Home> వినోదం
Advertisement

Cheating Case on RGV: రాంగోపాల్ వర్మపై చీటింగ్ కేసు... రూ.56 లక్షలు తీసుకుని మోసం...?


Cheating Case on RGV: దర్శకుడు రాంగోపాల్ వర్మ తనను మోసం చేశాడంటూ ఓ వ్యక్తి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. తన వద్ద డబ్బు తీసుకుని తిరిగి చెల్లించట్లేదని ఫిర్యాదులో ఆరోపించాడు. 

Cheating Case on RGV: రాంగోపాల్ వర్మపై చీటింగ్ కేసు... రూ.56 లక్షలు తీసుకుని మోసం...?

Cheating Case on RGV: సంచలనాలకు, వివాదాలకు కేరాఫ్ అయిన దర్శకుడు రాంగోపాల్ వర్మపై తాజాగా హైదరాబాద్‌లోని మియాపూర్ పోలీస్ స్టేషన్‌లో చీటింగ్ కేసు నమోదైంది. శేఖర్ ఆర్ట్ క్రియేషన్ యజమాని శేఖర్ రాజు ఫిర్యాదు మేరకు వర్మపై పోలీసులు కేసు నమోదు చేశారు. 'దిశ' సినిమా నిర్మాణ సమయంలో వర్మ తన నుంచి రూ.56 లక్షలు తీసుకున్నట్లు శేఖర్ రాజు తన ఫిర్యాదులో పేర్కొన్నారు. తనకు ఇవ్వాల్సిన డబ్బు ఇవ్వకపోగా భయభ్రాంతులకు గురిచేస్తున్నాడని ఆరోపించాడు. ఈ వ్యవహారంపై ప్రస్తుతం పోలీసులు దర్యాప్తు జరుపుతున్నట్లు తెలుస్తోంది. 

రాంగోపాల్ వర్మ సమర్పణలో 'ఆశ ఎన్‌కౌంటర్' సినిమా ఈ ఏడాది జనవరిలో విడుదలైన సంగతి తెలిసిందే. నిజానికి ఈ సినిమాకు మొదట దిశ ఎన్‌కౌంటర్ అనే టైటిల్ పెట్టినప్పటికీ.. ఆ తర్వాత 'ఆశ ఎన్‌కౌంటర్'గా పేరు మార్చారు. నవంబర్, 2019లో హైదరాబాద్ శివారులో వెటర్నరీ డాక్టర్‌పై జరిగిన హత్యాచార ఘటన.. నిందితుల ఎన్‌కౌంటర్ నేపథ్యంలో ఈ సినిమాను తెరకెక్కించారు. కోర్టు వివాదాలతో పలుమార్లు వాయిదా పడుతూ వచ్చిన ఈ సినిమా ఎట్టకేలకు ఈ ఏడాది జనవరిలో విడుదలైంది. ఈ సినిమాపై కోర్టులో కేసు నడుస్తున్న సమయంలో... దీనికి, వర్మకు ఎటువంటి సంబంధం లేదని దర్శక, నిర్మాతలు న్యాయస్థానానికి వెల్లడించారు. తాజాగా శేఖర్ రాజు అనే వ్యక్తి ఈ సినిమా కోసం వర్మకు రూ.56 లక్షలు ఇచ్చి మోసపోయానని తెర పైకి రావడం ఆసక్తికరంగా మారింది. 

ఇటీవల ప్రముఖ నిర్మాత నట్టి కుమార్ సైతం ఆర్థిక లావాదేవీల విషయంలో రాంగోపాల్ వర్మపై కోర్టుకెక్కిన సంగతి తెలిసిందే. వర్మ నుంచి తనకు సుమారు రూ.5.29 కోట్లు రావాల్సి ఉందని నట్టి కుమార్ ఆరోపించారు. ఈ వ్యవహారంలో ఆయన కోర్టుకు వెళ్లడంతో రాంగోపాల్ వర్మ 'మా ఇష్టం' సినిమా విడుదలకు బ్రేక్ పడింది. గత కొన్నేళ్లుగా రాంగోపాల్ వర్మ తన సినిమాలు, వ్యవహార శైలితో వరుసగా వివాదాల్లో నిలుస్తున్నారు.

Also Read: పట్టుమని పదేళ్లు లేవు.. తల్లిదండ్రులకే ఊహించని షాకిచ్చిన బుడతలు... ఈ అన్నాదమ్ములు మహా ముదుర్లు..  

Also Read:  Viral Video: కొన్నది సెకండ్ హ్యాండ్ సైకిలే కానీ.. బెంజ్ కారు కొన్న రేంజ్‌లో సంతోషం! కన్నీళ్లు పెట్టిస్తున్న వీడియో

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook 

Read More