeevi ?

తమిళ స్టార్ హీరో అజిత్ కుమార్ ( Ajith Kumar ) హీరోగా తెరకెక్కిన వేదలమ్ మూవీ తమిళంలో సూపర్ హిట్ అయ్యింది. ఈ చిత్రం తెలుగులో రీమేక్ ( Vedalam Telugu remake ) కానుందనే టాక్ ఇవాళ కొత్త కాదు.

తమిళ సినిమాపై కన్నేసిన Chiranjeevi ?

తమిళ స్టార్ హీరో అజిత్ కుమార్ ( Ajith Kumar ) హీరోగా తెరకెక్కిన వేదలమ్ మూవీ తమిళంలో సూపర్ హిట్ అయ్యింది. ఈ చిత్రం తెలుగులో రీమేక్ ( Vedalam Telugu remake ) కానుందనే టాక్ ఇవాళ కొత్త కాదు. కానీ ఇంతవరకు ఆ దిశగా ముందడుగు పడలేదు. ఐదేళ్ల క్రితమే యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ ( Tarak ) ఈ సినిమాను తెలుగులో రీమేక్ చేయనున్నట్టు అప్పట్లో వార్తలొచ్చాయి. కానీ అది కుదరలేదు. ఆ తర్వాత పవర్ స్టార్ పవన్ కల్యాణ్ ( Pawan Kalyan ) కాటమరాయుడు మూవీ తర్వాత వెదలం సినిమాను తెలుగులో రీమేక్ చేయనున్నట్టు అప్పట్లో జోరుగా ప్రచారం జరిగింది. కానీ అది కూడా పట్టాలెక్కలేదు. తాజాగా ఈ వెదలం తెలుగు రీమేక్ గురించి ఇటీవల ఒకట్రెండు నెలలుగా మళ్లీ టాక్ నడుస్తోంది. Also read: Rakul Preet: ఆ బయోపిక్‌లో రకుల్ ప్రీత్ సింగ్
 
ఫిలింనగర్ తాజా టాక్ ప్రకారం మెగాస్టార్ చిరంజీవి ( Chiranjeevi ) వెదలం తెలుగు రీమేక్‌పై ఆసక్తి చూపిస్తున్నారని.. మెహర్ రమేష్ ( Meher Ramesh ) డైరెక్షన్‌లో ఆయన చేయనున్న సినిమా అదేననే టాక్ వినిపిస్తోంది. ఇప్పటికే ఆ సినిమాను మెహర్ రమేష్ తెలుగు నేటివిటికీ అనుగుణంగా కథను సిద్ధం చేసినట్టు ఫిలింనగర్ వర్గాలు చెప్పుకుంటున్నాయి. చిరంజీవికి సన్నిహితుడైన ప్రముఖ నిర్మాత కె.ఎస్. రామారావు క్రియేటివ్ కమర్షియల్స్ బ్యానర్‌పై నిర్మించనున్నాడని తెలుస్తోంది. ఏది ఏమైనా.. ఈ ప్రాజెక్టుపై అధికారిక ప్రకటన ఏదీ వెలువడకపోవడం గమనార్హం. Also read: Color Photo teaser: టీజర్‌‌కి సూపర్ రెస్పాన్స్

Read More