Home> వినోదం
Advertisement

Chiranjeevi - Khushbu Sundar : జాతీయ మహిళా కమిషన్‌లోకి కుష్బూ.. చిరు ప్రశంసలు.. గాల్లో తేలిపోయిన నాటి నటి

members of National Commission for Women జాతియ మహిళా కమిషన్ సభ్యురాలిగా కుష్బూని కేంద్రం నియమించింది. ఈ బాధ్యతను తనకు ఇవ్వడంతో కుష్బూ ఎమోషనల్ అయింది. అయితే ఇలాంటి పదవి చేపడుతుండటంతో చిరంజీవి అభినందనలు తెలిపాడు.

Chiranjeevi - Khushbu Sundar : జాతీయ మహిళా కమిషన్‌లోకి కుష్బూ.. చిరు ప్రశంసలు.. గాల్లో తేలిపోయిన నాటి నటి

Khushbu Sundar As National Women Commission Member జాతీయ మహిళా కమిషన్‌ సభ్యురాలిగా కేంద్రం సీనియర్ నటి, బీజేపీ నాయకురాలు కుష్బూని నియమించింది. కుష్బూకి దక్కిన గౌరవం, వచ్చిన బాధ్యతలపై చిరంజీవి స్పందించాడు. నువ్ కచ్చితంగా దీనికి అర్హురాలివే.. నీ వల్ల మరింత ఈ సంస్థ శక్తివంతంగా మారుతుందని, మరింతగా న్యాయం జరుగుతుందని నేను నమ్ముతున్నాను.. అంటూ చిరంజీవి అభినందనలు తెలిపాడు.

కేంద్రం తనకు ఈ బాధ్యతలు అప్పగించడంతో పొంగిపోయింది కుష్బూ. తనకు ఈ అవకాశం ఇచ్చిన భారత ప్రభుత్వానికి, నరేంద్రమోదికి థాంక్స్ చెప్పింది. తన బాధ్యతలను నిర్వర్తించేందుకు శాయశక్తుల ప్రయత్నిస్తానని, నారీ శక్తిని మరింత బలోపేతం చేసేందుకు పాటు పడుతాను అని, మీ ఆధ్వర్యంలో మరింత ఉత్తేజంతో పని చేస్తామని కుష్బూ చెప్పుకొచ్చింది.

ఇక కుష్బూకి ఇంతటి బాధ్యతలు దక్కడంతో చిరు స్పందించాడు. తన తోటి నటిని అభినందించాడు. చిరు అభినందనలకు కుష్బూ స్పందించింది. థాంక్యూ వెరీ మచ్ సర్.. మీరు మాట్లాడిన మాటలు నాకు ఎంతో ఉత్తేజాన్ని ఇచ్చాయి.. నా శక్తికి మించి ప్రయత్నం చేస్తానని మాటిస్తున్నాను అంటూ కుష్బూ గాల్లో తేలిపోయినట్టుంది.

 

చిరంజీవి కుష్బూ ఈ మధ్యే ఓ ఈవెంట్‌లో కలిసి నట్టుగా ఉన్నారు. అయితే కుష్బూ అయితే ఇప్పుడు సినిమాలకు దూరంగానే ఉంటున్నట్టుగా అనిపిస్తోంది. చివరగా ఆమె ఆడవాళ్లు మీకు జోహార్లు అనే సినిమాలో కనిపించింది. వారసుడు సినిమాలో ఆమె నటించిందని ముందుగా వార్తలు వచ్చాయి. కానీ ఎడిటింగ్ టేబుల్ వద్ద ఆమె నటించిన సీన్లన్నీ కట్ అయిపోయాయట. అయితే ఈ విషయాన్ని మాత్రం కుష్బూ ఎక్కడా చెప్పడం లేదు. చిత్రయూనిట్‌నే ఆ విషయాన్ని అడగండి అంటూ దాట వేస్తోంది కుష్బూ. 

ఎడిటింగ్‌లో ఆమె నటించిన సీన్లు కట్ అయ్యాయని, ఆ విషయాన్ని డైరెక్టర్ ముందుగానే ఆమెకు తెలియజేశారని, ఆ సీన్లన్నీ ఎంతో బాగా వచ్చాయని, ఆమె సీన్లను కత్తిరించాల్సి రావడం బాధగానే అనిపించిందని ఎడిటర్ చెప్పుకొచ్చిన సంగతి తెలిసిందే.

Also Read:  Rahul Sipligunj : బికినీ భామలతో రాహుల్ సిప్లిగంజ్ రొమాన్స్.. బడ్జెట్ బద్దల్ బాషింగాలైంతాందట!

Also Read: Naga Chaitanya - Samantha : నాగ చైతన్య అంటే మరీ అంత ద్వేషమా?.. అందుకే అలా చేసిందా? సమంతకు చైతూకి అదే తేడా

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 

ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook

Read More