Home> వినోదం
Advertisement

Chiranjeevi: మళ్ళీ ఆ డైరెక్టర్ తో మెగాస్టార్ సినిమా.. వర్క్ అవుట్ అవుతుందా?

Chiranjeevi Vishwambhara: వివి వినాయక్ దర్శకత్వంలో మెగాస్టార్ చిరంజీవి హీరోగా.. విడుదల అయిన ఠాగూర్, ఖైదీ నంబర్ 150 మంచి విజయం సాధించిన సంగతి తెలిసిందే. తాజాగా ఇప్పుడు మళ్ళీ వీళ్ళిద్దరి కాంబో లో సినిమా ఉంటుందని టాక్ వినిపిస్తోంది .
 

Chiranjeevi: మళ్ళీ ఆ డైరెక్టర్ తో మెగాస్టార్ సినిమా.. వర్క్ అవుట్ అవుతుందా?

Chiranjeevi Upcoming Movies: ఆది, చెన్నకేశవ రెడ్డి, దిల్ వంటి బ్లాక్ బస్టర్ సినిమాలకి.. దర్శకత్వం వహించిన డైరెక్టర్.. వివి వినాయక్ ఇండస్ట్రీలో మంచి పేరు తెచ్చుకున్నారు. కానీ గత కొంతకాలంగా వినాయక దర్శకత్వం వహించిన ఒక్క సినిమా.. కూడా బాక్సాఫీస్ వద్ద హిట్ కాలేదు. ఖైదీ నెంబర్ 150.. కూడా మెగాస్టార్ చిరంజీవి కమ్ బ్యాక్ మూవీ.. కాబట్టి కమర్షియల్ గా బాగానే నడిచింది. కానీ ఆ తర్వాత విడుదలైన ఇంటెలిజెంట్ సినిమా మాత్రం బాక్స్ ఆఫీస్ వద్ద డిజాస్టర్ గానే నిలిచింది. 

అయితే తాజా సమాచారం ప్రకారం వివి నాయక్ కి ఇప్పుడు మెగాస్టార్ చిరంజీవి తో ఇంకొక సినిమా చేసే అవకాశం వచ్చినట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి. ప్రస్తుతం మెగాస్టార్ చిరంజీవి మల్లిడి వశిష్ట దర్శకత్వంలో విశ్వంభర సినిమా షూటింగ్ తో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. తాజాగా డైరెక్టర్ వివి వినాయక్.. మెగాస్టార్ చిరంజీవి విశ్వంభర సెట్స్ మీదకి వచ్చి మరి కలిసి వెళ్లారు. 

దీంతో మెగాస్టార్ చిరంజీవి.. వినాయక్ కాంబినేషన్లో మరొక సినిమా రాబోతోందా.. అని పుకార్లు మొదలయ్యాయి. మరోవైపు చిరంజీవి కళ్యాణ్ కృష్ణ దర్శకత్వంలో.. బ్రో డాడీ సినిమా.. రీమేక్ చేయాలి. కానీ ఆ సినిమా క్యాన్సిల్ అయిపోయింది. 

వరుసగా వస్తున్న ఫ్లాప్స్ తర్వాత.. చిరంజీవి కూడా కొద్ది రోజులు రీమేక్ సినిమాలకి..దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నారు. అయితే ప్రస్తుతం చిరంజీవి హరీష్ శంకర్ కాంబినేషన్లో సినిమా ఓకే అయ్యిందని వార్తలు వినిపిస్తున్నాయి. కానీ అధికారిక ప్రకటన ఇంకా వెలువడలేదు. 

కాబట్టి మంచి కథతో వివి వినాయక్ వచ్చి ఉంటే.. చిరంజీవి గ్రీన్ సిగ్నల్ ఇచ్చే అవకాశాలు ఎక్కువగానే ఉన్నాయి. కానీ వివి వినాయక్ కెరియర్ గ్రాఫ్ ని చూసే.. అభిమానులు నిరాశ చెందుతున్నారు. చిరంజీవితో చేసిన ఠాగూర్, ఖైదీ నెంబర్ 150 మంచి విషయాలు సాధించినప్పటికీ.. ఈ మధ్య వినాయక తీసిన సినిమాలన్నీ డిజాస్టర్స్ గా నిలిచాయి. మరి ఇలాంటి నేపథ్యంలో.. వీళ్ళిద్దరి కాంబినేషన్లో సినిమా ఉంటుందో లేదో.. తెలియాలంటే మరికొద్ది రోజులు ఆగాల్సిందే. 

మరోపక్క..చిరంజీవి పెద్ద స్టార్ డైరెక్టర్ లతో.. వైవిద్యమైన సినిమాలు చేస్తే బాగుంటుంది ..అని ఫ్యాన్స్ అనుకుంటున్నారు. త్రివిక్రమ్, సుకుమార్ లాంటి డైరెక్టర్ లతో చిరు సినిమా అంటే కచ్చితంగా క్రేజీ కాంబో అవుతుంది. మరి ఫ్యాన్స్ మాటలు విని చిరంజీవి కూడా అలాంటి నిర్ణయాలు తీసుకుంటారో లేదో వేచిచూడాలి.

Also Read: Pension Hike: ఆంధ్రప్రదేశ్ ప్రజలకు జూలై 1న పండగే.. ఒక్కొక్కరికి రూ.7 వేలు

Also Read: Hyper Aadi: డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ను వాడేసుకుంటున్న కమెడియన్ హైపర్ ఆది

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి FacebookTwitter

Read More