Home> వినోదం
Advertisement

Chinmayi slams Vairamuthu: వైరముత్తు వేధింపులపై మరోసారి చిన్మయి సంచలన ట్వీట్స్

Chinmayi sexual harassment allegations against Vairamuthu: తమిళట ప్రముఖ గేయ రచయితగా పేరు తెచ్చుకున్న వైరముత్తు తనపై లైంగిక వేధింపులకు యత్నించినట్లు గతంలో అతడిపై ప్రముఖ గాయని చిన్మయి ఆరోపించడం.. ఆమె చేసిన #MeToo ఆరోపణలు తమిళ సినీ పరిశ్రమలోనే కాకుండా దక్షిణాది సినీ పరిశ్రమలోనే సంచలనం సృష్టించడం తెలిసిందే. 

Chinmayi slams Vairamuthu: వైరముత్తు వేధింపులపై మరోసారి చిన్మయి సంచలన ట్వీట్స్

Chinmayi sexual harassment allegations against Vairamuthu: తమిళట ప్రముఖ గేయ రచయితగా పేరు తెచ్చుకున్న వైరముత్తు తనపై లైంగిక వేధింపులకు యత్నించినట్లు గతంలో అతడిపై ప్రముఖ గాయని చిన్మయి ఆరోపించడం.. ఆమె చేసిన #MeToo ఆరోపణలు తమిళ సినీ పరిశ్రమలోనే కాకుండా దక్షిణాది సినీ పరిశ్రమలోనే సంచలనం సృష్టించడం తెలిసిందే. రెండేళ్ల క్రితం అలా వైరముత్తుపై ( Vairamuthu ) సంచలన ఆరోపణలు చేసిన చిన్మయి.. తాజాగా అతడిపై మరోసారి సోషల్ మీడియా వేదికగా ఆరోపణలు చేసింది. గతంలో ఓ టీవీ ఛానెల్లో వీజేగా పనిచేసిన మరో యువతిపైనా వైరముత్తు వేధింపులకు ( VJ allegations on Vairamuthu ) పాల్పడ్డాడని చిన్మయి ఆరోపించింది. ఆ వీడియో జాకీ పంపించిన మెసేజ్‌లను ట్విటర్‌లో షేర్‌ చేసుకున్న చిన్మయి.. సదరు యువతికి కుటుంబం నుంచి సహకారం లేకపోవడం వల్లే తనకు ఎదురైన వేధింపులపై ఆమె పెదవి విప్పడానికి రెండేళ్లు పట్టిందని తన ట్వీట్‌లో పేర్కొంది. Also read : Chinmayi Sripaada: సింగర్ చిన్మయికి షాక్.. నామినేషన్ తిరస్కరణ!

తనకు వైరముత్తు చేతిలో వేధింపులకు గురైన బాధితి యువతి పంపిన మొబైల్ సందేశాలకు సంబంధించిన స్క్రీన్‌షాట్స్‌ని చిన్మయి ట్విటర్‌లో షేర్ చేసుకోగా అందులో ఇలా రాసి ఉంది.‘ తాను కాలేజీ చదువుకునే రోజుల్లోనే ఓ పుస్తకావిష్కరణలో వైరముత్తును కలిసి ఆటోగ్రాఫ్‌ అడిగానని.. అప్పుడు ఆయన ఆటోగ్రాఫ్‌తో పాటు తన ఫోన్‌ నంబర్‌ కూడా రాసిచ్చారని, కానీ తనది చిన్న వయసు కావడంతో ఆయన నంబర్‌ ఎందుకిచ్చారనే విషయాన్ని అప్పుడు అర్థం చేసుకోలేకపోయాను.  ఆ తర్వాత తాను ఓ టీవీ ఛానెల్‌లో వీజేగా పనిచేస్తున్న రోజుల్లో ఓసారి తనని కలిసిన వైరముత్తు... ఈసారి తన మొబైల్‌ నంబర్‌ అడిగి తీసుకున్నారని ఆమె గుర్తుచేసుకున్నారు. ఇక అది మొదలు తరచూ ఫోన్‌ చేయడం, సందేశాలు పంపుతూ వేధించడం మొదలుపెట్టాడని... ఆయన వ్యవహార శైలి గురించి తెలుసుకుని షాక్‌ అయ్యానని ఆ యువతి అందులో చెప్పుకొచ్చారు. మౌంట్‌ రోడ్దు దగ్గరున్న ఓ ప్రాంతానికి తనని రమ్మని వేధించేవాడని.. గంటలో 60 సార్లు ఫోన్ చేసి వేధించే వాడని చెప్పుకుని ఆ యువతి తీవ్ర ఆవేదన వ్యక్తంచేసినట్టుగా చిన్మయి ట్విటర్‌లో షేర్ చేసుకున్న స్క్రీన్‌షాట్స్‌లో రాసి ఉంది. Also read : Ashima Narwal smoking video: స్మోకింగ్ చేస్తూ బాలయ్య బాబు డైలాగ్ చెప్పిన హీరోయిన్

తాను తన ఫోన్ నెంబర్‌ మార్చినా.. ఎలాగోలా తెలుసుకొని ఫోన్‌ చేస్తుండేవారు. చివరకు తాను పనిచేస్తున్న టీవీ ఛానెల్ బాస్ సహాయంతో వైరముత్తు భార్యకు ( Vairamuthu's wife) ఫోన్ చేసి చెప్పిన తర్వాతే అతడి నోరు మూయించగలిగాను’ అని వైరముత్తుపై ఆ యువతి చేసిన ఆరోపణలను చిన్మయి అలాగే ట్విటర్‌లో షేర్ చేసుకోవడంతో మరోసారి వైరముత్తు వ్యవహారం తమిళనాట టాక్ ఆఫ్ ది టౌన్ అయింది. Also read : Vijay Sethupathi: ‘షేమ్ ఆన్ విజయ్ సేతుపతి’ అంటూ.. నెటిజన్ల ఆగ్రహం

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. విద్య, వినోదం, రాజకీయాలు, క్రీడలు, హెల్త్, లైఫ్‌స్టైల్, సామాజికం, ఉపాధి.. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe

 

Read More