Home> వినోదం
Advertisement

Chiranjeevi calls Mohan Babu: మోహన్ బాబుకు చిరంజీవి ఫోన్.. MAA elections రచ్చపైనే చర్చ

Chiranjeevi calls Mohan Babu: ప్రకాశ్ రాజ్‌కి మా ఎన్నికల్లో మద్దతు పలికిన చిరంజీవే అతడి వెనుక ఉండి ఇవన్నీ చేయిస్తున్నారని మోహన్ బాబు (Mohan Babu comments on Chiranjeevi) భావించే పరిస్థితులు ఏర్పడ్డాయి. ఇవన్నీ చూశాకా మోహన్ బాబు, చిరంజీవి మధ్య దూరం ఇంకా పెరిగిందనే టాక్ మరింత బలంగా వినిపించింది.

Chiranjeevi calls Mohan Babu: మోహన్ బాబుకు చిరంజీవి ఫోన్.. MAA elections రచ్చపైనే చర్చ

Chiranjeevi calls Mohan Babu: చిరంజీవి తాజాగా మోహన్ బాబుకు ఫోన్ చేసి పలకరించారు. మెగాస్టార్ చిరంజీవి, మరో సీనియర్ స్టార్ హీరో మోహన్ బాబు మధ్య మా ఎన్నికలు చిచ్చు పెట్టాయనే పబ్లిక్ టాక్ వినిపిస్తున్న ప్రస్తుత తరుణంలోనే చిరంజీవి స్వయంగా మోహన్ బాబుకి ఫోన్ చేయడం ప్రాధాన్యతను సంతరించుకుంది. మా ఎన్నికల సమయంలో సంఘం అధ్యక్ష పదవికి పోటీ చేసిన ప్రకాశ్ రాజ్‌కి చిరంజీవి ఫ్యామిలీ నుంచి గట్టి మద్దతు లభించడం, మరోవైపు మంచు విష్ణు ప్యానెల్ నుంచి మెగా హీరోలపై పలు కామెంట్స్ రావడం లాంటి పరిణామాలు మెగా ఫ్యామిలీకి, మంచు మోహన్ బాబు ఫ్యామిలీకి (Chiranjeevi family vs Mohan Babu family) మధ్య దూరం పెంచిందా అనే అభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. 

అంతటిపోటీ ఆగని ఈ వివాదం... మా ఎన్నికల తర్వాత కూడా కొనసాగింది. మా ఎన్నికల్లో అధ్యక్షుడిగా ఎన్నికైన మంచు విష్ణు.. తాను ఈ విషయం చెప్పకూడదంటూనే ఓ విషయం చెప్పుకొచ్చాడు. అదేమంటే.. ప్రకాశ్ రాజ్‌కి పోటీ లేకుండా అతడిని ఏకగ్రీవంగా గెలిపిద్దాం అని మెగాస్టార్ చిరంజీవి అన్నారని, అధ్యక్ష పదవికి ప్రకాశ్ రాజ్‌పై (Prakash Raj) పోటీ చేసిన తనను పోటీ నుంచి తప్పుకోవాల్సిందిగా సూచించారని మంచు విష్ణు చేసిన వ్యాఖ్యలు మరోసారి ఆ రెండు కుటుంబాల మధ్య విభేదాలు పొడచూపాయా అనే అనుమానాలకు తావిచ్చాయి.

ఈ విభేదాలు ఇలా ఉండగానే మరోవైపు ప్రకాశ్ రాజ్ సైతం తన ఓటమిని అంగీకరించకపోగా.. మంచు విష్ణు విజయంపై (Manchu Vishnu) అనేక అనుమానాలు వ్యక్తంచేశారు. తాను అసోసియేషన్‌కి రాజీనామా చేయడమే కాకుండా.. తన ప్యానెల్ నుంచి గెలిచిన వాళ్లు కూడా రాజీనామా చేసేలా చేశారనే అభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. దీంతో ప్రకాశ్ రాజ్‌కి మా ఎన్నికల్లో మద్దతు పలికిన చిరంజీవే అతడి వెనుక ఉండి ఇవన్నీ చేయిస్తున్నారని మోహన్ బాబు (Mohan Babu comments on Chiranjeevi) భావించే పరిస్థితులు ఏర్పడ్డాయి. ఇవన్నీ చూశాకా మోహన్ బాబు, చిరంజీవి మధ్య దూరం ఇంకా పెరిగిందనే టాక్ మరింత బలంగా వినిపించింది.

Also read : Bujji Ila Raa Teaser: బుజ్జి ఇలా రా టీజర్.. ఇంతకీ ఆ పోలీస్ కిడ్నాపర్ ఎవరు ?

ఈ నేపథ్యంలోనే మోహన్ బాబుకు చిరంజీవి ఫోన్ చేయడం అటు సినీవర్గాల్లో ఇటు ఆడియెన్స్‌, అభిమానుల్లో చర్చనియాంశమైంది. తమ మధ్య అందరూ అనుకుంటున్నట్టుగా ఎలాంటి విభేదాలు లేవని (Chiranjeevi, Mohan Babu, Pawan Kalyan, Manchu Vishnu) చాటిచెప్పడం కోసమే చిరంజీవి ఇలా మోహన్ బాబుకు ఫోన్ చేసి ఉంటారనే టాక్ వినిపిస్తోంది.

Also read : Kota Srinivasa Rao: అనసూయ డ్రెస్సింగ్‌ మారిస్తే బాగుంటుంది: కోటశ్రీనివాసరావు

Also read : Surekha Vani Second Marriage News: నటి సురేఖ వాణి రెండో పెళ్లి చేసుకుందా..?? వైరలైన ఫోటోలు

Also read : Movies this Week: ఈ వారం ఓటీటీ, ధియేటర్ల రిలీజ్ చిత్రాలివే

Read More